
Telangana News Live December 29, 2024: OU JAC On Allu Arjun : బెదిరింపులు ఆగకపోతే, వేలాది మందితో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తాం- ఓయూ జేఏసీ హెచ్చరికలు
29 December 2024, 21:13 IST
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
OU JAC On Allu Arjun : హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఓయూ జేఏసీ నేతలు వాపోతున్నారు. తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని పోలీసులను ఆశ్రయించారు. తన ఫ్యాన్స్ ను అల్లు అర్జున్ అదుపుచేయకపోతే వేలాది మందితో బన్నీ ఇంటిని ముట్టడిస్తామన్నారు.
Bandi Sanjay : సంక్రాంతి లోపు ఫీజు రీయంబర్స్మెంట్ బకాయి రూ.7 వేల కోట్లు చెల్లించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామన్నారు. తెలంగాణ ప్రజలకు కేంద్రం ఇచ్చిన సంక్రాంతి కానుక ఆర్ఆర్ఆర్ టెండర్లు అన్నారు.
- TG Rythu Bharosa : రైతు భరోసా పథకం అమలు విషయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. గతంలో బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన రైతుబంధుపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. అలాంటి విమర్శలు రాకుండా రేవంత్ సర్కారు జాగ్రత్తపడుతోంది. తాజాగా రైతు భరోసా పథకంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది.
- TG Police Suicide : తెలంగాణలో పోలీసులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలు పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారాయి. వీటిపై మాజీమంత్రి హరీష్ రావు స్పందించారు. పోలీసుల మరణ మృదంగం పట్ల ప్రభుత్వానికి పట్టింపు లేదా? అని ప్రశ్నించారు. సూసైడ్ చేసుకోవద్దని పోలీసులకు సూచించారు.
- Adilabad : ఏదో ఒక పూట, రోజుకొక చోట కామాంధుల చేతుల్లో మహిళలు బలైపోతున్నారు. అవసరం కోసం వస్తే.. అవకాశంగా తీసుకొని అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా సాయం కోసం వచ్చిన ఓ వివాహితపై ఆదిలాబాద్‌లో అత్యాచారం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Nizamabad : నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి.. ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడని వ్యాఖ్యానించారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటికి వస్తారని స్పష్టం చేశారు. కవిత చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
- Telangana Police : ఉమ్మడి మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనలు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో జరిగాయి. కామారెడ్డి జిల్లాలో ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ చనిపోయిన ఘటన మరువక ముందే వీరు సూసైడ్ చేసుకున్నారు.
- Hyderabad RRR : హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డులు కీలక పాత్ర పోషించాయి. తాజాగా తెలంగాణ అభివృద్ధికి రిజనల్ రింగ్ రోడ్డుతో బంగారు బాట వేయబోతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. తెలంగాణ రూపురేఖలు మారిపోనున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇది ఒక గేమ్ ఛేంజర్‌గా మారబోతోందనే అంచనాలు ఉన్నాయి.
- Karimnagar : ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వచ్చే పర్యాటకులు పెరిగారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది కోటిన్నరకుపైగా సందర్శకులు వచ్చారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా సందర్శకుల తాకిడితో రెండో స్థానంలో నిలిచింది. జగిత్యాల ఐదో స్థానంలో ఉంది.
ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ అయ్యాయి. జనవరి 7న విచారణకు రావాలని దర్యాప్తు సంస్థ కోరింది. మరోవైపు ఈ కేసులో ఏసీబీ కూడా దూకుడుగా ముందుకెళ్తోంది. ఒకవేళ ఈ కేసులో అరెస్ట్ వంటి పరిణాామాలు చోటు చేసుకుంటే…బీఆర్ఎస్ ను కవిత లీడ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.
- తప్పుడు పత్రాలు సృష్టించి ఎకరం భూమిని కాజేసిన వారిపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 8 మంది పేరిట రిజిస్ట్రేషన్ చేసిన ఘరానా మోసగాడిని అరెస్ట్… చేసి జైలుకు పంపించారు. మరో ముగ్గురి కోసం కొత్తపల్లి పోలీసులు గాలిస్తున్నారు.
- TG Govt Schemes : తెలంగాణలో వరిసాగు ఊహించని స్థాయిలో పెరిగింది. ధాన్యం కొనుగోలు విషయంలో అన్నదాతలు మొదట్లో భయపడినా.. ఇప్పుడు ఆనందంగా ఉన్నారు. అయితే.. ఇప్పుడు రైతుబంధు, వడ్లకు బోనస్‌పై తెలంగాణ రైతుల్లో చర్చ జరుగుతోంది. తమకు ఏది మంచిదో అన్నదాతలు చర్చించుకుంటున్నారు.