Palnadu District | వినుకొండ YSR కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు రషీద్ హత్య!
18 July 2024, 9:40 IST
- పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముండ్లమూరు బస్టాండ్ వద్ద జరిగిన హత్యలో రాజకీయ ప్రమేయం లేదని పోలీసులు తెలిపారు. ఇద్దరి స్నేహితుల మధ్య ఏర్పడిన వ్యక్తిగత కక్షలతోనే ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు. ఘటనలో పాల్గొన్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే అక్కడ 144 సెక్షన్ పెట్టామని తెలిపారు. ఇక స్థానికుల వివరాల ప్రకారం.. హతుడు షేక్ రషీద్ ముండ్లమూరు బస్టాండ్ సమీపంలో మద్యం దుకాణం నుంచి బయటకు వస్తున్నాడు. అదే సమయంలో హతుని మాజీ మిత్రుడు, పట్టణానికి చెందిన షేక్ జిలానీ కత్తితో రషీద్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు.