Telangana News Live December 10, 2024: Mohan Babu Attacked Media : మీడియాపై మోహన్ బాబు దాడిని ఖండించిన జర్నలిస్టుల సంఘాలు, క్షమాపణ చెప్పాలని డిమాండ్
10 December 2024, 21:57 IST
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mohan Babu Attacked Media : మంచు ఫ్యామిలీ వివాదం మరో టర్న్ తీసుకుంది. జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేశారు. ఈ ఘటనను జర్నలిస్టుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
Manchu Mohan Babu : మంచు ఫ్యామిలీ వివాదం కలకలం రేపుతోంది. జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తన ఇంటి వద్ద జరిగిన ఘర్షణపై మోహన్ బాబు ఆడియో విడుదల చేశారు.
Manchu Family Issue : జల్ పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొది. మంచు కుటుంబ వివాదాన్ని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేశారు. అంతకు ముందు మనోజ్ ను ఇంట్లోకి రానీవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఆయన గేటు తోసుకుని లోపలికి వెళ్లారు. ఆయన పై కూడా దాడి జరిగింది.
- Mulugu Tiger : ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. దాదాపు మూడు నెలల కిందట ఏటూరునాగారం ఫారెస్ట్ ఏరియాలో పెద్దపులి అడుగులు కనిపించగా.. తాజాగా వెంకటాపురం మండలం అలుబాక శివారులో పెద్దపులి సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
TG Mlc Election : ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ ముగిసింది. నేటి నుంచి అభ్యంతరాలపై దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ చేపట్టారు. పట్టభద్ర ఓటర్ల సంఖ్య 3,86,690, ఉపాధ్యాయ ఓటర్ల సంఖ్య 33,048కి పెరిగింది.
Family Suicide Attempt : స్టాక్ మార్కెట్ లో నష్టాలు, అప్పులు తెచ్చిన చోట ఒత్తిళ్లతో మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. బాధితులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
IRCTC Maha Kumbh Mela Package : మహా కుంభ మేళా పుణ్యస్నానంతో పాటు కాశీ, అయోధ్య తీర్థాలను సందర్శించేందుకు ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే భారత్ గౌరవ్ ట్రైన్ 8 రోజుల పాటు పలు పుణ్య క్షేత్రాలను కవర్ చేయనుంది.
- Yadadri Railway Station : అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా.. రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. తాజాగా.. యాదాద్రికి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన చేసింది. యాదాద్రి రైల్వే స్టేషన్ ప్రతిపాదిత డిజైన్‌లను విడుదల చేసింది. ఆలయం రూపంలో ప్రతిపాదిత డిజైన్ ఉంది.
- Manchu Family Issue : మంచు ఫ్యామిలీ వివాదం మరింత ముదిరింది. తాజాగా మంచు మనోజ్, అతని భార్య మౌనికపై పోలీసులు కేసు నమోదు చేశారు. అటు మనోజ్ ఫిర్యాదులో మోహన్‌బాబు అనుచరులపైనా కేసు నమోదైంది. పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో.. మంచు ఫ్యామిలీ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
- Hyderabad skywalk : ప్రభుత్వం హైదరాబాద్ సిటీపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనపై రేవంత్ సర్కారు పట్టుదలగా పనిచేస్తోంది. రోడ్లు, అండర్ పాస్‌లు, స్కైవాక్‌లు నిర్మిస్తున్నారు. తాజాగా నగరంలో మరో 3 స్కైవాక్‌లు నిర్మించాలని అధికారులు ప్లాన్ చేశారు. ఉప్పల్‌లో నిర్మించింది ఉపయోగకరంగా ఉంది.