HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Adilbad Teacher Murder Case : ప్రభుత్వ టీచర్ దారుణ హత్య - భార్యే సూత్రధారి! వివాహేతర సంబంధమే అసలు కారణం..

Adilbad Teacher Murder Case : ప్రభుత్వ టీచర్ దారుణ హత్య - భార్యే సూత్రధారి! వివాహేతర సంబంధమే అసలు కారణం..

16 June 2024, 6:01 IST

    • Teacher Murder in Adilbad : ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ టీచర్ హత్య సంచలనంగా మారింది. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయపడ్డాయి. కట్టుకున్న భార్యే... ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించినట్లు తేలింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ టీచర్ హత్య
ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ టీచర్ హత్య

ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ టీచర్ హత్య

Adilbad Teacher Murder Case Updates : భర్త ప్రభుత్వ టీచర్, ఓ కుమారుడు కూడా ఉన్నాడు..! సాఫీగా సాగిపోతున్న సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. ఏకంగా కట్టుకున్న భర్తనే లేకుండా చేయాలన్న ఆలోచన భార్యకు తట్టింది. అంతే... ప్రియుడితో కలిసి సుఫారీ గ్యాంగ్ ను రంగంలోకి దింపి హత్య చేయించింది.

ట్రెండింగ్ వార్తలు

IRCTC Shirdi Tour : ఈ నెలలో 'షిర్డీ' ట్రిప్ ప్లాన్ ఉందా...? బడ్జెట్ ధరలో 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇదే...!

CM Revanth Reddy : మూడు విడతల్లో రైతు రుణమాఫీ పూర్తి, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

TG DOST 2024 Updates : డిగ్రీ విద్యార్థులకు అలర్ట్ - రేపటితో ముగియనున్న'దోస్త్‌' రిపోర్టింగ్ గడువు..!

BRS Harish Rao : కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, సిద్ధంగా ఉండండి - హరీశ్ రావు కామెంట్స్

ఈ దారుణ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో సంచలన సృష్టించింది. ఈ కేసును సవాల్ గా తీసుకున్న ఉట్నూరు పోలీసులు... తమదైన శైలిలో విచారణ జరిపారు. నిందితుల గుట్టును మొత్తం బయటపెట్టారు. అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. భార్య, ప్రియుడి కలిసే ఈ మర్డర్ చేయించారని తేల్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు శనివారం మీడియాకు వెల్లడించారు.

వివాహేతసంబంధమే అసలు కారణం…!

పోలీసుల వివరాల ప్రకారం.... గజేందర్ ప్రభుత్వ టీచర్. ఆదిలాబాద్ జిల్లాలోని నాగర్‌కర్నూల్‌ మండలంలోని నాగలకొండ అతడి స్వగ్రామం. జైనథ్‌ మండల పరిధిలో టీచర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదిలాబాద్ పట్టణంలోని ప్రస్తుతం నివాసం ఉంటున్నాడు. ఇయనకు భార్య విజయలక్ష్మితోపాటు ఒక కొడుకు ఉన్నాడు.

ఇటీవలే ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులు రావటంతో కుటుంబంతో కలిసి ఆయన స్వగ్రామానికి వెళ్లాడు. సెలవులు పూర్తి కాగా పునఃప్రారంభం(జూన్ 12) రోజు స్వగ్రామం నుంచే అతను విధులు నిర్వరిస్తున్న స్కూల్ కు బైక్ పై బయల్దేరాడు. ఇదే సమయంలో మార్గమధ్యంలో గజేందర్ దారుణ హత్యకు గురయ్యాడు.

ప్రభుత్వ టీచర్ హత్యపై కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. ఇందులో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. కట్టుకున్న భార్యే.. ఈ మర్డర్ చేయించినట్లు నిర్థారించారు. ప్రియుడితో భార్య ఉన్న కొన్ని ఫొటోలు కూడా పోలీసులు తమ విచారణలో గుర్తించారు.

గజేందర్ భార్య విజయలక్ష్మి నిజామాబాద్‌లో డిగ్రీ చదివింది. ఈ సమయంలోనే తన క్లాస్ మేట్ మహేశ్ తో ప్రేమలో పడింది. ఇదిలా ఉండగానే.... 2017లో గజేంద్రతో విజయలక్ష్మి వివాహన్ని జరిపించారు తల్లిదండ్రులు. అయితే మహేశ్ తో మాత్రం విజయలక్ష్మి తన సంబంధాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది. 

ఈ విషయం గజేందర్ వరకు కూడా చేరటంతో పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగినట్లు తెలిసింది. ఆ తర్వాత కొంతకాలం కాపురం సవ్యంగా సాగినప్పటికీ...తన వివాహేతర బంధానికి భర్త అడ్డు వస్తున్నాడని కారణంతో భార్య విజయలక్ష్మి మర్డర్ ప్లాన్ చేసింది.

భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి ప్లాన్ రచించింది. హత్య చేయించేందుకు సుఫారీ గ్యాంగ్ ను రంగంలోకి దించారు. సుశీల్, కృష్ణ అనే ఇద్దరు రౌడీలను సంప్రదించారు. గజేందర్‌ను హత్య చేయాలని చెప్పారు. ఇందుకు మూడు లక్షల చొప్పున సుపారి ఇచ్చేలా మాట్లాడుకున్నారు.

ముందస్తు ప్లాన్ ప్రకారం... భర్త గజేందర్ జూన్ 12వ తేదీన బైక్ పై స్కూల్ కు వెళ్లే విషయాన్ని సుఫారీ గ్యాంగ్ కు భార్య తెలిపింది. రంగంలోకి దిగిన ఇద్దరు గజేందర్ ను ఫాలో అయ్యారు. అర్జుని గ్రామం పరిసర ప్రాంతాల్లో గజేందర్ బైక్ ను వెనక నుంచి ఢీకొట్టారు. కింద పడిపోయిన గజేందర్‌ను రోడ్డు పక్కనకు ఈడ్చెకెళ్లి బండరాళ్లతో తలపై కొట్టి దారుణంగా హత్య చేశారు.

నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. అతి తక్కువ సమయంలోనే కేసును చేధించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.

తదుపరి వ్యాసం