తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Arandal Peta Police Station | అరండల్ పేట స్టేషన్లో మైనర్ ఎవరు.. Sp, Ig ఏం చేస్తున్నట్లు?

Arandal Peta Police Station | అరండల్ పేట స్టేషన్లో మైనర్ ఎవరు.. SP, IG ఏం చేస్తున్నట్లు?

12 November 2024, 12:34 IST

  • గుంటూరు జిల్లాలో అరండల్ పేట పోలీస్ స్టేషన్ కు బోరుగడ్డ అనిల్ వ్యవహారంతో ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఈ స్టేషన్ నుంచి బయటపడిన సీసీ ఫుటేజీ క్లిపుల ద్వారా అరండల్ పేట పోలీసులు అధికార దుర్వినియోగానికి ఏ విధంగా పాల్పడ్డారో తేటతెల్లమవుతోంది. చట్ట ప్రకారం మైనర్లు పోలీస్ స్టేషన్లకు రాకూడదు. ఒకవేళ ఎవరైనా మైనర్లు క్రైమ్ లో భాగస్వామ్య అయితే వారిని చట్ట ప్రకారం, నియమ నిబంధనలకు లోబడి విచారించాల్సి ఉంటుంది. కానీ ఏ నేరంతో సంబంధంలేని ఓ మైనర్ బాలుడు అర్ధరాత్రి వేళ అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో సంచరించడమే కాక పోలీసుల సాక్షిగా లోనికి ప్రవేశించి తన మేనమామతో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతేకాక ఇది పోలీసుల వైఫల్యానికి నిలువుటద్దంగా నిలిచింది.