Telangana News Live January 5, 2025: Indiramma Atmiya Bharosa: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు, లబ్దిదారుల ఎంపికపై సర్వత్రా ఆసక్తి
05 January 2025, 23:23 IST
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Indiramma Atmiya Bharosa : భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నెలలోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. అయితే అమలుపై రైతుల్లో అప్పుడే సందేహాలు మొదలయ్యాయి.
HYDRA Demolition in Madhapur : హైదరాబాద్ మాదాపూర్ లోని అక్రమ కట్టడాన్ని హైడ్రా కూల్చివేస్తుంది. అయ్యప్ప సొసైటీలోని 100 ఫీట్ రోడ్డులో ప్రధాన రహదారిని ఆనుకొని అక్రమంగా నిర్మించిన ఐదు అంతస్తుల భవనాన్ని బుల్డోజర్ల సాయంతో హైడ్రా డీఆర్‌ఎఫ్ సిబ్బంది కూల్చివేసింది.
- CMR College case : సీఎంఆర్ కాలేజీ హాస్టల్ బాత్‌రూమ్‌లో వీడియోలు తీశారంటూ.. ఇటీవల విద్యార్ధినులు ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై పోలీసులు సీరియస్ ఫోకస్ పెట్టారు. వేగంగా దర్యాప్తు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. ఆ ఇద్దరు బాత్రూమ్‌ల్లోకి తొంగిచూసినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
- Warangal : వరంగల్ రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. కాలుష్యంతో పాటు ఖర్చును తగ్గించేందుకు టీజీఎస్ ఆర్టీసీ ఈ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తుంది. వరంగల్ రీజియన్‌కు మొత్తంగా 112 బస్సులను కేటాయించారు. అందులో ముందస్తుగా 75 వెహికిల్స్ వరంగల్‌కు చేరుకున్నాయి. వాటిని ప్రారంభించనున్నారు.
- TG Sankranti Holidays 2025 : తెలంగాణలో సంక్రాంతి సెలవులపై రకరకాల ప్రచారం జరిగింది. కొందరు 11 నుంచి 16 వరకు సెలవులు అంటే.. మరికొందరు 11 నుంచి 17 వరకు అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారు. దీంతో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
- Nirmal Utsav : నిర్మల్ జిల్లా చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేసేలా.. నిర్మల్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లో నుమాయిష్‌ను స్పూర్తిగా తీసుకొని.. నిర్మల్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన 7 ప్రత్యేకలు ఇలా ఉన్నాయి.
Sankranti Special Trains 2025 : సంక్రాంతి రద్దీ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మధ్య 52 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 6 నుంచి 18 వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. రేపు లేదా ఎల్లుండి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
- IRCTC Tour Package From Hyderabad 2025: న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ టూరిజం మరో ప్యాకేజీని ప్రకటించింది. గోల్డెన్ ట్రయాంగిల్ టూర్ పేరుతో ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీలో… అగ్రా, ఢిల్లీ, జైపూర్ అందాలను చూసి రావొచ్చు. ఈ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…
- HYDRAA Prajavani Program : హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సోమవారం ‘ప్రజావాణి’ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఫిర్యాదుదారుల నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరించనుంది. ఏమైనా సందేహాలుంటే 040 - 29565758, 29560596 నంబర్లను సంప్రదించాలని ప్రకటన విడుదల చేసింది.
- Allu Arjun : హీరో అల్లు అర్జున్‌కు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. సంధ్య థియేటర్‌లో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించేందుకు బన్నీ వెళ్తారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. పరామర్శకు వస్తే జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు.
- Warangal Crime News :ఆస్తి తగాదాలతో సొంత అన్నపై తమ్ముడి హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన వరంగల్ నగరంలో జరిగింది. మెడ, గొంతుపై కత్తితో దాడి చేసే ప్రయత్నం చేయగా… గొంతు, దవడ భాగంలో కత్తి గాట్లు పడ్డాయి. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Telangana Rythu Bharosa Scheme : రైతు భరోసా స్కీమ్ పై తెలంగాణ సర్కార్ స్పష్టతనిచ్చింది. సాగుకు యోగ్యం కాని భూములకు పంట పెట్టుబడి సాయం అందించేదే లేదని స్పష్టం చేసింది. ఏడాదికి రూ. 12 వేల సాయం అందిస్తామని తెలిపింది. ఈ మేరకు తెలంగాణ కేబినెట్ పలు కీలక విషయాలకు ఆమోదముద్ర వేసింది.