LIVE UPDATES
Telangana Electric Power : తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం - ఇవాళ రికార్డు స్థాయిలో నమోదు (istockphoto)
Telangana News Live February 6, 2025: Telangana Electric Power : తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం - ఇవాళ రికార్డు స్థాయిలో నమోదు
Updated Feb 06, 2025 10:00 PM IST
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
తెలంగాణ News Live: Telangana Electric Power : తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం - ఇవాళ రికార్డు స్థాయిలో నమోదు
- Telangana Electric Power : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. వేసవి పూర్తిస్థాయిలో రాకముందే ఇవాళ రికార్డు వినియోగం జరిగింది. ఇవాళ 15,752 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైనట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
తెలంగాణ News Live: Teenmaar Mallanna : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ
- కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరింది. కుల గణనపై కూడా చేసిన కామెంట్స్ పై వివరాలను ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
తెలంగాణ News Live: Sangareddy : ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్‌లో దోపిడీ.. అధికారులకు సీఐటీయూ ఫిర్యాదు!
- Sangareddy : సంగారెడ్డిలోని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ ఓపెన్ చేశారు. దీంట్లో అన్నింటినీ అధిక ధరలకు అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్‌ని కలిసి ఫిర్యాదు చేశారు.
తెలంగాణ News Live: Yadadri Bhuvanagiri Collector : తెల్లారకముందే విద్యార్థి ఇంటి తలుపుతట్టిన జిల్లా కలెక్టర్ - ఎందుకో తెలుసా...?
- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టెన్త్ పరీక్షల నేపథ్యంలో ఉదయం 5 గంటలకే ఓ విద్యార్థి ఇంటికెళ్లి తలుపుతట్టారు. కంకణాలగూడెం గ్రామంలోని భరత్ చంద్ర అనే విద్యార్థితో మాట్లాడారు. చదువుకునేందుకు వీలుగా ఒక చైర్, రైటింగ్ పాడ్ గిఫ్ట్ గా ఇచ్చారు.
తెలంగాణ News Live: KTR Delhi Tour : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కేటీఆర్ బృందం భేటీ.. రోడ్ల అభివృద్ధి కోసం విజ్ఞప్తి!
- KTR Delhi Tour : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించి వినతిపత్రం అందజేశారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పంపిన ప్రతిపాదనల గురించి వివరించారు. అలాగే జాతీయ రహదారులను పొడిగించాలని కోరారు.
తెలంగాణ News Live: Telangana Politics : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట అభయహస్తం కాదు.. భస్మాసుర హస్తం : హరీష్ రావు
- Telangana Politics : రేవంత్ సర్కారుపై హరీష్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. 14 నెలల పాలనలో దరఖాస్తులు తీసుకోవడం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ కారణంగా ఎంతోమంత్రి ప్రాణాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కుమ్మరి నాగయ్య మృతికి ప్రభుత్వమే కారణమని వ్యాఖ్యానించారు.
తెలంగాణ News Live: LB Nagar Tragedy : కూలీలను పొట్టనబెట్టుకున్న నిర్లక్ష్యం.. జీహెచ్ఎంసీ సీరియస్.. అనుమతులు రద్దు
- LB Nagar Tragedy : ఎల్పీ నగర్‌లో తీవ్ర విషాదం జరిగింది. భవన నిర్మాణ సమయంలో ముగ్గురు కూలీలు మృతిచెందారు. ఈ ఘటనపై జీహెంచ్ఎంసీ సీరియస్ అయ్యింది. చర్యలకు దిగింది. భవనాన్ని నిర్మించేవారి నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణ News Live: GHMC DumpingYard: అర్ధరాత్రి ప్యారానగర్ లో GHMC అధికారుల హైడ్రామా.. డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులు ప్రారంభం
- GHMC DumpingYard: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని ప్యారా నగర్ లో అర్ధ రాత్రి హై డ్రామా చోటు చేసుకుంది. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ డంప్ యార్డ్ పెట్టాలని గత కొంతకాలంగా ప్లాన్ చేయటంతో, దగ్గర్లో ఉన్న ప్యారా నగర్, నల్లవల్లి గ్రామస్తులు దీనికి అడ్డుకుంటూ వస్తున్నారు.
తెలంగాణ News Live: South Central Railway : కాజీపేట డివిజన్ ఏర్పాటుపై చిగురిస్తున్న ఆశలు.. నేతలు పట్టుపడితే సాధ్యమే!
- South Central Railway : కేంద్రం విశాఖను.. రైల్వే డివిజన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌గా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తర, దక్షిణ భారతదేశానికి ముఖ్య కూడలిగా ఉన్న కాజీపేట జంక్షన్‌కు.. డివిజన్ హోదా దక్కుతుందనే ఆశలు చిగురిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ News Live: Medaram Jatara: వన దేవతల పున: దర్శనానికి వేళాయే! గుడి మెలిగె పండుగతో మినీ మేడారం జాతరకు శ్రీకారం
- Medaram Jatara: వన దేవతలు సమ్మక్క, సారలమ్మ పున: దర్శనానికి వేళైంది. అసియాలోనే అతిపెద్ద జాతర, తెలంగాణ కుంభమేళాగా మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర జరుగుతుండగా.. మహాజాతర ముగిసిన ఏడాదికి అదే మాదిరిగా మినీ మేడారం జాతర కూడా జరుగుతుంది.
తెలంగాణ News Live: Vaccine Reaction: టీకా వికటించి పసిపాప మృతి, బంధువుల ఆందోళన, పరిస్థితి ఉద్రిక్తం.. పలువురి అరెస్టు
- Vaccine Reaction: రాజన్న సిరిసిల్ల జిల్లాలో టికా వికటించి 45 రోజుల పసిపాప మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటు బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులతో వాగ్వాదానికి దిగగా అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులపై తిరగబడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ News Live: Karimnagar Kidnap: కరీంనగర్ లో మైనర్ బాలిక కిడ్నాప్...గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు.
- Karimnagar Kidnap: కరీంనగర్ లో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. పద్మనగర్ కు చెందిన 16 ఏళ్ళ మైనర్ బాలికను కిడ్నాప్ చేశారు. కుటుంబ సభ్యులు ఆందోళనతో పోలీసులను ఆశ్రయించారు. అప్రమత్తమైన టూ టౌన్ పోలీసులు గంటల వ్యవధిలో కిడ్నాప్ ను ఛేదించారు.