Condition in Ekalavya Model Residential School Namalapadu| ఉడకని అన్నం.. నీళ్ల చారు..
05 August 2024, 14:12 IST
- మహబూబాబాద్ జిల్లా నామాలపాడు ఏకలవ్య మాడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు అవస్థలు పడుతున్నట్లు తల్లి దండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఉడకని పురుగుల అన్నం పెడుతున్నారని బాధపడుతున్నారు. ఈ అన్నం ఎలా తినాలని ప్రశ్నిస్తున్నారు. దోమలు కుడుతుంటే పడుకోలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. తమకి సరైన భోజనం పెట్టేలా చూడాలని వేడుకుంటున్నారు విద్యార్థులు.