తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Gajendra Singh Shekhawat : బండి సంజయ్ దగ్గరకు వెళ్లమని మోదీ ఆదేశించారు

Gajendra Singh Shekhawat : బండి సంజయ్ దగ్గరకు వెళ్లమని మోదీ ఆదేశించారు

HT Telugu Desk HT Telugu

02 August 2022, 16:00 IST

google News
    • బండి సంజయ్ రెండు  విడతల పాదయాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. మూడో విడత పాదయాత్ర కూడా విజయవంతం చేయాలని కోరారు.
కేంద్రమంత్రి షెకావత్ తో బండి సంజయ్
కేంద్రమంత్రి షెకావత్ తో బండి సంజయ్ (twitter)

కేంద్రమంత్రి షెకావత్ తో బండి సంజయ్

యాదగిరిగుట్ట మండలం యాదగిరి పల్లిలో బీజేపీ ప్రజాసంగ్రామ యాత్రం ప్రారంభమైంది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరయ్యారు. మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతం చేయాలని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కోరారు. మెుదట తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందలు, స్వాగతం అంటూ మాట్లాడారు. ఎంతో పవిత్ర స్థలమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నoదుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

'బండి సంజయ్ 2 విడతల పాదయాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నా. బండి సంజయ్ పాదయాత్రను ప్రజలు ఆశీర్వదించారు. 3వ విడత పాదయాత్ర కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నా. మోదీ ఆదేశాలతో ఇక్కడికి వచ్చాను. స్వాతంత్య్రం కోసం ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఎందరో పోరాటం చేసి, ప్రాణ త్యాగం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా అలానే పోరాటం చేసి ప్రాణ త్యాగం చేస్తే.. ఇప్పుడు తెలంగాణ ఎలా ఉందో మనం చూస్తున్నాం. తెలంగాణలో రాజులా నియంత పాలన కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రజల కల నెరవేరలేదు. తెలంగాణలో ప్రతి స్థాయిలో అవినీతి జరుగుతోంది. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన వాళ్ళకి నిజమైన నివాళి ఇవ్వాలి అంటే.. కేసీఆర్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిందే.' అని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు.

తెలంగాణ ప్రజలు ఎందుకు పోరాటం చేశారో.. ఆ కలలు సాకారం కాలేదని కేంద్రమంత్రి షెకావత్ అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ ప్రజలు స్వర్గీయ 'సుష్మాస్వరాజ్'ను 'చిన్నమ్మ' అని గుండెల్లో పెట్టుకున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ విను.. బండి సంజయ్ ఆధ్వర్యంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన రాష్ట్రపతి అభ్యర్థికి కేసీఆర్ మద్దతు ఇవ్వలేదన్నారు. అవినీతి, కుటుంబ పార్టీలకు మాత్రమే మద్దతుగా నిలిచాడని ఆరోపించారు.

అణగారిన కులాలంటే కేసీఆర్ కు గిట్టదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఏ డిజైన్ తో కట్టారు?. ఇంజినీరింగ్ లోపంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపు హౌస్లు మునిగాయి. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కు డబ్బు సంపాదించే మిషన్ (ATM) అయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయహోదా ఇవ్వలేదని అడుగుతున్న కేసీఆర్.. ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిపై సమాధానం చెప్పాలి. అవినీతి పరులను జైల్లో వేసేందుకే బీజేపీ కి అధికారం ఇవ్వండి. తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొడతాం.

- కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

తదుపరి వ్యాసం