తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bhadrachalam Nursing Student: భద్రాచలంలో నర్సింగ్ విద్యార్ధిని అనుమానాస్పద మృతి, కాలేజీ ఛైర్మన్‌పై విద్యార్ధుల దాడి

Bhadrachalam Nursing Student: భద్రాచలంలో నర్సింగ్ విద్యార్ధిని అనుమానాస్పద మృతి, కాలేజీ ఛైర్మన్‌పై విద్యార్ధుల దాడి

Sarath chandra.B HT Telugu

24 May 2024, 12:55 IST

google News
    • Bhadrachalam Nursing Student: భద్రాచలంలో నర్సింగ్ విద్యార్ధిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఉద్రిక్తతకు దారి తీసింది. మారుతీ  పారా మెడికల్ కాలేజీలో నర్సింగ్ చదువుతున్న విద్యార్ధిని భవనం పైనుంచి పడి చనిపోయింది. 
భద్రాచలంలో నర్సింగ్ కాలేజీ విద్యార్ధిని అనుమానాస్పద మృతి
భద్రాచలంలో నర్సింగ్ కాలేజీ విద్యార్ధిని అనుమానాస్పద మృతి

భద్రాచలంలో నర్సింగ్ కాలేజీ విద్యార్ధిని అనుమానాస్పద మృతి

Bhadrachalam Nursing Student: భద్రాచలంలో నర్సింగ్ విద్యార్దిని అనుమానాస్పద స్థితిలో భవనం పై నుంచి పడి గాయలతో ఆస్పత్రిలో మరణించడం ఉద్రిక్తతకు దారి తీసింది. భద్రాచలంలోని మారుతీ పారామెడికల్ కాలేజీలో నర్సింగ్ చదువుతోన్న కారుణ్య అనే విద్యార్ధిని గురువారం రాత్రి రెండో అంతస్తు నుంచి కిందపడి తీవ్రంగా గాయపడింది.

అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్ధిని చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందింది. నర్సింగ్ విద్యార్ధిని భవనం పైకి వెళుతున్న దృశ్యాలు మాత్రమే కెమెరాలో రికార్డ్ అయ్యాయి. రాత్రిపూట భవనం పైకి ఎందుకు వెళ్లిందనేది మిస్టరీగా మారింది. విద్యార్ధిని కింద పడిన ప్రాంతంలో రక్తపు మరకల్ని శుభ్రం చేయడం అనుమానాలకు తావిచ్చింది.

మారుతి పారా మెడికల్ కాలేజీ యజమాని పొంతన లేని సమాధానాలు చెప్పడం కూడా సందేహాలకు తావిచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధిని కన్నుమూయడంతో విద్యార్ధి సంఘాలు కాలేజీ వద్ద ఆందోళనకు దిగాయి.

నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతికి నిగ్గు తేల్చాలంటూ విద్యార్ధిని బంధువులు, విద్యార్ధులు ఆందోళనకు దిగారు. కాలేజీ యాజమాన్యం పొంతనం లేని సమాధానాలు చెప్పడంతో విద్యార్థులు, బంధువులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.

దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నర్సింగ్‌ విద్యార్థిని కారుణ్య గురువారం రాత్రి అపస్మారక స్థితిలోకి ఉండగా యాజమాన్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందింది. పారా మెడికల్‌ కళాశాల వద్ద శుక్రవారం ఉదయం బంధువులు ఆందోళన చేపట్టారు.

ప్రభుత్వాసుపత్రి నుంచి ర్యాలీగా కళాశాలకు వచ్చారు. కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన నేపథ్యంలో కళాశాలకు వచ్చిన ఛైర్మన్‌పై దాడికి ప్రయత్నించారు. విద్యార్ధుల నుంచి కాలేజీ ఛైర్మన్‌ను పోలీసులు కాపాడారు.

తదుపరి వ్యాసం