LIVE UPDATES
TGTD Logo : తెలంగాణ రవాణా శాఖ కొత్త లోగో విడుదల
Telangana News Live December 5, 2024: TGTD Logo : తెలంగాణ రవాణా శాఖ కొత్త లోగో విడుదల
05 December 2024, 22:21 IST
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
తెలంగాణ News Live: TGTD Logo : తెలంగాణ రవాణా శాఖ కొత్త లోగో విడుదల
- Telangana Transport Department Logo : రాష్ట్ర రవాణా శాఖ రూపొందించిన లోగోను (TGTD) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే 2 ఏండ్లలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి నడిపిస్తామని చెప్పారు.
తెలంగాణ News Live: Jagtial District Crime : ఆస్తి కోసం అన్నను హత్య చేసిన తమ్ముడు - ఇలా దొరికిపోయాడు
- ఆస్తి కోసం సొంత అన్ననే తమ్ముడు హత్య చేశాడు. ఇందుకు మరో ఇద్దరు కూడా సహకరించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది. విచారణ జరిపిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. డబ్బులపై అత్యాశతో హత్య చేసినట్లు తేల్చారు.
తెలంగాణ News Live: Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక.. మొదట ఎవరికి ఇస్తారు.. 10 ముఖ్యమైన అంశాలు
- Indiramma Housing Scheme : తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎంతోమంది ఈ పథకం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం ఇవాళ ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. అలాగే లబ్ధిదారుల ఎంపికపై కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ News Live: Telangana Congress Six Guarantees : కాంగ్రెస్ ఏడాది పాలన...! 6 గ్యారెంటీల అమలు ఎక్కడి వరకు వచ్చింది..?
- Congress Six Guarantees in Telangana : తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది కావొస్తుంది. డిసెంబర్ 9వ తేదీ నాటికి రేవంత్ సర్కార్ కు 365 రోజులు పూర్తవుతాయి. అయితే ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు ఎక్కడి వరకు వచ్చింది..? ఎన్ని హామీలు పట్టాలెక్కాయనే దానిపై ఓ లుక్కేద్దాం…..
తెలంగాణ News Live: Telangana Tourism : వన్ డే ట్రిప్ లో 9 స్పాట్స్ చూడొచ్చు..! మీకోసమే ‘హైదరాబాద్ సిటీ టూర్ ప్యాకేజీ’ - ధర చాలా తక్కువ
- Telangana Tourism Hyderabad City Tour: హైదరాబాద్ నగరాన్ని చూసేందుకు మంచి ప్యాకేజీ వచ్చేసింది. నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూసేందుకు తెలంగాణ టూరిజం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. కేవలం ఒక్కరోజులోనే పూర్తి అవుతుంది. టూరిజం వెబ్ సైట్లోకి వెళ్లి టికెట్లను బుకించ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే…..
తెలంగాణ News Live: Harish Rao vs Revanth Reddy : ఊసరవెల్లి కూడా రేవంత్‌ను చూసి సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంటది : హరీష్ రావు
- Harish Rao vs Revanth Reddy : తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి టార్గెట్‌గా హరీష్ రావు, కేటీఆర్ పంచ్ డైలాగ్‌లు పేలుస్తున్నారు. అటు రేవంత్ తగ్గడం లేదు. తనదైన స్టైల్‌లో కౌంటర్లు ఇస్తున్నారు.
తెలంగాణ News Live: Vemulawada : మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్ మెయిల్..! వేములవాడలో కి'లేడీ' హోంగార్డ్ అరెస్ట్
- మహిళా హోంగార్డు "కి"లాడిగా మారింది. బ్లాక్ మెయిల్ తో మోసం చేసింది. వేములవాడ టెంపుల్ రిటైర్డ్ ఉద్యోగి ఆమె వలలో పడి మోసపోయాడు. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో కిలాడి హోంగార్డును అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.
తెలంగాణ News Live: SCR Festival Special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్... సికింద్రాబాద్ - విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు, ఇవిగో వివరాలు
- SCR Festival Special Trains : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇక్కడ్నుంచి విశాఖ, బ్రహ్మపురకు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. రూట్ల వివరాలతో పాటు తేదీలను ఇక్కడ చూడండి…
తెలంగాణ News Live: Telangana Assembly : కేసీఆర్ ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలి.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
- Telangana Assembly : మరో నాలుగు రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, తమకు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. రేవంత్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
తెలంగాణ News Live: Telangana Tourism : అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు.. రామప్ప అభివృద్ధికి భారీగా నిధులు!
- Telangana Tourism : రామప్ప.. కాకతీయుల కళా వైభవానికి ప్రతీక. గతంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. కానీ.. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రామప్పపై ఫోకస్ పెట్టాయి. తాజాగా.. రామప్ప ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి భారీగా నిధులు కేటాయించాయి.
తెలంగాణ News Live: TG Indiramma Illu: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారుల ఎంపికకు యాప్ విడుదల.. వివరాలు అప్డేట్ చేసుకోండి….
- TG Indiramma Illu: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ‌్ళకు లబ్దిదారుల ఎంపిక కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఏడాది ఒక్కో నియోజక వర్గంలో 3500ఇళ్ల నిర్మాణాన్ని చేపడతారు. గ్రామ సభల ద్వారా ఇళ్ల నిర్మాణానికి లబ్దిదారులను ఎంపిక చేస్తారు. యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణ News Live: Vajedu SI Suicide Case : వాజేడు ఎస్సై ఆత్మహత్య.. సోషల్ మీడియా నుంచి సూసైడ్ వరకు.. 11 ముఖ్యమైన అంశాలు
- Vajedu SI Suicide Case : ములుగు జిల్లాలో వాజేడు ఎస్సై సూసైడ్ ఘటన సంచలనంగా మారింది. ఈ ఇష్యూలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా నుంచి సూసైడ్ వరకు జరిగిన పరిణాలపై ఆరా తీస్తున్నారు.
తెలంగాణ News Live: Harish Rao Arrest: బీఆర్‌ఎస్ నాయకుడు హరీష్ రావు అరెస్ట్.. గచ్చిబౌలి పీఎస్‌కు తరలింపు
- Harish Rao Arrest: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నాయకుడు హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి హరీష్ రావు వెళ్లిన సమయంలో హరీష్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ నుంచి గచ్చిబౌలి తరలిస్తున్నారు.
తెలంగాణ News Live: TG Assembly Session: డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి…
- TG Assembly Session: డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు ఎన్ని రోజుల పాటు సమావేశాలు జరపాలనేది బిఏసీ భేటీలో నిర్ణయిస్తారు.
తెలంగాణ News Live: Revanth Reddy: కులగణనలో పాల్గొనకుంటే సామాజిక బహిష్కరణ చేయండి... పెద్దపల్లి యువ వికాసం సభలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
- Revanth Reddy: కులగణనలో పాల్గొనని వారిని సామాజిక బహిష్కరణ చేయండని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. కేసిఆర్ కేటిఆర్ హరీష్ రావు ఎందుకు కులగణనలో పాల్గొన లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం మంచి పని చేస్తే స్వాగతించాలి కానీ అనవసరమైన విమర్శలతో తప్పుదారి పట్టించ ఎంత వరకు సమంజసమన్నారు.
తెలంగాణ News Live: Pushpa Movie Tragedy: పుష్ప2 మూవీ రిలీజ్‌లో విషాదం, తొక్కిసలాటలో మహిళ మృతి..బాలుడి పరిస్థితి విషమం
- Pushpa Movie Tragedy: పుష్ప 2 సినిమా రిలీజ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. హైదరబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె తనయుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బాలుడిని ఆస్పత్రికి తరలించారు.