LIVE UPDATES

TG High Court CJ : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్ పాల్
Telangana News Live January 14, 2025: TG High Court CJ : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్ పాల్
14 January 2025, 22:15 IST
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
తెలంగాణ News Live: TG High Court CJ : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్ పాల్
- TG High Court CJ : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్ పాల్‌ను నియమించారు. ప్రస్తుత సీజేను బాంబే హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం నోటిఫై చేసింది. జస్టిస్ సుజోయ్ పాల్ 2014 ఏప్రిల్‌లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
తెలంగాణ News Live: TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లకు ఇటుక, ఇసుక సరఫరా ఇలా.. 10 ముఖ్యమైన అంశాలు
- TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధిదారులకు వీలైనంత మేలు చేయాలని రేవంత్ సర్కారు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో.. ఇళ్ల నిర్మాణం కోసం అవసరం అయ్యే సామాగ్రి పంపిణీలోనూ కొత్త ఆలోచనలు చేస్తోంది. ఇసుక, ఇటుకల పంపిణీపై ఫోకస్ పెట్టింది.
తెలంగాణ News Live: TG Weather Update : దట్టమైన పొగమంచు కప్పేస్తోంది.. ఈ జిల్లాలకు అలర్ట్.. జనవరి నెలంతా ఇంతే!
- TG Weather Update : తెలంగాణలో మంచు దట్టంగా కురుస్తోంది. తూర్పు తెలంగాణ జిల్లాలపై మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణ News Live: Hyderabad Crime : హైదరాబాద్‌లో డబుల్ మర్డర్.. యువతి, యువకుడి దారుణ హత్య?
- Hyderabad Crime : హైదరాబాద్‌లోని నార్సింగిలో దారుణం జరిగింది. పద్మనాభస్వామి గుట్టల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఇటు మెదక్ జిల్లాలో జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ News Live: Hyderabad : పల్లె కళకళ.. పట్నం వెలవెల.. బోసిపోయిన భాగ్యనగరం వీధులు
- Hyderabad : హైదరాబాద్ వీధులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపారం కోసం భాగ్యనగరంలో నివాసం ఉంటున్నవారు సంక్రాంతి సందర్భాగా సొంతూళ్లకు వెళ్లారు. నిత్యం రద్దీగా ఉండే భాగ్యనగరం రోడ్లన్నీ ఖాళీగా మారాయి. సిటీ అంతా నిర్మానుష్యంగా మారింది. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి.
తెలంగాణ News Live: నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్
- నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ News Live: Virat Kohli restaurant : ‘టూ మచ్ ధరలు’- హైదరాబాద్‌లోని విరాట్ కోహ్లీ రెస్టారెంట్‌పై విమర్శలు..
- Virat Kohli restaurant Hyderabad : హైదరాబాద్‌లోని విరాట్ కోహ్లీ రెస్టారెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది! క్వాంటిటీకి తగ్గట్టు ధరలు లేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ స్టూడెంట్ చేసిన ఒక ట్వీట్ ఇందుకు కారణం. అసలేం జరిగిందంటే..
తెలంగాణ News Live: Suryapet crime: సూర్యాపేటలో ఘోరం.. కుమార్తెతో కన్నతండ్రి అసభ్య ప్రవర్తన,కొట్టి చంపిన ఇద్దరు భార్యలు
- Suryapet crime: సూర్యాపేట జిల్లా గుర్రంతండాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్నబిడ్డపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ఇద్దరు భార్యలు కలిసి కొట్టి చంపేశారు. మద్యం మత్తులో కుమార్తెపై కన్నేసి అసభ్యంగా ప్రవర్తించడాన్ని సహించలేక చంపేసినట్టు పోలీసులకు తెలిపారు.
తెలంగాణ News Live: KTR House Arrest: గృహ నిర్బంధంలో బీఆర్ఎస్ నేతలు.. కేటీఆర్, హరీశ్ హౌస్ అరెస్ట్
- KTR House Arrest: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంతో బీఆర్ఎస్ నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ ఆందోళనలకు పిలుపునివ్వడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేటీఆర్, హరీశ్ రావుల ఇళ్ల ముందు భారీగా పోలీసుల్ని మొహరించారు.
తెలంగాణ News Live: Koushik Reddy Arrest: జగిత్యాల ఎమ్మెల్యేపై దౌర్జన్యం ఘటనలో బీఆర్‌ఎస్ MLA పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్
- Koushik Reddy Arrest: కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై దౌర్జన్యం చేసిన వ్యవహారంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డిపై నాలుగు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి కరీంనగర్ తరలించారు.