తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  August 21 Telugu News Updates : తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది- అమిత్​ షా
మునుగోడులో అమిత్ షా సభ
మునుగోడులో అమిత్ షా సభ (twitter)

August 21 Telugu News Updates : తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది- అమిత్​ షా

21 August 2022, 19:02 IST

  •  Amit Shah Munugode visit : ఇవాళ మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభను తలపెట్టింది. ఇందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమిత్​ షా తెలంగాణ పర్యటన లైవ్​ అప్డేట్స్​ కోసం ఇక్కడ చూడండి.

21 August 2022, 19:02 IST

'తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది'

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని కేంద్ర మంత్రి అమిత్​షా జోస్యం చెప్పారు. కేసీఆర్​ పాలనలో ప్రజలు మోసపోయారని మండిపడ్డారు.

21 August 2022, 18:57 IST

'రాజగోపాల్​ రెడ్డిని గెలిపించండి'

మునుగోడులో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రసంగించారు కేంద్ర మంత్రి అమిత్​ షా. బీజేపీ తీర్థం పుచ్చుకున్న రాజగోపాల్​ రెడ్డిని.. ప్రజలు గెలిపించాలని పిలుపునిచ్చారు. రాజగోపాల్​ రెడ్డిని గెలిపిస్తే.. కేసీఆర్​ ప్రభత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించినట్టు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

21 August 2022, 18:11 IST

బీజేపీలోకి రాజగోపాల్​ రెడ్డి

కాంగ్రెస్​ మాజీ నేత రాజగోపాల్​ రెడ్డి.. బీజేపీలోకి చేరారు. కేంద్రమంత్రి అమిత్​ షా సమక్షంలో మునుగోడు బహిరంగ సభలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

21 August 2022, 17:57 IST

మునుగోడుకు అమిత్​ షా

మునుగోడు బహిరంగ సభకు చేరుకున్నారు కేంద్ర మంత్రి అమిత్​ షా. మరికొద్ది సేపట్లో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. కేసీఆర్, టీఆర్​ఎస్​పై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఆసక్తిగా మారింది.
 

ఇప్పటికే బహిరంగ సభకు వేలాది మంది ప్రజలు తరలివెళ్లారు. జనసందోహంతో ఆ ప్రాంతం కిటకిటలాడిపోతోంది.

21 August 2022, 16:45 IST

మునుగోడుకు అమిత్​ షా

కేంద్ర మంత్రి అమిత్​ షా.. మరికొద్ది సేపట్లో మునుగోడుకు చేరుకోనున్నారు. అక్కడ జరిగే బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో జన సందోహం నెలకొంది.

21 August 2022, 16:29 IST

ఉజ్జయిని ఆలయంలో అమిత్​ షా.. 

ఉజ్జెయిని ఆలయంలో అమిత్​ షా ఫొటోలు..

21 August 2022, 16:05 IST

బీజేపీ కార్యకర్త ఇంటికి..

ఉజ్జయిన ఆలయం నుంచి బీజేపీ కార్యకర్త సత్యనారాయణ నివాసానికి వెళ్లారు అమిత్​ షా. సత్యనారాయణ కుటుంబసభ్యులతో ముచ్చటించారు.  అక్కడే దాదాపు 30 నిమిషాల పాటు గడిపారు కేంద్రమంత్రి.

21 August 2022, 16:04 IST

ఉజ్జయిని ఆలయంలో ప్రత్యేక పూజలు

అమిత్​ షా.. బేగంపేట్​ నుంచి తొలుత సికింద్రాబాద్​ ఉజ్జయిని ఆలయానికి వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

కేంద్రమంత్రి పర్యటన వేళ.. ఆలయం చుట్టూ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. 

21 August 2022, 15:56 IST

తెలంగాణకు అమిత్​ షా

తెలంగాణలో అమిత్​ షా పర్యటన ప్రారంభమైంది.  ఢిల్లీ నుంచి విమానంలో బేగంపేట్​ విమానాశ్రయానికి చేరుకున్నారు అమిత్​ షా. ఆయనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​తో పాటు ఇతరులు ఘనస్వాగతం పలికారు.

21 August 2022, 13:36 IST

యాదాద్రిలో భక్తుల రద్దీ

యాదాద్రి భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. ఇవాళ సెలవు దినం కావడంతో యాదాద్రికి భక్తజనం పోటెత్తారు. ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది.

21 August 2022, 11:23 IST

కొత్తగా 11,539 కేసులు

దేశంలో కొత్తగా 11,539 మందికి కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 43 మంది కొవిడ్​కు బలయ్యారు.

21 August 2022, 8:54 IST

రాజకీయాల్లో సినీ నటి త్రిష…?

సినీ నటి త్రిష రాజకీయ పార్టీలోకి వస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్, బీజేపీ వారి పార్టీలో చేర్చుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

21 August 2022, 8:53 IST

తగ్గిన వరద ఉద్ధృతి

శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. దీంతో జలాశయం 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 2,18,386 క్యూసెక్కులుండగా.. ఔట్‌ఫ్లో 1,94,854 క్యూసెక్కులుగా ఉంది.

21 August 2022, 8:52 IST

యువకుడు దారుణ హత్య…

చాంద్రాయణగుట్టలో దారుణం జరిగింది. ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా హత్యచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

21 August 2022, 8:13 IST

మునుగోడులో బీజేపీ సభ….

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీలో చేరిక సందర్భంగా నేడు ‘మునుగోడు సమరభేరి’ పేరుతో బీజేపీ సభను తలపెట్టింది. దీనికి ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మరోవైపు సభకు భారీ ఎత్తున జనాలను తరలించేందుకు పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది.

21 August 2022, 8:13 IST

నేటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ…..

TS EAMCET Counseling తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది మూడు విడతల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్ రుసుము చెల్లించి ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్‌ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 

    ఆర్టికల్ షేర్ చేయండి