Telangana News Live December 9, 2024: Manchu Family Issue : పోలీస్ స్టేషన్ కు చేరిన మంచు ఫ్యామిలీ వివాదం, మోహన్ బాబుపై మనోజ్ ఫిర్యాదు!
09 December 2024, 20:06 IST
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Manchu Family Issue : మంచు ఫ్యామిలీ వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది. హీరో మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. నిన్న జరిగిన దాడిపై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
Telangana Talli Statue : తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రులు, అధికారులు, ప్రజల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
- KTR : తెలంగాణలో నవంబర్ 29, డిసెంబర్ 9వ తేదీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ రెండు తేదీలపై కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరుగుతోంది. అటు సోనియా గాంధీ పుట్టినరోజు కూడా. ఈ సమయంలో కేటీఆర్ చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారాయి.
- Warangal : ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని కావాలన్నా లంచాలు ఇవ్వాల్సిందే. ఆఫీసర్లు సంతకం పెట్టాలన్నా.. ఫైల్ ముందుకు కదలాలన్నా చేతులు తడపక తప్పదు. ఇటీవల ఏసీబీ దాడుల్లో పట్టుబడుతున్న అధికారుల ఉదంతాలే ఇందుకు సాక్ష్యం. ఇలాంటి అవినీతిని రూపుమాపేందుకు వరంగల్ యువకుడు ఒంటరి పోరు చేస్తున్నారు.
Warangal News : సమాజంలో అవినీతిని రూపుమాపేందుకు వరంగల్ కు చెందిన ఓ యువకుడు దాదాపు పది సంవత్సరాల నుంచి ఒంటరి పోరు చేస్తున్నాడు. ‘జ్వాలా’ అవినీతి నిరోధక స్వచ్ఛంద సంస్థను స్థాపించి, దాని ఆధ్వర్యంలో లంచాలను నిర్మూలించాలనే ఉద్దేశంతో వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.
Chennamaneni Ramesh : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. రమేశ్ జర్మన్ పౌరుడేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. తప్పుడు పత్రాలతో కోర్టును తప్పుదోవ పట్టించినందుకు రమేశ్ కు రూ.30 లక్షల జరిమానా విధించింది.
- TG MeeSeva Mobile App : తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. పౌరసేవలను మరింత సులభతరం చేయనుంది. సరికొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తేనుంది. దీని ద్వారా పౌరులకు సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. ఈ యాప్‌తో ఇంటి వద్దే పౌర సేవలు అందనున్నాయి.
- Telangana Thalli : తెలంగాణ అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లిపై శాసన సభలో చర్చ జరిగింది. తెలంగాణ తల్లి.. ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి పరిమితం కాదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. సోనియాగాంధీ లేకపోతే.. తెలంగాణ వచ్చేది కాదని వ్యాఖ్యానించారు.
- Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ తల్లి విగ్రహం గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఒక్కరోజు తెలంగాణ సమాజం కోసం సమయం ఇద్దామని పిలుపునిచ్చారు. డిసెంబర్ 9కి ఎంతో ప్రాధాన్యత ఉందన్న సీఎం.. ఇవాళ వివాదాలకు తావివ్వొద్దని విజ్ఞప్తి చేశారు.
- Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం అయ్యింది. తొలిరోజే బీఆర్ఎస్ వినూత్న నిరసన తెలిపింది. అదానీ రేవంత్ భాయ్ భాయ్ అంటూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. అదానీ, రేవంత్ ఫొటో ఉన్న టీ షర్టులను ధరించి అసెంబ్లీకి వచ్చారు. వారిని గేటు వద్దే అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ భగ్గుమంది.
- Hyderabad : హైదరాబాద్ భారతదేశానికి సైన్స్ రాజధానిగా అభివృద్ధి చెందుతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ చారిత్రక నేపథ్యం.. విద్యా సంస్థలు, పరిశోధన సంస్థలు ఇక్కడ నెలకొల్పడంతో.. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో భాగ్యనగరం దూసుకుపోతోంది.
- Vemulawada Rajanna Kodelu : వేములవాడ రాజన్న కోడెలకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజన్న కోడెలను కబేళాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- TGPSC Group2: తెలంగాణ గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో గుర్తించిన 1368 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. అభ్యర్థులు నేటి నుంచి హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- TG Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజు పలు కీలక బిల్లులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఏడాది పాలన విజయాలను వివరించేందుకు సిద్ధమవుతుంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ రెడీ అయ్యింది.