Kakinada Gurukulam: గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 30 మంది బాలికలకు అస్వస్థత, ప్రభుత్వాస్పత్రిలో చికిత్స
Kakinada Gurukulam: కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 30మంది బాలికలు హాస్టల్లో అందించిన ఆహారం తిని అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు, విరోచనాలతో బాధపడ్డారు. విద్యార్థుల్ని హుటాహుటిన కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Kakinada Gurukulam: కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 30మంది బాలికలు హాస్టల్లో అందించిన ఆహారం తిని అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు, విరోచనాలతో బాధపడ్డారు. విద్యార్థుల్ని హుటాహుటిన కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో విద్యార్ధులకు చికిత్స అందిస్తు్నారు.
ఏలేశ్వరం గురుకులంలో విద్యార్థినులకు అస్వస్థతపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన నన్ను ఆందోళనకు గురి చేసిందని వారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా విద్య, వైద్య శాఖల అధికారులకు ఆదేశించారు.ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఙప్తి చేశారు.
కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని డా.బి.ఆర్.అంబేడ్కర్ బాలికల గురుకులంలో 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీశారు.
ఈ రోజు ఉదయం నుంచి కడుపు నొప్పి, విరేచనాలతో బాధపడుతూ విద్యార్థినులు ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం తెలియగానే కాకినాడ జిల్లా కలెక్టర్ తో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలందించే ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవాలని ఆదేశించారు.
చికిత్స నిమిత్తం ఏలేశ్వరం ఆసుపత్రికి స్పెషలిస్టులను పంపించాలన్నారు. గురుకులంలో విద్యార్థినులకు అందించిన ఆహారం, అక్కడి తాగు నీరు పరీక్షలు చేయించాలని స్పష్టం చేశారు.
కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై మంత్రి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా విద్య, వైద్య శాఖల అధికారులకు ఆదేశించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు.