తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live February 18, 2025: Bathukamma Kunta : హైడ్రా త‌వ్వకాల్లో బ‌య‌ట‌ప‌డిన బ‌తుక‌మ్మకుంట‌, డ్రైనేజీ నీరని ప్రచారం-భూగర్భ జలమేనని జలమండలి నిర్థారణ
Bathukamma Kunta : హైడ్రా త‌వ్వకాల్లో బ‌య‌ట‌ప‌డిన బ‌తుక‌మ్మకుంట‌, డ్రైనేజీ నీరని ప్రచారం-భూగర్భ జలమేనని జలమండలి నిర్థారణ
Bathukamma Kunta : హైడ్రా త‌వ్వకాల్లో బ‌య‌ట‌ప‌డిన బ‌తుక‌మ్మకుంట‌, డ్రైనేజీ నీరని ప్రచారం-భూగర్భ జలమేనని జలమండలి నిర్థారణ

Telangana News Live February 18, 2025: Bathukamma Kunta : హైడ్రా త‌వ్వకాల్లో బ‌య‌ట‌ప‌డిన బ‌తుక‌మ్మకుంట‌, డ్రైనేజీ నీరని ప్రచారం-భూగర్భ జలమేనని జలమండలి నిర్థారణ

Updated Feb 18, 2025 10:16 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Updated Feb 18, 2025 10:16 PM IST

తెలంగాణ News Live: Bathukamma Kunta : హైడ్రా త‌వ్వకాల్లో బ‌య‌ట‌ప‌డిన బ‌తుక‌మ్మకుంట‌, డ్రైనేజీ నీరని ప్రచారం-భూగర్భ జలమేనని జలమండలి నిర్థారణ

  • Hydra Bathukamma Kunta : హైదరాబాద్ లో చెరువుల పునరుద్ధరణపై చర్యలు చేపట్టిన హైడ్రా...అంబర్ పేటలోని బతుకమ్మకుంటలో తవ్వకాలు చేపట్టింది. మోకాలిలోతులో మట్టి తవ్వగానే నీరు పైకి ఉబికి వచ్చింది. అయితే అది డ్రైనేజీ నీరని సోషల్ మీడియాలో ప్రచారం జరగగా, జలమండలి అధికారులు భూగర్భ జలంగా నిర్ణయించారు.

పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 18, 2025 10:16 PM IST

తెలంగాణ News Live: Medak Crime : మెదక్ లో దారుణం, వివాహేతర సంబంధం కొనసాగించడంలేదని ప్రాణం తీశాడు

  • Medak Crime : వివాహేతర సంబంధం మహిళ ప్రాణాలు తీసింది. మెదక్ ఫతేనగర్ కు చెందిన ఓ మహిళతో కొంత కాలంగా ఓ వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తన కుమారులకు తెలిసిపోయిందని మహిళ అతడిని దూరం పెట్టింది. దీంతో కక్ష పెంచుకుని ఆమెను హత్య చేశాడు ప్రియుడు.

పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 18, 2025 10:16 PM IST

తెలంగాణ News Live: Whats App Chat : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం, బాలుడి ప్రాణం తీసిన వాట్సాప్ చాటింగ్

  • Whats App Chat : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాట్సాప్ చాటింగ్ ప్రాణం తీసింది. తొమ్మిదో తరగతి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనతో పాటు చదువుతున్న బాలికతో చాటింగ్ చేసిన బాలుడ్ని బాలిక బంధువులు బెదిరించారు. దీంతో భయపడిన బాలుడు సూసైడ్ చేసుకున్నాడు.

పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 18, 2025 10:16 PM IST

తెలంగాణ News Live: Mlc Kavitha : రాజకీయ కక్షతోనే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడంలేదు - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

  • Mlc Kavitha : మేడిగడ్డ ప్రాజెక్టును వాడుకోకుండా తెలంగాణను ఎండబెడుతున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు. తెలంగాణ నీళ్లు మలపాలన్న సోయి లేని సీఎం రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. రాజకీయ కక్షతోనే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 18, 2025 10:16 PM IST

తెలంగాణ News Live: హస్తం పార్టీకి హనీమూన్ ముగిసింది.. బోటుకు ఇక మరమ్మతులు అవసరం.. పీపుల్స్ పల్స్ విశ్లేషణ

  • ‘కాంగ్రెస్ కావాలి.. మార్పు రావాలనే నినాదంతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీకి హనీమూన్ ముగిసింది..’ - క్షేత్రస్థాయి సర్వేల్లో పాల్గొనే పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నుంచి అనలిస్ట్ మురళీ కృష్ణ అందిస్తున్న విశ్లేషణ ఇది.
పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 18, 2025 10:16 PM IST

తెలంగాణ News Live: Telangana High Court : తెలంగాణ హైకోర్టులో తీవ్ర విషాదం.. వాదనలు వినిపిస్తుండగా లాయర్‌కు గుండెపోటు, మృతి

  • Telangana High Court : హార్ట్ ఎటాక్.. ఎవ్వరికి ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. ఏ వయస్సు వారైనా గుండెపోటుకు గురవుతారని నిపుణులు చెబుతున్నారు. తాజాగా తెలంగాణ హైకోర్టులో తీవ్ర విషాదం జరిగింది. వాదనలు వినిపిస్తుండగా.. లాయర్‌కు గుండెపోటు వచ్చి మృతిచెందారు.
పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 18, 2025 10:16 PM IST

తెలంగాణ News Live: Namo Drone Didi Scheme : నమో డ్రోన్ దీదీ పథకం మహిళలకు వరం.. వరంగల్ 'వకుల' అందరికీ ఆదర్శం!

  • Namo Drone Didi Scheme : వ్యవసాయ రంగంలో సాంకేతిక వినియోగం పెరిగేలా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. అదే సమయంలో స్వయం ఉపాధికి బాటలు వేస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి కేంద్రం నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రవేశపెట్టింది.
పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 18, 2025 10:16 PM IST

తెలంగాణ News Live: Hyderabad ORR : ఓఆర్ఆర్‌పై లగ్జరీ కార్లతో అర్ధరాత్రి విన్యాసాలు.. ఇద్దర్ని అరెస్టు చేసిన పోలీసులు

  • Hyderabad ORR : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు.. నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటి రోడ్డుపై ఇద్దరు యువకులు లగ్జరీ కార్లతో విన్యాసాలు చేశారు. నంబర్ ప్లేట్లు తీసేసి.. అర్ధరాత్రి హంగామా చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వీరిని పోలీసులు అరెస్టు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 18, 2025 10:16 PM IST

తెలంగాణ News Live: TG Rythu Bharosa : రైతులకు శుభవార్త.. మార్చి మొదటి వారంలో బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి!

  • TG Rythu Bharosa : రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు భరోసా నిధుల విడుదల విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన అందరికీ నిధులు జమ చేయాలని స్పష్టం చేసింది. బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమకాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మంత్రులు స్పష్టం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 18, 2025 10:16 PM IST

తెలంగాణ News Live: Karimnagar Crime: తప్పుడు పత్రాలతో ఆస్తిని కాజేసిన తనయుడు, తల్లి, సోదరిని మోసం చేసిన నిందితుడి అరెస్ట్‌

  • Karimnagar Crime: ఆస్తి కోసం కన్నవారిని తోబుట్టువులను మోసం చేసిన ఘటన కరీంనగర్ లో వెలుగులోకి వచ్చింది. తండ్రీ పేరిట ఉన్న ఆస్థిని కాజేసేందుకు తప్పుడు పత్రాలు సృష్టించి తండ్రీ డెత్ సర్టిఫికెట్ తీసుకుని ఘరానా మోసానికి పాల్పడిన కొడుకుతో పాటు అందుకు సహకరించిన ఆరుగురి పై కేసు నమోదు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 18, 2025 10:16 PM IST

తెలంగాణ News Live: Bhupalpally District : 'ఎస్సై వేధింపులు తట్టుకోలేకపోతున్నాం' - కలెక్టరేట్‌‌ ఎదుట ఫ్లెక్సీతో దంపతుల నిరసన

  • ఎస్సై వేధింపులు తట్టుకోలేకపోతున్నాం.. ఆత్మహత్యకు అనుమతించండంటూ వృద్ధ దంపతులు ఆందోళనకు దిగారు. భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట ఫ్లెక్సీతో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. భూమి బాట విషయంలో వివాదం నెలకొందని… తమపై అక్రమ కేసులు పెట్టారని వాపోయారు. దీంతో ఆర్డీవో వారితో మాట్లాడి నిరసన విరమింపజేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 18, 2025 10:16 PM IST

తెలంగాణ News Live: Telangana Caste Census : మీరు 'కుల గణన' సర్వేలో పాల్గొనలేదా..? అయితే వెంటనే ఇలా చేయండి

  • రాష్ట్రంలో కుల గణన సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో నిర్వహించిన సర్వేలో పాల్గొనని వారు… ఈ సర్వే ద్వారా వివరాలను ఇవ్వొచ్చు. ఫిబ్రవరి 28వ తేదీ వరకు అవకాశం ఉంది. ఫోన్ ద్వారా లేదా ఆన్ లైన్ ద్వారా సమాచారం ఇచ్చి వివరాలు నమోదు చేసుకోవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 18, 2025 10:16 PM IST

తెలంగాణ News Live: Farm Lands Fraud: ఫార్మ్‌ ల్యాండ్స్‌ కొంటున్నారా?వాటి చట్టబద్దతపై హైడ్రా వార్నింగ్…

  • Farm Lands Fraud: తక్కువ ధరకు ఎక్కువ భూమి వస్తుందనే ఆశతో ముందు వెనుక ఆలోచించకుండా ఫార్మ్‌ ల్యాండ్స్‌ కొనుగోలు చేస్తే తిప్పలు తప్పవు.  ఫార్మ్ ల్యాండ్స్‌ చట్టబద్దతపై హైడ్రా కమిషనర్‌ హెచ్చరించారు. వ్యవసాయ భూముల్లో నిర్మాణాలకు అనుమతులకు  నిబంధనలు తెలియకుండా వాటిని కొనొద్దని హెచ్చరించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 18, 2025 10:16 PM IST

తెలంగాణ News Live: Karimnagar Farmer: ఆదర్శ రైతుకు అరుదైన పురస్కారం, మల్లిఖార్జున్ రెడ్డికి ఈనెల 22న ప్రదానం...

  • Karimnagar Farmer: ఉద్యోగం వదిలి సాగుబడిచేపట్టి ఆదర్శ రైతుగా ఎన్నో అవార్డులు అందుకున్నారు కరీంనగర్ జిల్లా పెద్దకుర్మపల్లికి చెందిన మావురం మల్లిఖార్జున్ రెడ్డి. మందులు వాడకుండా సమీకృత సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ఆయన తాజాగా ఫెల్లో ఫార్మర్ పురస్కారానికి ఎంపికయ్యారు. 
పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 18, 2025 10:16 PM IST

తెలంగాణ News Live: Mlc Elections: ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితా విడుదల, మొత్తం 3,55,159మంది ఓటర్లు

  • Mlc Elections: ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఓటర్ల ఫైనల్ లిస్ట్ విడుదలైంది. పట్టభద్రుల ఓటర్లు 3,55,159 మంది కాగా టీచర్ ఓటర్లు 27,088 మందిగా తేలింది. కరీంనగర్, ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో పట్టభద్రుల ఓటర్లు 355159 మంది, టీచర్ ఓటర్లు 27088 మంది ఉన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Updated Feb 18, 2025 10:16 PM IST

తెలంగాణ News Live: Krishna Water : ఏపీ విషయంలో అలర్ట్ గా ఉండండి.. టెలీమెట్రీ అమలుకు లేఖ రాయండి - సీఎం రేవంత్ ఆదేశాలు

  • ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాబోయే మూడు నెలలు అత్యంత కీలకమన్నారు. నిర్ణీత వాటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా చూడాలని చెప్పారు. ఉల్లంఘనలకు పాల్పడితే వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని అధికారులకు సూచించారు.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి