తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bjp Hanamkonda Meeting : రేపటి బీజేపీ సభకు హైకోర్టు అనుమతి

BJP Hanamkonda Meeting : రేపటి బీజేపీ సభకు హైకోర్టు అనుమతి

26 August 2022, 17:26 IST

google News
    • Hanamkonda BJP Meeting: శనివారం హన్మకొండ వేదికగా తలపెట్టిన బీజేపీ సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మరోవైపు సభను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. 
వరంగల్ బీజేపీ సభకు అనుమతి
వరంగల్ బీజేపీ సభకు అనుమతి

వరంగల్ బీజేపీ సభకు అనుమతి

bjp meeting at hanamkonda: బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర మూడో దశ ముగింపు సందర్భంగా హన్మకొండలో సభను తలపెట్టింది బీజేపీ. అయితే ప్రజాసంగ్రామ యాత్ర విషయం సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో... రేపటి సభకు అనుమతి లేదంటూ వరంగల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీటిని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన బీజేపీకి ఊరట లభించింది.

bjp praja sangrama yatra: హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ వేదికగా తలపెట్టిన సభకు ఉన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. నగర కమిషన్ ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని ఉత్తర్వలుు జారీ చేసింది. సభకు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొంది. నిర్దేశించిన సమయంలోనే సభను పూర్తి చేయాలని తెలిపింది.

JP Nadda Tour of Telangana: మరోవైపు నేతలు సభను విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా నాయకులు దగ్గర ఉండి ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు. బీజేపీ సభకు గ్రీన్ సిగ్నల్ రావటంతో... పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా షెడ్యూల్ కూడా ఖరారైంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. ఇక్కడ్నుంచి హెలికాఫ్టర్ లో వరంగల్ కు వెళ్తారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం... ప్రొఫెసర్ వెంకట నారాయణతో భేటీ అవుతారు. అనంతరం హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహిస్తున్న సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

జనగామ జిల్లాలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్రను కొందరు అడ్డుకోవడంతో ఇవాళ స్వల్ప ఘర్షణ తలెత్తింది. టీఆర్ఎస్‌కు సంబంధించిన ఓ కార్యకర్త వచ్చి బండి సంజయ్ గో బ్యాక్ అంటూ రావడంతో బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

బండి సంజయ్ పాదయాత్రతో శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతోందని చెబుతూ పోలీసు యంత్రాంగం యాత్రను భంగం చేసి ఇటీవల బండి సంజయ్‌ను కరీంనగర్ తరలించారు. అయితే నిన్న హైకోర్టు ఈ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శుక్రవారం ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడతను తిరిగి మొదలు పెట్టారు. మరోవైపు హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన అనుమతిని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

తదుపరి వ్యాసం