Kakinada SEZ : చంద్రబాబుకు యనమల లేఖ.. కాకినాడ సెజ్‌పై కీలక కామెంట్స్.. 10 ముఖ్యమైన అంశాలు-10 important points in yanamala ramakrishnudu letter to cm chandrababu regarding kakinada sez ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kakinada Sez : చంద్రబాబుకు యనమల లేఖ.. కాకినాడ సెజ్‌పై కీలక కామెంట్స్.. 10 ముఖ్యమైన అంశాలు

Kakinada SEZ : చంద్రబాబుకు యనమల లేఖ.. కాకినాడ సెజ్‌పై కీలక కామెంట్స్.. 10 ముఖ్యమైన అంశాలు

HT Telugu Desk HT Telugu
Dec 09, 2024 02:24 PM IST

Kakinada SEZ : సీఎం చంద్ర‌బాబుకు య‌న‌మ‌ల రామకృష్ణుడు లేఖాస్త్రాం సంధించారు. కాకినాడ సెజ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్ర‌బాబు స‌న్నిహితుడిపై ఆరోప‌ణ‌లు చేశారు. వైసీపీని కూడా వదలని యనమల.. 10 ముఖ్య‌మైన అంశాలను పస్తావించారు. యనమల లేఖలోని అంశాలు ఏంటో ఓసారి చూద్దాం.

య‌న‌మ‌ల రామకృష్ణుడు
య‌న‌మ‌ల రామకృష్ణుడు

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు మాజీ ఆర్థిక మంత్రి య‌నమ‌ల రామ‌కృష్ణుడు లేఖాస్త్రాం సంధించారు. ప్ర‌స్తుతం ఈ లేఖ టీడీపీలో క‌ల‌క‌లం సృష్టిస్తోంది. కాకినాడ సెజ్ ల‌క్ష్యంగా ఆయ‌న లేఖ ఉంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు సన్నితంగా ఉన్న కేవీ రావు చౌద‌రిపై విమ‌ర్శ‌లు చేస్తూ.. లేఖ‌లో అనేక అంశాలు పేర్కొన్నారు. ఈ లేఖ‌పై టీడీపీ అధికారికంగా స్పందించలేదు.

yearly horoscope entry point

లేఖలోని అంశాలు..

1. కాకినాడ సెజ్ పెద్ద షాట్లు (కంపెనీలు) ప్రయోజనాలను పొందాయి. బీసీ, చిన్న రైతులు, మత్స్యకారుల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేయడం లేదా భూసేకరణ చేయడం దీనికి కారణం.

2. కాకినాడ ఓడరేవు సొంత చేసుకున్న కేవీ రావు చౌదరికి చెందిన బడా కంపెనీలు.. కాకినాడ సెజ్‌లో భూమిని తక్కువ ధరలకు పొందాయి. ఆ భూమిని జీఎంఆర్‌ (వైశ్య)కి కె.వి రావు చౌద‌రి వందల కోట్లకు అమ్మారు. ఆ తరువాత అరబిందో (జగన్మోహన్ రెడ్డి బినామీ)కి దాదాపు రూ.4,000 కోట్ల‌కు కొనుగోలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం క్లెయిమ్ చేసిన భూమిని దివీస్ (మురళీ చౌదరి)తో సహా పరిశ్రమలను స్థాపించడానికి రూ.500 కోట్లు ఇచ్చారు.

3. కోన అటవీ వాసులకు అనుకూలంగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించకుంటే, వారి వాస్తవ సమస్యల కోసం నిరంతరం పోరాడుతామని, వారి జీవనోపాధిని కాపాడేందుకు వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని యనమల కోరారు.

4. చెన్నైలోని ఎన్‌జీటీ, సీఎంఎస్‌, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఏపీ పొల్యూషన్‌ బోర్డుకు లేఖలు రాశాను. ఇవి చర్య తీసుకోవడానికి స్వతంత్ర సంస్థలుగా పరిగణించబడతాయి. కానీ వాస్తవానికి రాజకీయ నియంత్రణలో ఉంటాయి. ప‌రిష్క‌రిస్తారా? లేదా? అనేది ప్రభుత్వాల ముందు ఉంది.

5. ప్రభుత్వం తమకు అనుకూలంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు. కాకినాడ సెజ్‌లోని కొన్ని భూములను మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వంటి స్థానిక వైసీపీ నాయకులు బలవంతంగా తీసుకున్నారు. ఆ భూములను డి-నోటిఫికేషన్ చేసిన తర్వాత భూ సేకరణ అసలు భూ యజమానులకే దక్కాలి. కానీ వైసీపీ ప్రభుత్వంలో అది జరగలేదు.

6. వైసీపీ ప్ర‌భుత్వ‌ంలో తమ నాయకులకు అనుకూలంగా మొత్తం ఫ్రాడ్‌ చేసారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. అలాగే ఇది భూసేకరణ చట్టం స్ఫూర్తికి విరుద్ధం. దీనిపై విచారణ అవసరం. సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వం ఆ భూములను అసలు రైతులకు ఇవ్వాలి. కాకినాడ సెజ్‌ భూములను అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలి. అలాంటి భూములను అసలు భూ యజమానులకు అప్పగించాలని రైతులు కోరుతున్నారు. లేనిపక్షంలో న్యాయం కోసం ఆందోళనలు ఉద్ధృతం చేస్తాం. స్థానికులను రక్షించేందుకు మీడియా ముందుకు వ‌స్తాం.

7. ఎలాంటి తీవ్ర ఆందోళనలు జరగకుండా ఉండేందుకు ఏపీ పొల్యూషన్ బోర్డు సభ్యుడు, ఎన్‌జీటీ ప్రతినిధి, రాష్ట్ర, జిల్లా అధికారుల‌తో అధికారిక కమిటీని ఏర్పాటు చేసి, స్థానిక సమస్యలను పరిష్కరించడానికి వారు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. లేదంటే ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి.

8. కేవీ రావు కూడా కాకినాడ సెజ్‌లో నష్టపోయిన వారికి న్యాయం చేయలేదు. వంద కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు ఆయన (కేవీ రావు) ఆర్జీంచి, బాధితులకు కొద్ది మొత్తమే ఇచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ధనికులు (ప్లూటోక్రాట్లు) లాభపడుతుండగా, బలహీన వర్గాలు (పేదలు) సంపద సృష్టిలో, రాజకీయాల్లో పాల్గొనడంలో, అభివృద్ధి ముసుగులో నష్టపోతున్నారు.

9. బిగ్ షాట్‌ల బారి నుండి బీసీ రైతులు, మత్స్యకారులను రక్షించండి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుంది. వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలని నా అభ్యర్థన.

10. ఈ సుదీర్ఘ లేఖ‌పై అధికార టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ నుంచి ఎటువంటి స్పంద‌న రాలేదు. కాక‌పోతే ఆయా పార్టీల్లో ఈ లేఖ‌పై చ‌ర్చోప‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు ఈ లేఖ‌లో చంద్ర‌బాబు స‌న్నిహితుడిపై చేసిన ఆరోప‌ణ‌ల‌తో పాటు వైసీపీ నేత‌ల‌పై కూడా బ‌ల‌మైన ఆరోప‌ణ‌లు చేశారు. కానీ వైసీపీ కూడా ఈ లేఖ‌పై స్పందించలేదు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner