UGC NET June Admit Card 2024 : యూజీసీ నెట్ జూన్ సెషన్ హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి
15 June 2024, 9:51 IST
- UGC NET June Admit Card 2024 Updates : యూజీసీ నెట్ 2024 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. https://ugcnet.nta.ac.in/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని యూజీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
యూజీసీ నెట్-2024 అడ్మిట్‌కార్డులు విడుదల
UGC NET June Admit Card 2024 Updates : యూజీసీ నెట్ 2024 (జూన్ సెషన్) అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://ugcnet.nta.ac.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని యూజీసీ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
UGC NET June Admit Card 2024: ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- యూజీసీ నెట్ (జూన్ సెషన్) 2024కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://ugcnet.nta.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే UGC NET Admit Card 2024 లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీ Application number, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
- సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ అడ్మిట్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
- డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి అడ్మిట్ కార్డు కాపీని పొందవచ్చు.
ఈ పరీక్ష జూన్ 18వ తేదీన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తోంది. పరీక్ష రెండు షిఫ్టులలో నిర్వహించబడుతుంది- మొదటి షిఫ్ట్ ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటుంది.ఇక రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 వరకు నిర్వహిస్తారు.
ఈ పరీక్షలో అర్హత సాధించిన వారు కేంద్ర విశ్వవిద్యాలయాలతో పాటు రాష్ట్రంలో ఉండే వర్శిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేసే అవకాశం ఉంటుంది. ఈ పరీక్షలో మెరిట్ సాధించిన వారికి జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కూడా ఇస్తారు.