Telangana News Live December 7, 2024: TGPSC Group 2 Exams : తెలంగాణ గ్రూప్-2 పరీక్షలకు 1368 సెంటర్లు ఏర్పాటు, ఈ నెల 9 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో
07 December 2024, 22:04 IST
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
TGPSC Group 2 Exams : గ్రూప్-2 పరీక్షలకు టీజీపీఎస్సీ అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షల కోసం రాష్ట్ర వ్యప్తంగా 1368 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ నెల 9 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
Khammam Cyber Crime : సైబర్ కేటుగాళ్ల వలలో పడిన విశ్రాంత ఉద్యోగి అక్షరాలా రూ.15 లక్షలు పోగొట్టుకున్నారు. హవాలా చేస్తున్నారని బెదిరించి, సీబీఐ, సుప్రీంకోర్టు సమన్లు పేరిట రూ.15 లక్షలు తమ ఖాతాలు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు.
Adilabad Singer : పుష్ప2 సినిమా రికార్డులు బద్దలుకొడుతోంది. ఈ సినిమాలో హిట్ సాంగ్ అయిన ఫీలింగ్స్ సాంగ్ ఆదిలాబాద్ కు చెందిన సింగర్ లక్ష్మిదాస్. ఈమె పాడిన జానపదాలు అందరినీ అలరించారు. ఓ బావో సైదులు, ఆనాడేమన్నంటిన తిరుపతి... తిన్నా తీరం పడతలే ఫోక్ సాంగ్స్ లక్ష్మిదాస్ కు పేరు తెచ్చిపెట్టాయి.
- Invitation to KCR : చివాలయంలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఈనెల 9వ తేదీన విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి రావాలని.. మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రభుత్వం ఆహ్వానించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా వెళ్లి కేసీఆర్‌ను ఆహ్వానించారు.
Oil Palm Farmers : తెలంగాణ రైతాంగానికి ఆయిల్ పామ్ సిరులు కురిపిస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీతో పాటు ఏడాదిలోని రూ.7 వేలకు పైగా ధర పెరిగింది. ఒక్క సిరిసిల్ల జిల్లాలో 2100 ఎకరాలలో 700 మంది రైతులు ఈ పంటని సాగు చేస్తున్నారు.
తెలంగాణలో మళ్లీ భూ ప్రకంపనలు వచ్చాయి. మహబూబ్ నగర్ జిల్లాలో మరోసారి భూమి కంపించింది. పలు ప్రాంతాల్లో 3.0 తీవ్రతతో భూమి కంపించింది.
- Telangana Police : ఓ దొంగ అంబులెన్స్‌ను చోరీ చేశాడు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు యాక్షన్ మూవీ రేంజ్‌లో ఛేజింగ్ చేశారు. దాదాపు గంటన్నర బీభత్సం సృష్టించిన ఆ దొంగ.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారికి గాయాలు అయ్యాయి. ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు.
- Konda Surekha : మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి వేములవాడ ఆలయ ఈవో కారణంగా మంత్రిపై విమర్శలు వస్తున్నాయి. ఆలయ కోడెల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి. కోడెలను నిబంధనలకు విరుద్ధంగా ఓ వ్యక్తికి అప్పగించారని ప్రచారం జరుగుతోంది.
- డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదంతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో టీజీపీఎస్సీ ఛైర్మన్ గా కూడా ఘంటా చక్రపాణి పని చేశారు.
- TG Rythu Runa Mafi Scheme : తెలంగాణ రుణమాఫీ స్కీమ్ అమలు చేసిన సంగతి తెలిసిందే. 4 విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేశారు. అయితే ఇంకా చాలా మంది రైతుల రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రైతులు ఇందులో ఉన్నారు.
- TG Jawahar Navodaya Vidyalaya : తెలంగాణ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మరో 7 జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
- యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.
- South Central Railway Sabarimala Trains : అయ్యప్త భక్తులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. మరో 22 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కాచిగూడ, హైదరాబాద్, నాందేడ్ తో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి ఈ రైళ్లు నడవనున్నాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీటిని ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.
- Telangana State Tourism Policy :ఫ్యూచర్ సిటీలో మెగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసే విషయంపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. విమానాశ్రయం నుంచి 20 నిమిషాల్లో చేరుకునేలా కన్వెన్షన్ సెంటర్ ఉండాలన్నారు. డిసెంబర్ 31లోపు కొత్త పర్యాటక విధానం తయారు చేయాలని స్పష్టం చేశారు.