Special Trains : రైల్వే శాఖ నుంచి గుడ్‌న్యూస్.. విశాఖ‌ప‌ట్నం- భువ‌నేశ్వ‌ర్ మ‌ధ్య అన్‌రిజ‌ర్డ్వ్ ఎక్స్‌ప్రెస్-5 special trains available under east coast railway ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Special Trains : రైల్వే శాఖ నుంచి గుడ్‌న్యూస్.. విశాఖ‌ప‌ట్నం- భువ‌నేశ్వ‌ర్ మ‌ధ్య అన్‌రిజ‌ర్డ్వ్ ఎక్స్‌ప్రెస్

Special Trains : రైల్వే శాఖ నుంచి గుడ్‌న్యూస్.. విశాఖ‌ప‌ట్నం- భువ‌నేశ్వ‌ర్ మ‌ధ్య అన్‌రిజ‌ర్డ్వ్ ఎక్స్‌ప్రెస్

HT Telugu Desk HT Telugu
Oct 29, 2024 05:23 PM IST

Special Trains : ప్ర‌యాణికులకు ఈస్ట్‌ కోస్ట్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. 5 ప్ర‌త్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. రద్దీని క్లియర్ చేయడానికి విశాఖపట్నం- భువనేశ్వర్- విశాఖపట్నం మధ్య అన్‌రిజర్డ్వ్ ప్రత్యేక రైళ్లు, విశాఖపట్నం- దానాపూర్- విశాఖపట్నం మ‌ధ్య ప్రత్యేక రైళ్ల‌ను నడపాలని నిర్ణయించింది.

ఈస్ట్‌ కోస్ట్ రైల్వే
ఈస్ట్‌ కోస్ట్ రైల్వే

విశాఖపట్నం - భువనేశ్వర్ జనసాధరణ ప్రత్యేక (08536) రైలు విశాఖపట్నం నుండి న‌వంబర్ 15 (ప్రతిరోజు) మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరుతుంది. ఇది సింహాచలంలో మ‌ధ్యాహ్నం 12:15 గంట‌ల‌కు, కొత్తవలసకు మ‌ధ్యాహ్నం 12:30 గంట‌లకు, విజయనగరంకు మ‌ధ్యాహ్నం 1 గంట‌కు, చీపురుపల్లికి మ‌ధ్యాహ్నం 1:32 గంటలకు, పొందూరుకు మ‌ధ్యాహ్నం 1:52 గంట‌ల‌కు, శ్రీకాకుళం రోడ్డుకు మ‌ధ్యాహ్నం 2:08 గంట‌ల‌కు చేరుకుంటుంది. రాత్రి 7:45 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.

భువనేశ్వర్ - విశాఖపట్నం జనసాధరణ ప్రత్యేక (08535) రైలు న‌వంబ‌ర్ 15 ప్ర‌తి రోజూ రాత్రి 8:30 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి మరుసటి రోజు తెల్ల‌వారు జామున 4:40 గంటలకు నౌపడ చేరుకుంటుంది. శ్రీకాకుళం రోడ్డుకు ఉద‌యం 5:13 గంటల‌కు, పొందూరుకు ఉద‌యం 5:28 గంట‌ల‌కు, చీపురుపల్లికి ఉద‌యం 5:48 గంట‌ల‌కు, విజయనగరంకు ఉద‌యం 6:15 గంట‌ల‌కు, కొత్తవలసకు ఉద‌యం 6:45 గంట‌ల‌కు, సింహాచలంకు ఉద‌యం 7:08 గంటలకు, ఉద‌యం 8:45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

ఈ రెండు రైళ్లు విశాఖపట్నం- భువనేశ్వర్ మధ్య సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు, శ్రీకాకుళం రోడ్డు, నౌపడ, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం, బ్రహ్మాపూర్, ఛత్రపూర్, బాలుగావ్, ఖుర్దా రోడ్డు స్టేష‌న్ల‌లో స్టాప్ ఆగుతాయి. ఈ రైళ్ల‌కు జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు-10, సెకండ్ క్లాస్ కమ్ దివ్యాంగజన్ కోచ్ -1, మోటార్ కార్-1 కోచ్‌లు ఉన్నాయి.

విశాఖపట్నం - దానాపూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08520) రైలు విశాఖపట్నం నుండి న‌వంబ‌ర్ 4 (సోమవారం) ఉద‌యం 9:10 గంటలకు బయలుదేరుతుంది. మంగ‌ళ‌వారం ఉదయం 11 గంటలకు దానాపూర్‌ చేరుకుంటుంది. దానాపూర్ -విశాఖపట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08519) రైలు న‌వంబ‌ర్ 5 (మంగళవారం) మ‌ధ్యాహ్నం 12:30 గంటలకు దానాపూర్‌లో బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు (బుధ‌వారం) మ‌ధ్యాహ్నం 3:45 గంటలకు విశాఖ‌ప‌ట్నం చేరుకుంటుంది.

ఈ రెండు రైళ్లు విశాఖపట్నం నుండి దానాపూర్ మధ్య సింహాచలం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, బాలుగావ్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, జజ్‌పుర్‌కియోంజర్ రోడ్, భద్రక్, బాలాసోర్, హిజ్లీ, మిడ్నాపూర్, బంకురా, అద్రా, అస్న్సోల్, చిత్తరంజన్, మధుపూర్, జసిది రైల్వే స్టేష‌న్ల‌లో ఆగుతాయి. ఈ రెండు రైళ్ల‌కు థ‌ర్డ్‌ ఏసీ కోచ్‌లు-2, స్లీపర్ క్లాస్ కోచ్‌లు-12, జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు-5, సెకండ్ క్లాస్ కమ్ దివ్యాంగజన్ కోచ్ -2 ఉన్నాయి.

సంత్రాగచ్చి - జీఎంఆర్‌ చెన్నై సెంట్రల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (06134) రైలు అక్టోబ‌ర్ 30 (బుధవారం) సంత్రాగచ్చి నుండి ఉద‌యం 10:10 గంటలకు బయలుదేరుతుంది. గురువారం మ‌ధ్యాహ్నం 3:30 గంటలకు ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. ఈ రైలు సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, బ్రహ్మాపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, ఖరగ్‌పూర్ స్టాప్‌లు ఉన్నాయి. ఈ రైలుకు థ‌ర్డ్‌ ఏసీ క్లాస్ కోచ్-1, స్లీపర్ క్లాస్ కోచ్‌లు -8, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు-10, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/దివ్యాంగజన్ కోచ్‌లు-2 ఉన్నాయి.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner