తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Tet 2024 Ii Updates : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - ఆన్ లైన్ దరఖాస్తులకు మరికొద్ది గంటలే గడువు..!

TG TET 2024 II Updates : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - ఆన్ లైన్ దరఖాస్తులకు మరికొద్ది గంటలే గడువు..!

20 November 2024, 13:38 IST

google News
    • TG TET 2024 Registration : తెలంగాణ టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది. అర్హులైన అభ్యర్థులు టెట్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తుల చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 1, 2025 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి.
తెలంగాణ టెట్ దరఖాస్తులు - 2024
తెలంగాణ టెట్ దరఖాస్తులు - 2024

తెలంగాణ టెట్ దరఖాస్తులు - 2024

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ 2024 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు ఇవాళ్టి(నవంబర్ 20)తో పూర్తి కానుంది. అర్హులైన వారు https://tgtet2024.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాలి. దరఖాస్తు కంటే ముందు నిర్ణయించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మంగళవారం వరకు టెట్ పరీక్ష కోసం 2,07,765 దరఖాస్తులు అందాయి. ఇవాళ చివరి రోజు కావటంతో ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.

టెట్ కు ఇలా దరఖాస్తు చేసుకోండి..

  1. టెట్ రాసే అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా https://tgtet2024.aptonline.in/tgtet/# వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. ముందుగా ‘Fee Payment’ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.
  3. పేమెంట్ స్టెటస్ అనే కాలమ్ పై నొక్కి దరఖాస్తు రుసుం చెల్లింపు ప్రక్రియ పూర్తి అయిందా..? లేదా అనేది చెక్ చేసుకోవాలి.
  4. ఆ తర్వాత ‘Application Submission’ అనే లింక్ పై క్లిక్ చేయాలి.
  5. మీ వివరాలను నమోదు చేయాలి. ఫొటో, సంతకం తప్పనిసరిగా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  6. అన్ని వివరాలను ఎంట్రీ చేశాక చివర్లో ఉండే సబ్మిట్ బటన్ పై నొక్కితే అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
  7. 'Print Application' అనే ఆప్షన్ పై నొక్కితే మీ దరఖాస్తు కాపీనీ డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు.
  8. రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ నెంబర్ ఉపయోగపడుతుంది.

డిసెంబర్ 26 నుంచి టెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జనవరి 1, 2025వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. జనవరి 20, 2025తో అన్నీ ఎగ్జామ్స్ ముగుస్తాయి. మొదటి సెషన్ ఉదయం 9.00 నుంచి 11.30 వరకు ఉంటుంది. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటుంది.ఫిబ్రవరి 5న టెట్ ఫలితాలు విడుదలవుతాయి.

టెట్‌ పరీక్షల్లో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఓసీ అభ్యర్థులకు-90 మార్కులు, బీసీలకు 75, మిగిలిన వారికి 60 మార్కులు వస్తే టెట్‌ ఉత్తీర్ణులుగా గుర్తిస్తారు. రిజర్వేషన్ల ఆధారంగా నిర్దేశిత మార్కులు సాధించిన వారికి మాత్రమే డీఎస్సీ రాసేందుకు అవకాశం లభిస్తుంది. టెట్‌ పరీక్షల్లో వచ్చిన మార్కులకు డిఎస్సీ నియామకాల్లో 20 శాతం వెయిటేజ్ ఉంటుంది. డీఎస్సీ నియాకంలో టెట్ స్కోర్ అత్యంక కీలకం.

తదుపరి వ్యాసం