New Tax Regime: ఆదాయ పన్ను స్లాబ్ లో మార్పులు.. బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరట
23 July 2024, 15:33 IST
- కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో వేతన జీవులకు ఊరట కల్పించింది. స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేల నుంచి రూ. 75 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మధ్యతరగతికి మేలు చేసేలా ఐటీ చట్టాన్ని సమీక్షిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఆదాయ పన్ను స్లాబ్ ల్లో మార్పులు తెచ్చారు. రూ.3 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు 5 శాతం పన్ను.రూ. 7 లక్షల నుంచి రూ.10లక్షల వరకు 10 శాతం, రూ.10 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు 15 శాతం పన్ను వసూలు చేయనున్నారు.