తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgpsc Dao Results : డీఏవో ఉద్యోగ ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి

TGPSC DAO Results : డీఏవో ఉద్యోగ ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి

29 November 2024, 20:19 IST

google News
    • TGPSC DAO Results 2024: డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏవో) గ్రేడ్‌-2 ఫలితాలు వచ్చేశాయ్. ఈ మేరకు తుది జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. ఎంపికైన వారి జాబితాను వెబ్ సైట్ లో పొందుపర్చింది. 
 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఫలితాలు విడుదల
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఫలితాలు విడుదల

డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఫలితాలు విడుదల

డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏవో) గ్రేడ్‌-2 పోస్టుల రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన వెలువరించింది. ఎంపికైన వారి జాబితాను వెబ్ సైట్ లో పొందుపర్చింది. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి తుది జాబితాను చెక్ చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొంది.

తుది జాబితాను మల్టీ జోన్ల వారీగా ప్రకటించారు. మల్డీజోన్ 1, మల్టీజోన్ - 2గా హాల్ టికెట్లను ప్రకటించారు. డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్‌ అకౌంట్స్‌ విభాగంలో 53 డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (DAO) గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాత పరీక్షలు పూర్తి చేయటంతో… సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేశారు.

ఇలా చెక్ చేసుకోండి

  • డీఏవో అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలోకి వెళ్లి Divisional Accounts Officer Provisional Selection Listపై క్లిక్ చేయాలి.
  • ఎంపికైన వారి హాల్ టికెట్లు జాబితా డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

త్వరలోనే గ్రూప్ 3 ప్రాథమిక 'కీ'లు:

ఇటీవలే టీజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్షలు ముగిశాయి. గ్రూప్-3 పరీక్షల ప్రశ్నాపత్రాలు, ప్రాథమిక 'కీ' లను త్వరలోనే టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో పెట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో నవంబర్‌ 17,18 తేదీల్లో విజయవంతంగా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1,365 గ్రూప్‌-3 సర్వీసుల పోస్టులకు టీజీపీఎస్సీ రాతపరీక్షలు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌-3 పోస్టులకు 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

గ్రూప్-3 పరీక్షలు నేటితో ముగియడంతో... టీజీపీఎస్సీ కమిషన్‌ అధికారికంగా ప్రిలిమినరీ కీ విడుదల చేయనుంది. అనంతరం తుది విడుదల చేసి, ఫలితాలు విడుదల చేయనుంది. అయితే గ్రూప్ 1 ఫలితాల తర్వాతనే గ్రూప్ 3 తుది ఫలితాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

తదుపరి వ్యాసం