తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Inter Fee Schedule : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, ఫీజు చెల్లింపుల షెడ్యూల్ విడుదల

TG Inter Fee Schedule : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, ఫీజు చెల్లింపుల షెడ్యూల్ విడుదల

05 November 2024, 18:29 IST

google News
  • TG Inter Fee Schedule : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు ప్రకటించింది. నవంబర్ 6 నుంచి 26వ తేదీ వరకు విద్యార్థులు పబ్లిక్ పరీక్షల ఫీజులు చెల్లించవచ్చు. రూ.100 ఆలస్య రుసుముతో నవంబర్ 27 నుంచి డిసెంబర్ 04 వరకు ఫీజులు చెల్లించవచ్చు.

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, ఫీజు చెల్లింపుల షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, ఫీజు చెల్లింపుల షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, ఫీజు చెల్లింపుల షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీల షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్టు ప్రకటించింది. నవంబర్‌ 6 నుంచి 26 వరకు పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు, ఫెయిల్ అయిన అభ్యర్థులకు (జనరల్, వొకేషనల్), హాజరు నుంచి మినహాయింపు పొందిన ప్రైవేట్ అభ్యర్థులకు, ఆర్ట్స్/హ్యూమానిటీస్ గ్రూపుల విద్యార్థులకు ఈ ఫీజు గడువు వర్తిస్తుందని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

నవంబర్ 6 నుంచి 26 వరకు ఫీజుల చెల్లింపు గడువు ప్రకటించారు. రూ.100 ఆలస్య రుసుముతో నవంబర్‌ 27 నుంచి డిసెంబర్‌ 4 వరకు ఇంటర్ ఫీజు చెల్లించవచ్చు. ఇంటర్ ఫస్టియర్‌, సెకండియర్‌ జనరల్‌ విద్యార్థులకు రూ.520, ఒకేషనల్‌ విద్యార్థులకు రూ.750 చెల్లించాలని ఇంటర్ బోర్డు తెలిపింది. సెకండియర్‌ జనరల్‌ సైన్స్‌ విద్యార్థులకు రూ.750, సెకండియర్‌ జనరల్‌ ఆర్ట్స్‌ విద్యార్థులకు రూ.520 ఫీజులు నిర్ణయించింది.

  • ఫీజు చెల్లింపు గడువు - నవంబర్ 06 నుంచి నవంబర్ 26 వరకు
  • రూ.100 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు గడువు- నవంబర్ 27 నుంచి డిసెంబర్ 04 వరకు
  • రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు గడువు - డిసెంబర్ 05 నుంచి డిసెంబర్ 11 వరకు
  • రూ.1,000 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు తేదీలు-డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 18 వరకు
  • ఆలస్య రుసుము రూ.2,000తో ఫీజు చెల్లింపు తేదీలు - డిసెబర్ 19 నుంచి డిసెంబర్ 27 వరకు

పరీక్ష రుసుము వివరాలు

  • ఇంటర్ ఫస్టియర్ జనరల్ రెగ్యులర్ కోర్సుల ఫీజు- రూ.520/-
  • ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ రెగ్యులర్ (థియరీ 520 + ప్రాక్టికల్స్ 230) కోర్సుల ఫీజు- రూ.750
  • ఇంటర్ సెకండియర్ జనరల్ ఆర్ట్స్ కోర్సుల ఫీజు - రూ.520
  • సెకండియర్ జనరల్ సైన్స్ (థియరీ 520 + ప్రాక్టికల్స్ 230) కోర్సుల ఫీజు- రూ.750
  • సెకండియర్ ఒకేషనల్ (థియరీ 520 + ప్రాక్టికల్స్ 230) కోర్సుల ఫీజు- రూ.750

తదుపరి వ్యాసం