తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Generation Z | కంటెంట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్స్..!

Generation Z | కంటెంట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్స్..!

Published Jul 27, 2022 10:36 PM IST

ఈరోజుల్లో డిజిటల్ కంటెంట్ క్రియేటర్లదే హవా. సినిమాల్లో ఛాన్స్ కొట్టేయాలన్నా, టీవీ షోలలో రాణించాలన్నా లేదా వెబ్- సిరీస్ లలో దుమ్మురేపాలన్నా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే చాలు అవకాశాలు వాటంతటవే వచ్చేస్తాయి. ఏమి లేకపోయినా, కేవలం పోస్టులు, అడ్వర్టైజులు చేయడం ద్వారానే బాగా సంపాదించుకోవచ్చు, పాపులర్ అవ్వొచ్చు కూడా. ఇప్పుడు పెద్ద స్క్రీన్ మీదకు రావాలంటే అర చేతిలోని స్మార్ట్ ఫోన్ స్క్రీనే షార్ట్ కట్. మీరు చేయాల్సింది కేవలం మీ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు చేయడం, మీ ఫాలోవర్లను పెంచుకోవడం. అందుకోసం మంచి కంటెంట్ ఉన్న పోస్టులు క్రియేట్ చేయాలి. డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు దేవ్ రాయన్నీ, లీషా పటిదార్, తనీషా మిర్వానీ తమ కంటెంట్ స్టాండర్డ్స్ కలిగి ఉండటం ద్వారా వందల, వేల మంది ఫాలోవర్లను పొందారు. వారి జర్నీ ఎలా సాగిందో HT బ్రంచ్‌ టీంకు తెలియజేశారు. ఈ వీడియో చూడండి..