National Merit Scholarship : ఇంటర్ మెరిట్ విద్యార్థులకు నేషనల్ స్కాలర్ షిప్ - అప్లికేషన్ లింక్, ముఖ్య తేదీలివే
11 July 2024, 14:17 IST
- National Merit Scholarship Updates : ఈ ఏడాది ఇంటర్ పాసైన విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ అప్లై చేసుకునేందుకు డిసెంబర్ 31 వరకు గడువు ఉందని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు.
ఇంటర్ మెరిట్ విద్యార్థులకు స్కాలర్ షిప్
National Merit Scholarship : ఈ ఏడాది ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు మెరిట్ స్కాలర్ షిప్ పొందే సదవకాశం వచ్చింది. ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థులు 'నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్'కు దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్‌బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా ఓ ప్రకటనలో తెలిపారు.
మెరిట్ స్కాలర్ షిప్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబరు 31వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. కొత్తవారితో పాటు రెన్యూవల్ చేసుకునే విద్యార్థులు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చని తెలిపారు.
ఇంటర్ మార్కుల్లో టాప్-20 పర్సంటైల్‌లో నిలిచిన విద్యార్థుల జాబితా tgbie.cgg.gov.in వెబ్ సైట్ లో పొందుపర్చినట్లు పేర్కొన్నారు.మొత్తం 59355 మంది విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వెల్లడించారు. https://scholarships.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు.
ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు….
ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ ఇంటర్ బోర్డు. జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశ గడువును పొడిగించింది. జులై 31వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.
ఇంటర్ బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీల్లో మాత్రమే చేరాలని స్పష్టం చేసింది. గుర్తింపు పొందిన కాలేజీల వివరాలను ఇంటర్ బోర్డు సైట్ లో ఉంచినట్లు తెలిపింది. వాటిని చెక్ చూసుకున్న తర్వాతే… అడ్మిషన్లు తీసుకోవాలని సూచించింది.
ఇంటర్ ఫస్టియర్ తరగతులు జూన్ 01 నుంచే ప్రారంభమయ్యాయి. పాఠశాల అధికారులు జారీ చేసిన పాస్ సర్టిఫికేట్, ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, తాత్కాలిక టెన్త్ మార్కుల మెమో ఆధారంగా ప్రిన్సిపాల్స్ ఇంటర్ ప్రవేశాలు కల్పిస్తారు. ఒరిజినల్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత అడ్మిషన్లు నిర్థారిస్తారని ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్థారించిన రిజర్వేషన్ల ప్రకారం విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించాలని ఇంటర్ బోర్డు కాలేజీ ప్రిన్సిపాల్స్ ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎస్సీలకు - 15 శాతం, ఎస్టీ- 10 శాతం, బీసీలకు-29 శాతం, పీహెచ్ -5 శాతం, ఎన్సీసీ, స్పోర్ట్ కోటా - 5 శాతం, ఎక్స్-సర్వీస్ మెన్ - 3 శాతం, ఈడబ్ల్యూఎస్- 10 శాతం సీట్లు కేటాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే 33.3 శాతం అంటే 1/3 వంతు సీట్లు బాలికలకు కేటాయించాలని తెలిపింది.
ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నవంబర్ 18 నుంచి 23 వరకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు నిర్వహించనున్నారు. సంక్రాంతి సెలవులను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 16 వరకు ప్రకటించారు. సంక్రాంతి(Sankranti 2025) అనంతరం జనవరి 17, 2025న ఇంటర్ కాలేజీలు రీఓపెన్ చేస్తారు. 2025 జనవరి 20 నుంచి 25 వరకు ఇంటర్ ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
- ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు - ఫిబ్రవరి మెదటి వారం, 2025
- ఇంటర్ వార్షిక పరీక్షలు - మార్చి మొదటి వారం, 2025
- 2024-25 అకాడమిక్ క్యాలెండర్ చివరి పనిదినం- మార్చి 29, 2025
- వేసవి సెలవులు- మార్చి 30, 2025 నుంచి జూన్ 1, 2025 వరకు
- అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు - మే చివరి వారం, 2025
- 2025-26 విద్యాసంవత్సంలో ఇంటర్ కాలేజీల రీఓపెన్ -జూన్ 2, 2025