Allu Arjun Arrest : జైలులోనే అల్లు అర్జున్ - ఉదయం విడుదల కానున్న బన్నీ
13 December 2024, 23:05 IST
- Hero Allu Arjun Arrest Updates : చంచల్ గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ… జైలు నుంచి విడుదల కాలేదు. బెయిల్ పత్రాలు అందే విషయంలో ఆలస్యం కావటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. రాత్రి తర్వాత ఆన్ లైన్ లో అర్డర్ కాపీ అప్ లోడ్ అయింది.
అల్లు అర్జున్
అల్లు అర్జున్ రిలీజ్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇవాళ విడుదల ఉండకపోవచ్చని వార్తలు వచ్చినప్పటికీ… ఎట్టకేలకు అర్డర్ కాపీ ఆన్ లైన్ లో అప్ లోడ్ అయింది. హైకోర్టు ఉత్తర్వులను జైలు అధికారులు పరిశీలించారు.అయితే ఇవాళ విడుదలయ్యే లేదని తెలుస్తోంది. శనివారం ఉదయం 7 గంటల సమయంలో విడుదల చేస్తారని సమాచారం.
అల్లు అర్జున్ కేసులో నాంపల్లి కోర్టు రిమాండ్ విధించగా… హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆలస్యంగా తీర్పు రావటంతో… అప్పటికే అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. బెయిల్ మంజూరు పత్రాలు అందే విషయంలో ఆలస్యమైంది. లాయర్లు తెచ్చిన బెయిల్ కాపీ సరిగా లేకపోవటం కూడా విడుదలకు ఆలస్యమైంది.
ఏం జరిగిందంటే..?
సంథ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ పై బీఎన్ఎస్ 105, 118(1) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శుక్రవారం అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేయించి.. ఆ తర్వాత నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. యంత్రం 5 గంటల సమయంలో కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు హైకోర్టులో అల్లు అర్జున్ కు ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. 8.సొంత పూచీకత్తు సమర్పించాలని అల్లు అర్జున్‌ను హైకోర్టు ఆదేశించింది. అర్ణబ్ గోస్వామి కేసులో బాంబే కోర్టు తీర్పు ఆధారంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలని సూచించింది. అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై పీపీ అభ్యంతరం చెప్పారు. క్వాష్ పిటిషన్‌లో మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో.. అల్లు అర్జున్ అడ్వకేట్లు చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తును అల్లు అర్జున్ సమర్పించారు. కానీ.. బెయిల్ ప్రాసెస్ పూర్తి కావడానికి సమయం పట్టింది. దీంతో బన్నీ విడుదల ఆలస్యం అయ్యింది. శనివారం జైలు నుంచి విడుదల కానున్నారు.