Eluru Minor Girl: పదో తరగతి బాలికపై సహవిద్యార్ధి అత్యాచారం, వీడియో రికార్డ్ చేసి బాలుడి స్నేహితుల బెదిరింపులు
Eluru Minor Girl: పదోతరగతి బాలికపై సహవిద్యార్ధి తరగతి గదిలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను ఫోన్లో రికార్డ్ చేసిన బాలుడి స్నేహితులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన ఏలూరులో సంచలనం సృష్టించింది.
Eluru Minor Girl: ఏలూరు జిల్లాలో ఘోరం జరిగింది. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన బాలికపై సహ విద్యార్ధి తరగతి గదిలో అత్యాచారానికి పాల్పడితే అతని స్నేహితులు ఆ దృశ్యాలను ఫోన్లో రికార్డ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడితో పాటు అతడి స్నేహితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
పదో తరగతి చదువుతున్న బాలికపై సహవిద్యార్ధి అత్యాచారానికి పాల్పడితే ఆ దృశ్యాలను అడ్డం పెట్టుకుని బాలికను బెదిరించి, డబ్బులు గుంజడానికి ప్రయత్నించిన మరో నలుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
పాఠశాల ఆవరణలో బాలికపై అత్యాచారం దృశ్యాలను వీడియో తీసిన నలుగురు యువకులు, డబ్బుల కోసం బాధితురాలిని బెదిరించారు. ఈ ఘటనలో బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో నిందితులను పట్టుకున్నారు.
ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో జరిగిన అమానవీయ సంఘటన కలకలం సృష్టించింది. గత మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన బాలిక.. మార్కుల జాబితాను తీసుకెళ్లేందుకు పాఠశాలకు వెళ్లింది. ఆ సమయంలో బాలికను.. సహచర విద్యార్థి తరగతి గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఘటనను గ్రామానికి చెందిన నలుగురు యువకులు తమ ఫోన్‌లలో వీడియో రికార్డు చేసి బాలికపై బెదిరింపులకు పాల్పడ్డారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా మండవల్లి మండలానికి చెందిన ఓ బాలిక పది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. మే 15న మార్కుల జాబితా తీసుకోడానికి పాఠశాలకు వెళ్లింది. ఆ సమయంలో స్కూల్లో ఉపాధ్యాయులు ఎవరు అందుబాటులో లేకపోవడంతో ఇంటికి వెళ్తున్న సమయంలో అక్కడ ఉన్న సహ విద్యార్ధి బాలికను తరగతి గదిలోకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ సమయంలో పాఠశాల ప్రాంగణంలో ఉన్నబాలుడికి పరిచయం ఉన్న బాల సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్(22), హరికృష్ణ(20), తేజ వీడియో తీశారు. ఆ తర్వాత బాలికకు వీడియోలు చూపించి బెదిరించి తమ కోరిక తీర్చాలని ఒత్తిడి చేశారు. అంతటితో ఆగకుండా వీడియోలు బయట పెట్టకుండా ఉండాలంటే తమకు డబ్బులు ఇవ్వాలని, బాధితురాలి తల్లిదండ్రుల్ని బెదిరించారు. రూ.2 లక్షలు ఇస్తామని చెప్పినా భారీ మొత్తంలో నగదు కావాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత వీడియోను పలు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు.
దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కైకలూరు రూరల్ సీఐ కృష్ణకుమార్, మండవల్లి ఎస్సై రామచంద్రరావు కేసు నమోదు చేసి విచారణ నిర్వహించారు. అత్యాచారానికి పాల్పడిన బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం విజయవాడ జువైనల్ హోమ్‌కు తరలించారు. బాధితురాలిని బెదిరించి, వేధింపులకు పాల్పడిన నలుగురు యువకుల్ని అరెస్టు చేశారు. నిందితులు బాలసుబ్రహ్మణ్యం, తేజ, హరికృష్ణ, చంద్రశేఖర్‌లకు కైకలూరు కోర్టు రిమాండ్ విధించింది.
సంబంధిత కథనం