తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live January 6, 2025: Tg Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు
TG Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు
TG Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

Telangana News Live January 6, 2025: TG Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

06 January 2025, 23:02 IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

06 January 2025, 23:02 IST

తెలంగాణ News Live: TG Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

  • TG Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 16 వరకు పొడిగించారు. అపరాధ రుసుము రూ.2500 తో ఈ నెల 16 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.

పూర్తి స్టోరీ చదవండి

06 January 2025, 22:41 IST

తెలంగాణ News Live: KTR Race Case : ఫార్ములా ఈ-రేస్ కేసు, కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు-రేపు విచారణకు రాలేనని ఈడీకి కేటీఆర్ రిప్లై

  • KTR Race Case : ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు హాజరు కాలేనని ఈడీకి కేటీఆర్ రిప్లై ఇచ్చారు.

పూర్తి స్టోరీ చదవండి

06 January 2025, 19:18 IST

తెలంగాణ News Live: Hyderabad Car Accident : హైదరాబాద్ లో ఘోర ప్రమాదం, కారులో మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనం

  • Hyderabad Car Accident : హైదరబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఘన్ పూర్ సర్వీస్ రోడ్డులో రన్నింగ్ కారులో మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనం అయ్యారు.

పూర్తి స్టోరీ చదవండి

06 January 2025, 18:15 IST

తెలంగాణ News Live: Hyderabad Flyover : హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో భారీ ఫ్లైఓవర్‌.. ఇవీ ప్రత్యేకతలు

  • Hyderabad Flyover : ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆరాంఘర్ ఫ్లైఓవర్‌ ప్రారంభమైంది. సీఎం రేవంత్ దీన్ని ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ వినియోగంలోకి రావడంతో.. ట్రాఫిక్ కష్టాలు తీరాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరాంఘర్ ఫ్లైఓవర్‌‌కు సంబంధించిన ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

06 January 2025, 18:14 IST

తెలంగాణ News Live: BRS Rythu Bharosa Protest : హనుమకొండలో హైటెన్షన్, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత అరెస్ట్

  • BRS Rythu Bharosa Protest : బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ ను పోలీసులు అరెస్టు చేశారు. రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ... కాళోజీ విగ్రహానికి వినతి పత్రం అందించేందుకు వెళ్తుండగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలు, పోలీసులకు వాగ్వాదం జరిగింది.

పూర్తి స్టోరీ చదవండి

06 January 2025, 17:43 IST

తెలంగాణ News Live: Union Bank Robbery : భార్య జల్సాలు, అప్పులు కట్టేందుకు బ్యాంకులో చోరీకి భర్త ప్లాన్

  • Union Bank Robbery : వనపర్తి జిల్లా అమరచింత యూనియన్ బ్యాంక్ లో చోరీయత్నం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఐదుగురి నిందితులను అరెస్టు చేశారు. తనను మోసం చేసినట్లు మరో ముగ్గుర్ని మోసం చేసిన ఓ యువతి...అప్పులు తీర్చేందుకు వేసిన పథకం బ్యాంక్ చోరీ అని పోలీసులు తెలిపారు.

పూర్తి స్టోరీ చదవండి

06 January 2025, 16:03 IST

తెలంగాణ News Live: KTR ACB Case : కేటీఆర్ ఇంటిపై రెయిడ్ చేసేందుకు కుట్ర చేశారు : బీఆర్ఎస్

  • KTR ACB Case : కేటీఆర్ ఏసీబీ విచారణ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కుట్రపూరితంగా కేటీఆర్‌పై కేసు పెట్టారని బీఆర్ఎస్ అంటుంటే, ముద్దాయి అన్న సంగతి కేటీఆర్ గుర్తుపెట్టుకోవాలని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. దీంతో తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి.
పూర్తి స్టోరీ చదవండి

06 January 2025, 15:37 IST

తెలంగాణ News Live: Warangal : మంత్రుల పర్యటనలో ప్రోటోకాల్ రగడ.. డిప్యూటీ సీఎంను మరిచిన అధికారులు..!

  • Warangal : వరంగల్ ఆర్టీసీ అధికారులు డిప్యూటీ సీఎంనే మరిచారు. వరంగల్ రీజియన్‌కు టీజీఎస్ ఆర్టీసీ కేటాయించిన ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం.. స్టేజీ, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కానీ ప్రోటోకాల్‌ను మాత్రం గాలికొదిలేశారనే విమర్శలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

06 January 2025, 14:22 IST

తెలంగాణ News Live: Charlapalli Railway Station : చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభం.. కేంద్రానికి సీఎం రేవంత్ కృతజ్ఞతలు

  • Charlapalli Railway Station : ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభమైంది. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి మరింత సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

06 January 2025, 12:13 IST

తెలంగాణ News Live: Charlapalli Terminal: చర్లపల్లి టెర్మినల్ రెడీ, వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని.. హైదరాబాద్‌లో 4వ ప్యాసింజర్ టెర్మినల్

  • Charlapalli Terminal: హైాదరబాద్‌ మహానగరంలో మరో రైల్వే ప్యాసింజర్‌ టెర్మినల్‌ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. చర్లపల్లి  ప్యాసింజర్‌ టెర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. హైదరాబాద్‌లో గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ, కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, సోమన్న తదితరులు పాల్గొన్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

06 January 2025, 11:25 IST

తెలంగాణ News Live: Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా.. పంట పొలాల్లో శాటిలైట్ సర్వే.. 10 ముఖ్యాంశాలు

  • Indiramma Atmiya Bharosa : రైతులు, రైతు కూలీల సంక్షేమం కోసం ప్రభుత్వం వివిధ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. తాజాగా ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకాన్ని ప్రకటించింది. దీన్ని అమలు చేయడానికి వేగంగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పంట పొలాల్లో ఉపగ్రహ సర్వే చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

06 January 2025, 11:20 IST

తెలంగాణ News Live: TG Caste Names Change: తెలంగాణలో పలు బీసీ కులాల పేర్ల మార్పుకు నోటిఫికేషన్‌ విడుదల

  • TG Caste Names Change: తెలంగాణలో 8 కులాల పేర్లకు బీసీ కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కులాల పేర్లను మార్చాలని వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ నోటిఫికేషన్‌ జారీ చేశారు. జనవరి 18వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు.
పూర్తి స్టోరీ చదవండి

06 January 2025, 10:38 IST

తెలంగాణ News Live: KTR Fire on Revanth: అక్రమ కేసులో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారన్న కేటీఆర్‌, విచారణక న్యాయవాదుల్ని అనుమతించని పోలీసులు

  • KTR Fire on Revanth: ఫార్ములా ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో ఏసీబీ విచారణ సందర్భంగా  హైడ్రామా నెలకొంది. కేటీఆర్‌ లీగల్‌ టీమ్‌ను విచారణకు పోలీసులు అనుమతించక పోవడంతో  వాగ్వాదం చోటు చేసుకుంది. న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని కేటీఆర్‌ పట్టుబట్టారు. పట్నం నరేందర్‌ మాదిరి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.  
పూర్తి స్టోరీ చదవండి

06 January 2025, 10:35 IST

తెలంగాణ News Live: Charlapalli Railway Station : చర్లపల్లి నుంచే ఈ రెండు రైళ్లు స్టార్ట్.. మూడింటికి స్టాపేజీ.. పూర్తి వివరాలు ఇవే

  • Charlapalli Railway Station : సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచే రెండు రైళ్లను నడపాలని నిర్ణయించింది. అలాగే మరో మూడు రైళ్లకు స్టాపేజీ ఇచ్చింది. ఈ మార్పులను ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేసింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

06 January 2025, 9:27 IST

తెలంగాణ News Live: Hyderabad RRR : రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం పర్యావరణంపై ప్రభావం చూపుతుందా.. 11 ముఖ్యమైన అంశాలు

  • Hyderabad RRR : తెలంగాణలో రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగాన్ని నిర్మించేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దీని నిర్మాణంతో.. తెలంగాణ మరింత అభివృద్ధి చెందనుంది. అయితే.. అభివృద్ధి తోపాటు నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పర్యావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

06 January 2025, 8:56 IST

తెలంగాణ News Live: Formula E Car Race: నేడు ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసుల్లో ఏసీబీ ముందుకు కేటీఆర్‌, దర్యాప్తులో ఈడీ, ఏసీబీ దూకుడు

  • Formula E Car Race: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ నేడు ఫార్ములా ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. అక్రమ నగదు చెల్లింపులపై ఇప్పటికే ఏసీబీ అభియోగాలను నమోదు చేసింది. ఈ కేసుల విచారణలో భాగంగా నేడు ఏసీబీ ముందు హాజరు కానున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి