HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Lawcet 2024 Results : తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల - ఈ లింక్ పై క్లిక్ చేసి మీ ర్యాంక్ చెక్ చేసుకోండి

TS LAWCET 2024 Results : తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల - ఈ లింక్ పై క్లిక్ చేసి మీ ర్యాంక్ చెక్ చేసుకోండి

13 June 2024, 15:59 IST

    • TS LAWCET 2024 Results Updates : తెలంగాణ లాసెట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం సాయంత్రం 4 గంట‌ల‌కు ఉన్న‌త విద్యా మండ‌లి చైర్మ‌న్ ఆర్ లింబాద్రి, ఓయూ ఇంచార్జి వీసీ దాన కిశోర్ తో పాటు లాసెట్ కన్వీనర్ ఫ‌లితాల‌ను ప్రకటించారు.
తెలంగాణ లాసెట్ ఫలితాలు 2024
తెలంగాణ లాసెట్ ఫలితాలు 2024

తెలంగాణ లాసెట్ ఫలితాలు 2024

TS LAWCET 2024 Results Updates : తెలంగాణ లాసెట్ 2024 ఫలితాలు వచ్చేశాయ్. పరీక్ష రాసిన అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

TGSRTC Conductor Arrest : ఆర్టీసీ బస్సులో యువతితో అసభ్య ప్రవర్తన, కండక్టర్ అరెస్ట్

IRCTC Shirdi Tour : ఈ నెలలో 'షిర్డీ' ట్రిప్ ప్లాన్ ఉందా...? బడ్జెట్ ధరలో 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇదే...!

CM Revanth Reddy : మూడు విడతల్లో రైతు రుణమాఫీ పూర్తి, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

TG DOST 2024 Updates : డిగ్రీ విద్యార్థులకు అలర్ట్ - రేపటితో ముగియనున్న'దోస్త్‌' రిపోర్టింగ్ గడువు..!

ఈ ఏడాది జరిగిన పరీక్షకు 40,268 మంది హాజరయ్యారు. వీరిలో 29,258 మంది అర్హత సాధించారు. మొత్తంగా 72.66 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులు అయ్యారు. త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఖరారు చేస్తామని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రకటించారు.

టీఎస్ లాసెట్ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి…

  • లాసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు మొదటగా https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • Download Rank Card అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • Hall Ticket Number, పుట్టిన తేదీని ఎంట్రీ చేయాలి.
  • -గెట్ రిజల్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ స్కోర్ తో పాటు ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.
  • అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు అత్యంత కీలకం.

2024-2025 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని లా కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) TS LAWCET/ TS PGLCET-2024 ను నిర్వహించింది.

ఈ ఏడాదికి సంబంధించి జూన్ 3వ తేదీన టీఎస్ లాసెట్ పరీక్షలను నిర్వహించారు. ఉద‌యం 9 నుంచి 10.30 వ‌ర‌కు మొదటి సెషన్ జరిగింది. ఇక మ‌ధ్యాహ్నం 12.30 నుంచి 2 గంట‌ల వ‌ర‌కు రెండో సెషన్, సాయంత్రం 4 నుంచి 5.30 గంట‌ల వ‌ర‌కు మూడో సెషన్ పరీక్షను నిర్వహించారు. గతేడాదితో పోల్చితే ఈసారి లాసెట్ కు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి.

మూడేళ్ల ఎల్ఎల్ బీ కోర్సులో చేరేందుకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇక ఎల్ఎల్ బీ ఐదేళ్ల కోర్సులో చేరాలంటే ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఇక ఎల్ఎల్ ఎం చేయాలంటే... ఎల్ఎల్ బీ డిగ్రీ ఉండాలి. కౌన్సిలింగ్ తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు. ర్యాంక్ ల ఆధారంగా ఆయా కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు.

తదుపరి వ్యాసం