తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live December 30, 2024: Hyderabad New Year : హైదరాబాద్ వాసులకు అలర్ట్- ఫ్లైఓవర్లు మూసివేత, ఉచిత ప్రయాణం, మెట్రో సమయాలు పొడిగింపు
Hyderabad New Year : హైదరాబాద్ వాసులకు అలర్ట్- ఫ్లైఓవర్లు మూసివేత, ఉచిత ప్రయాణం, మెట్రో సమయాలు పొడిగింపు
Hyderabad New Year : హైదరాబాద్ వాసులకు అలర్ట్- ఫ్లైఓవర్లు మూసివేత, ఉచిత ప్రయాణం, మెట్రో సమయాలు పొడిగింపు (X)

Telangana News Live December 30, 2024: Hyderabad New Year : హైదరాబాద్ వాసులకు అలర్ట్- ఫ్లైఓవర్లు మూసివేత, ఉచిత ప్రయాణం, మెట్రో సమయాలు పొడిగింపు

30 December 2024, 19:45 IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

30 December 2024, 19:45 IST

తెలంగాణ News Live: Hyderabad New Year : హైదరాబాద్ వాసులకు అలర్ట్- ఫ్లైఓవర్లు మూసివేత, ఉచిత ప్రయాణం, మెట్రో సమయాలు పొడిగింపు

  • Hyderabad New Year Restrictions : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 రాత్రి 10 గం. నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు నగరంలోని ఫ్లైఓవర్లు మూసివేయనున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని స్పష్టం చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

30 December 2024, 19:41 IST

తెలంగాణ News Live: Ganja Chocolates: న్యూఇయర్‌ ఈవెంట్స్‌.. ఒడిశా టూ హైదరాబాద్‌ గంజా స్మగ్లింగ్, ట్రావెల్స్‌ బస్సులో రవాణా

  • Ganja Chocolates:  న్యూ ఇయర్‌ వేడుకల నేపథ్యంలో ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు  తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను, గోవా నుంచి తరలిస్తున్న మద్యాన్ని  తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిస్సా నుంచి ట్రావెల్స్‌ బస్సుల్లో గంజాయి చాక్లెట్లు, గోవా రైల్లో  డ్యూటీ చెల్లించని మద్యాన్ని గుర్తించారు. 
పూర్తి స్టోరీ చదవండి

30 December 2024, 18:26 IST

తెలంగాణ News Live: CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటాం, సీఎం రేవంత్ రెడ్డి భేటీలో సత్య నాదెళ్ల

  • CM Revanth Reddy Meets Satya Nadella : తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. హైదరాబాద్ లోని సత్య నాదెళ్ల నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి బృందం ఆయనతో భేటీ అయ్యింది.

పూర్తి స్టోరీ చదవండి

30 December 2024, 18:23 IST

తెలంగాణ News Live: Nalgonda : కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి.. కలెక్టర్‌ను కోరిన ఎస్సై భార్య, పిల్లలు

  • Nalgonda : తెలంగాణ పోలీస్ శాఖలో కొందరు అధికారుల అక్రమ సంబంధాలు రచ్చకెక్కుతున్నాయి. ఇప్పటికే ఎన్నో ఘటనలు వెలుగులోకి రాగా.. తాజాగా నల్గొండ జిల్లాలో ఓ ఎస్సై భార్య కలెక్టర్ వద్దకు వచ్చింది. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. పిల్లలకు, తనకు ప్రాణభయం ఉందని తెలిపింది.
పూర్తి స్టోరీ చదవండి

30 December 2024, 17:19 IST

తెలంగాణ News Live: Warangal : న్యూ ఇయర్ వేడుకలపై వరంగల్ పోలీసుల ఆంక్షలు.. తాగి రోడ్డెక్కితే అంతే సంగతులు!

  • Warangal : ఇయర్ ఎండ్, న్యూ ఇయర్ సంబరాలకు వరంగల్ పోలీసులకు కండీషన్స్ పెట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని.. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. డిసెంబర్ 31న సంబరాలను అర్ధరాత్రి 12.30 గంటలలోపే క్లోజ్ చేయాలన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

30 December 2024, 16:10 IST

తెలంగాణ News Live: Tirumala TG MP MLAs Letters : తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు అనుమతి , సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

  • Tirumala TG MP MLAs Letters : తిరుమల దర్శనాలకు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల అనుమతిపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు.

పూర్తి స్టోరీ చదవండి

30 December 2024, 16:09 IST

తెలంగాణ News Live: Bandi Sanjay : పవన్‌కు రేవంత్‌ ఏ విషయంలో గొప్పగా కనిపించారు : బండి సంజయ్‌

  • Bandi Sanjay : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ చేసిన కామెంట్స్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. పవన్‌కు రేవంత్‌ ఏ విషయంలో గొప్పగా కనిపించారని ప్రశ్నించారు.
పూర్తి స్టోరీ చదవండి

30 December 2024, 14:26 IST

తెలంగాణ News Live: TG New Year Celebrations : కేసులు నమోదైతే తిప్పలు తప్పవు.. పోలీసుల వార్నింగ్.. 10 ముఖ్యమైన అంశాలు

  • TG New Year Celebrations : కొత్త సంవత్సరం వస్తుంది. ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడానికి యువత సిద్ధం అవుతోంది. అయితే.. వేడుకలు సజావుగా నిర్వహించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే.. చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు. వేడుకలకు సంబంధించి 10 సూచనలు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

30 December 2024, 12:32 IST

తెలంగాణ News Live: Allu Arjun Bail: అల్లు అర్జున బెయిల్‌ పిటిషన్‌పై విచారణ పూర్తి.. నిర్ణయం వెలువడేది అప్పుడే..

  • Allu Arjun Bail: సినీ నటుడు అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ ముగిసింది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. 
పూర్తి స్టోరీ చదవండి

30 December 2024, 12:17 IST

తెలంగాణ News Live: TG Constables Suicides: మహిళ వేధింపులతో ఒకరు, ఆన్‌లైన్‌ మోసంతో మరొకరు.. మెదక్‌ కానిస్టేబుళ్ల ఆత్మహత్యల వెనుక మిస్టరీ

  • TG Constables Suicides: ఉమ్మడి మెదక్‌ జిల్లాలో  పోలీస్‌ శాఖలో మరణాలు కలకలం రేపుతున్నాయి. రోజుల వ్యవధిలోనే పలువురు సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడటం డిపార్ట్‌మెంట్‌లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా మహిళ వేధింపులు తాళలేక  ఒకరు, ఆన్‌లైన్‌ మోసాలతో మరొకరు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. 
పూర్తి స్టోరీ చదవండి

30 December 2024, 12:13 IST

తెలంగాణ News Live: Telangana Assembly : సింపుల్ లివింగ్- హై థింకింగ్‌కు పర్యాయపదం మన్మోహన్ సింగ్ : కేటీఆర్

  • Telangana Assembly : మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి.. పూర్తి మద్దతు ఇస్తున్నట్టు కేటీఆర్ స్పష్టం చేశారు. సింపుల్ లివింగ్- హై థింకింగ్ అనే జీవన విధానానికి మన్మోహన్ సింగ్ పర్యాయపదం అని కొనియాడారు. లాయల్టీకి మారుపేరు మన్మోహన్ సింగ్ అని అభివర్ణించారు.
పూర్తి స్టోరీ చదవండి

30 December 2024, 11:33 IST

తెలంగాణ News Live: Telangana Assembly : తెలంగాణ ఆత్మబంధువు మన్మోహన్‌ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి : రేవంత్ రెడ్డి

  • Telangana Assembly : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తెలంగాణ అసెంబ్లీ నివాళులర్చించింది. శాసనసభలో సీఎం రేవంత్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మన్మోహన్‌ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల గుండెల్లో మన్మోహన్‌ స్థానం శాశ్వతమన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

30 December 2024, 11:14 IST

తెలంగాణ News Live: Telangana ACB : 2024లో తెలంగాణ ఏసీబీ రికార్డ్.. 170 మంది అవినీతి అధికారుల అరెస్టు!

  • Telangana ACB : అవినీతి అధికారులకు తెలంగాణ ఏసీబీ చుక్కలు చూపిస్తోంది. 2024 సంవత్సరంలో ఏకంగా 170 మంది లంచగొండి అధికారులను అరెస్టు చేసి రికార్డ్ సృష్టించింది. ముఖ్యంగా 5 శాఖల్లో ఎక్కువ అవినీతి జరిగింది. అరెస్టు అయిన అధికారుల్లో ఎక్కువమంది పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల వారే ఉన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

30 December 2024, 9:51 IST

తెలంగాణ News Live: Hyderabad RRR : రీజనల్ రింగ్ రోడ్డుతో ఈ ప్రాంతాల ప్రజల బతుకే మారిపోతుంది.. డబ్బులే డబ్బులు!

  • Hyderabad RRR : తాజాగా నిర్మించ తలపెట్టిన రిజనల్ రింగ్ రోడ్డు.. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌కు మంచి బూస్ట్ ఇవ్వనుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతంలో ఓఆర్ఆర్‌తో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డుతో నగర శివారు ప్రాంతాలే కాకుండా.. జిల్లాల్లోనూ ధరలు పెరగనున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి