HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Icet Results 2024 : తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల - మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

TG ICET Results 2024 : తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల - మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

14 June 2024, 16:35 IST

  • TG ICET 2024 Results Updates: తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత…ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ తో పాటు ఐసెట్ కన్వీనర్ రిజల్ట్స్ ను ప్రకటించారు.
తెలంగాణ ఐసెట్ ఫలితాలు - 2024
తెలంగాణ ఐసెట్ ఫలితాలు - 2024

తెలంగాణ ఐసెట్ ఫలితాలు - 2024

TG ICET 2024 Results Updates: తెలంగాణ ఐసెట్ -2024 ప్ర‌వేశ ప‌రీక్ష ఫ‌లితాలు వచ్చేశాయ్..! శుక్రవారం సాయంత్రం 4 గంటల తర్వాత ఉన్న‌త విద్యా మండ‌లి చైర్మ‌న్ ఆర్ లింబాద్రి, కాక‌తీయ యూనివ‌ర్సిటీ ఇంఛార్జి వీసీ వాకాటి క‌రుణతో పాటు ఐసెట్ కన్వీనర్ ఫలితాలను వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

Medak Crime : మెదక్ జిల్లాలో విషాదం, సెల్ ఫోన్ కొనివ్వలేదని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

Warangal ATM Robbery : ఏటీఎమ్ సెంటర్లలో లవర్స్ చోరీలు-ప్లాస్టిక్ పట్టీలు,స్క్రూడ్రైవర్, ఫెవిక్విక్ తో కస్టమర్లకు బురిడీ

Smita Sabharwal : దివ్యాంగులపై స్మితా సబర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు- స్పందించిన మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క

Union Budget :కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి 'గుండు సున్నా', తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం-కేటీఆర్, హరీశ్ రావు

https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అభ్యర్థులు ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 5, 6 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ప్రిలిమినరీ ఆన్సర్ కీని విడుదల చేయటంతో పాటు అభ్యంతరాలను కూడా స్వీకరించారు. ఈ ప్రక్రియ పూర్తి కావటంతో ఇవాళ రిజల్ట్స్ ను విడుదల చేశారు.

తెలంగాణ ఐసెట్‌ పరీక్ష కోసం 86156 మంది దరఖాస్తు చేసుకున్నారు. 77942 మంది అభ్యర్థులు  హాజరయ్యారు. వీరిలో 71 వేల 647 మంది ఉత్తీర్ణులు కాగా.. ఉత్తీర్ణత శాతం 91.92 శాతంగా నమోదైంది. 

ఎంబీఏ 272 కాలేజీల్లో 35 వేల 949 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంసీఏ 64 కాలేజీల్లో 6990 సీట్లు ఉన్నాయి.   జూన్‌ 5, 6 తేదీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 116 కేంద్రాల్లో ఐసెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

TG ICET Resullts 2024 Check : తెలంగాణ ఐసెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు..

 • తెలంగాణ ఐసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
 • హోంపేజీలో కనిపించే ICET Results 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
 • మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు Registration Number, పుట్టినతేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
 • సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
 • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే కాపీ పొందవచ్చు.
 • అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు కీలకం.

తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఐసెట్) పరీక్షలను ఈ ఏడాది కాకతీయ వర్శిటీ నిర్వహిస్తోంది. తెలంగాణ ఐసెట్ పరీక్షలు జూన్ 5 నుంచి 6వ తేదీ వరకు పలు సెషన్లల్లో జరిగాయి.

TS ICET 2024 Response Sheets : టీఎస్ ఐసెట్ రెస్పాన్స్ షీట్లు ఇలా పొందండి

 • తెలంగాణ ఐసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
 • హోంపేజీలో కనిపించే Download Response Sheets ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
 • ఇక్కడ మీ Registration Number, ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.
 • మీ రెస్పాన్స్ షీట్ డిస్ ప్లే అవుతుంది.
 • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

తదుపరి వ్యాసం