HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay : బీఆర్ఎస్ అవుట్ డేటెట్ పార్టీ, పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదు- బండి సంజయ్

Bandi Sanjay : బీఆర్ఎస్ అవుట్ డేటెట్ పార్టీ, పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదు- బండి సంజయ్

HT Telugu Desk HT Telugu

18 August 2024, 19:36 IST

    • Bandi Sanjay : బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రుణమాఫీ సహా 6 గ్యారంటీలపై చర్చను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ విలీన డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. 
బీఆర్ఎస్ అవుట్ డేటెట్ పార్టీ, పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదు- బండి సంజయ్
బీఆర్ఎస్ అవుట్ డేటెట్ పార్టీ, పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదు- బండి సంజయ్

బీఆర్ఎస్ అవుట్ డేటెట్ పార్టీ, పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదు- బండి సంజయ్

Bandi Sanjay : మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ పేరెత్తితేనే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అని విమర్శించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్ కే ఉందన్నారు. అవినీతి పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదని స్పష్టం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్లలో మార్కండేయ టెంపుల్ లో నిర్వహించిన మహా చండియాగంలో పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, బీఆర్ఎస్ వైఖరిపై ఫైర్ అయ్యారు.

ప్రజల దృష్టిని మళ్లించేందుకే విలీన డ్రామాలు

రుణమాఫీ సహా 6 గ్యారంటీలపై చర్చను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ విలీన డ్రామాలు ఆడుతున్నాయని బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రుణమాఫీపై కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. విలీనం, పొత్తులు గంగలో కలవనీయండి...వాటితో ప్రజలకేం సంబంధం అన్నారు. రుణమాఫీ కాక రైతులు కాంగ్రెస్ దిష్టిబొమ్మలు కాల్చేస్తున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు. 64 లక్షల మంది రుణాలు తీసుకుంటే 22 లక్షల మందికే మాఫీ చేశారని తెలిపారు. రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి......ఎన్నికల్లో రూ.40 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించి...బడ్జెట్లో రూ.26 వేలు కేటాయించి...చివరకు రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని తెలిపారు.‌ కాంగ్రెస్ మోసాలు ప్రజలకు అర్థమయ్యాయని తెలిసే విలీన డ్రామాలాడుతూ చర్చను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు.‌

గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని రైతులని మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ చేసినట్లు చెబుతూ మోసం చేస్తోందని విమర్శించారు. రైతులకు వెంటనే బ్యాంక్ ల నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. లోన్ తీసుకున్న రైతులకు క్లియరెన్స్ సర్టిఫికెట్ రాకుంటే భవిష్యత్ లో ఎలాంటి రుణం పొందలేరనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు, తులం బంగారం సహా 6 గ్యారంటీలు ఇప్పటికీ అమలు చేయలేదని తెలిపారు. 30 వేల ఉద్యోగాలని 12 వేల ఉద్యోగులు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అద్దాల మేడలో కూర్చొని ప్రజలకు అన్ని చేశాం అని అనుకుంటుందని తెలిపారు. రైతు భరోసా, బోనస్, రుణమాఫీ చేస్తామని చేయలేదు.. ప్రజలకు అన్ని విషయాలు తెలుసన్నారు.

హామీలన్నీ నెరవేర్చాలి

రైతులు అమాయకులు కాదు... వారు దుఃఖంలో ఉన్నారు... వారికి భరోసా కల్పించడంతో పాటు వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రెండు పార్టీల మోసపూరిత వాగ్దానాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఒక ఎకరానికి రూ.20 వేలు సహకారం చేస్తుందని తెలిపారు. ఎంత మందికి రైతుల రుణమాఫీ చేశారో.. ఇంకెంత మందికి రుణమాఫీ అందలేదనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్