TG DOST 2024 Updates : డిగ్రీ విద్యార్థులకు అలర్ట్... 'దోస్త్' రిపోర్టింగ్ గడువు పొడిగింపు
10 August 2024, 6:45 IST
- TG DOST 2024 Updates : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ‘దోస్త్’ ప్రత్యేక విడతలో సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టింగ్ చేసే గడువును పెంచారు. ఆయా విద్యార్థులు ఆగస్టు 13వ తేదీలోపు రిపోర్ట్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
దోస్త్ ప్రవేశాలు 2024
TS DOST 2024 Special Phase Updates: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రత్యేక విడత ప్రవేశాల సీట్ల కేటాయింపు కూడా పూర్తి అయింది. అయితే ఈ ఫేజ్ లో సీట్లు పొందిన విద్యార్థులకు ఉన్నత విద్యామండలి కీలక అప్డేట్ ఇచ్చింది. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగుతోపాటు ఆయా కళాశాలల్లో రిపోర్ట్ చేసేందుకు గడువును ఆగస్టు 13వ తేదీ వరకు పొడిగించింది.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… రిపోర్టింగ్ గడువు ఆగస్టు 09వ తేదీతో పూర్తి అయింది. విద్యార్థుల నుంచి వచ్చిన పలు విజ్ఞప్తుల మేరకు… ఈ తేదీని ఆగస్టు 13వ తేదీ వరకు పొడిగించారు. https://dost.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫైనల్ ఫేజ్ అలాట్ మెంట్ వివరాలను చెక్ చేసుకోవచ్చు.
ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మొత్తం 3 విడతల్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసింది తెలంగాణ ఉన్నత విద్యా మండలి. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులు రూ.200 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… మూడు విడతలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించారు. వీరికి కూడా సీట్లను కేటాయించింది.
స్పెషల్ ఫేజ్ రిపోర్టింగ్ గడువు ముగిసిన తర్వాత… రాష్ట్రంలో మిగిలిన డిగ్రీ సీట్లు ఎన్ని అనే విషయంపై క్లారిటీ రానుంది. అయితే స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి ఏమైనా మార్గదర్శకాలు ఉంటాయా..? లేదా…? అనే దానిపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంటుంది.
సీపీగెట్ ఫలితాలు విడుదల….
పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సీపీగెట్(కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్) - 2024 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి.ఈ రిజల్ట్స్ ను https://cpget.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- Step 1: పరీక్ష రాసిన అభ్యర్థులు https://cpget.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- Step 2: సీపీగెట్ - 2024 ఫలితాల లింక్ పై క్లిక్ చేయాలి.
- Step 3: ఓపెన్ అయ్యే విండోలో హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ తో పాటు పుట్టిన తేదీని ఎంట్రీ చేయాలి.
- Step 4: మీ ర్యాంక్ కార్డ్ డిస్ ప్లే అవుతుంది.
- Step 5: ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్‌టీయూహెచ్ పరిధిలో ఉన్న 297 పీజీ కాలేజీల్లో( ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంపీఈడీ కోర్సు) 51 కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్ నిర్వహిస్తున్నారు.సీపీగెట్ పరీక్షలను జూలై 6వ తేదీ నుంచి కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించారు.జులై 17వ తేదీతో అన్ని పరీక్షలు పూర్తి అయ్యాయి. జులై 6 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో జరిగిన ఈ పరీక్షలకు 73,342 మంది దరఖాస్తు చేసుకోగా.. 64,765 మంది హాజరయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా 44,604 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీపీగెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీలో ఏ సబ్జెక్టు చేసినా, పీజీలో ఇష్టమొచ్చిన సామాజిక కోర్సుల్లో చేరేందుకు వీలు కల్పిస్తున్నారు. ఎంబీబీఎస్, బీటెక్ విద్యార్థులు కూడా ఎంఏ, ఎంకామ్ వంటి కోర్సుల్లో చేరే వీలుంది. మొత్తం 100 మార్కులకు సీపీగెట్ పరీక్ష నిర్వహించారు.ఈ ఏడాది కూడా ఉస్మానియా వర్శిటే ఈ పరీక్ష నిర్వహించింది.