South Central Railway : రైల్వే ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్.. 11 రైళ్లు రద్దు.. రెండు దారి మళ్లింపు.. కారణం ఇదే!-11 trains cancelled due to doubling work on south central railway ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  South Central Railway : రైల్వే ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్.. 11 రైళ్లు రద్దు.. రెండు దారి మళ్లింపు.. కారణం ఇదే!

South Central Railway : రైల్వే ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్.. 11 రైళ్లు రద్దు.. రెండు దారి మళ్లింపు.. కారణం ఇదే!

HT Telugu Desk HT Telugu

South Central Railway : సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. వాటి వివరాలను రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

11 రైళ్లు రద్దు

ప్ర‌యాణికుల‌కు ఇండియ‌న్ రైల్వే అల‌ర్ట్ ఇచ్చింది. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని బుగ్గానిపల్లె- పాణ్యం రైల్వే స్టేష‌న్ల మ‌ధ్య డ‌బ్లింగ్ పనులు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో 11 రైళ్లను రద్దు చేశారు. రైల్వే ప్ర‌యాణికులు ఈ మార్పులను గమనించి, సహకరించాలని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు కోరారు.

రద్దైన రైళ్లు..

1. డిసెంబ‌ర్ 27, 28 తేదీల్లో గుంటూరు నుండి బయలుదేరే రైలు నెంబ‌ర్ 17228 గుంటూరు- డోన్‌ ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు చేశారు.

2. డిసెంబ‌ర్ 28, 29 తేదీల్లో డోన్‌ నుండి బ‌య‌లుదేరే రైలు నెంబ‌ర్ 17227 డోన్‌- గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైలు ర‌ద్దు చేశారు.

3. డిసెంబ‌ర్ 27, 28 తేదీల్లో గుంత‌క‌ల్లు నుండి బయలుదేరే రైలు నెంబ‌ర్ 07288 గుంత‌క‌ల్లు- డోన్ డెము రైలు రద్దు చేశారు.

4. డిసెంబ‌ర్ 27, 28 తేదీల్లో డోన్‌ నుండి బయలుదేరే రైలు నెంబ‌ర్ 07289 డోన్‌- గుత్తి డెము రైలు రద్దు చేశారు.

5. డిసెంబ‌ర్ 27, 28 తేదీల్లో గుత్తి నుండి బయలుదేరే రైలు నెంబ‌ర్ 07290 గుత్తి- డోన్ డెము రైలు రద్దు చేశారు.

6. డిసెంబ‌ర్ 27, 28 తేదీల్లో డోన్‌ నుండి బయలుదేరే రైలు నెంబ‌ర్ 07291 డోన్‌- క‌ర్నూలు డెము రైలు రద్దు చేశారు.

7. డిసెంబ‌ర్ 27, 28 తేదీల్లో క‌ర్నూలు నుండి బయలుదేరే రైలు నెంబ‌ర్ 07499 క‌ర్నూలు- నంద్యాల ప్యాసింజ‌ర్ రైలు రద్దు చేశారు.

8. డిసెంబ‌ర్ 27, 28, 29 తేదీల్లో నంద్యాల‌ నుండి బయలుదేరే రైలు నెంబ‌ర్ 07498 నంద్యాల‌- క‌ర్నూలు ప్యాసింజ‌ర్‌ రైలు రద్దు చేశారు.

9. డిసెంబ‌ర్ 27, 28, 29 తేదీల్లో క‌ర్నూలు నుండి బయలుదేరే రైలు నెంబ‌ర్ 07292 క‌ర్నూలు - నంద్యాల ప్యాసింజ‌ర్‌ రైలు రద్దు చేశారు.

10. డిసెంబ‌ర్ 28, 29 తేదీల్లో గుంటూరు నుండి బయలుదేరే రైలు నెంబ‌ర్ 77281 గుంటూరు - ఔరంగాబాద్‌ ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు చేశారు.

11. డిసెంబ‌ర్ 28, 29 తేదీల్లో ఔరంగాబాద్‌ నుండి బయలుదేరే రైలు నెంబ‌ర్ 17254 ఔరంగాబాద్ - గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు చేశారు.

దారి మ‌ళ్లింపు..

1. రైలు నెంబ‌ర్ 22883 పూరి నుండి బ‌య‌లుదేరే పూరి- యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ రైలు నంద్యాల‌, డోన్ అనంత‌పురం మీదుగా కాకుండా నంద్యాల‌, ఎర్ర‌గుంట్ల‌, అనంత‌పురం మీదుగా వెళ్తుంది.

2. రైలు నెంబ‌ర్ 22832 య‌శ్వంత్‌పూర్ నుండి బ‌య‌లురేరే య‌శ్వంత్‌పూర్‌- హౌరా సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు అనంత‌పురం, డోన్ మీదుగా కాకుండా అనంత‌పురం, ఎర్ర‌గంట్ల‌, నంద్యాల మీదుగా వెళ్తుంది.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌రజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)