Sabarimala Yatra IRCTC Package : తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల యాత్ర, ఐఆర్సీటీసీ 5 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే
22 October 2024, 13:34 IST
Sabarimala Yatra IRCTC Package : ఐఆర్సీటీసీ 5 రోజుల 'శబరిమల యాత్ర' టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ రైలులో శబరిమల, చోటా నిక్కర్ ఆలయాలను దర్శించుకోవచ్చు. శబరిమల దర్శనానికి వెళ్లే యాత్రికులు ముందుగా www.sabarimalaonline.org టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల యాత్ర, ఐఆర్సీటీసీ 5 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే
శబరిమల ఆలయం తెరుచుకుంది. అయ్యప్పను దర్శించుకునేందుకు స్వాములు కొండకు వెళ్తున్నారు. శబరిమల యాత్రికుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీ అందిస్తోంది. సికింద్రాబాద్ నుంచి శబరిమలకు 5 రోజుల టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. ఈ పర్యటనలో శబరిమల, చోటా నిక్కర్ దేవాలయాలను దర్శించుకోవచ్చు.
సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ రైలు ద్వారా శబరిమల యాత్ర ప్యాకేజీ అందిస్తున్నారు. 2AC, 3AC, SL తరగతులలో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు శబరిమల తదుపరి పర్యటన నవంబర్ 16న అందుబాటులో ఉంది.
శబరిమల యాత్ర ముఖ్యాంశాలు:
- టూర్ కోడ్: శబరిమల యాత్ర (SCZBG32)
- వ్యవధి : 4 రాత్రులు/ 5 రోజులు
- పర్యటన తేదీ : 16.11.2024
- ప్రయాణం : శబరిమల (సన్నిధానం), చోటా నిక్కర్ ఆలయం
- సీట్ల సంఖ్య : 716 (SL: 460, 3AC: 206, 2AC: 50)
- బోర్డింగ్ / డి-బోర్డింగ్ స్టేషన్లు: సికింద్రాబాద్, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు రైల్వే స్టేషన్లు
టూర్ ప్యాకేజీ ధర
- ఈ టూర్ లో కవర్ చేసి ఆలయాలు : శబరిమల అయ్యప్ప సన్నిధానం, చొట్టనిక్కర దేవీ ఆలయం
ప్రయాణం ఇలా
DAY- 01 : ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ లో భారత్ గౌరవ్ ట్రైన్ శబరిమల యాత్రకు బయలుదేరుతుంది. నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్లలో ప్రయాణికుల బోర్డింగ్ ఉంటుంది.
DAY-02 : చెంగనూర్ - స్టేషన్ నుంచి యాత్రికులను పికప్ చేసి నీలక్కల్‌కు రోడ్డు మార్గంలో తీసుకెళ్తారు. నీలక్కల్ నుంచి పంబా వరకు ఆర్టీసీ బస్సులు ఉంటాయి. మీరు సొంతంగా శబరిమల (సన్నిదానం) దర్శనానికి వెళ్లాలి. అలాగే https://sabarimalaonline.org/ వెబ్‌సైట్ లో వర్చువల్ క్యూ రిజర్వేషన్‌ను ప్రయాణికులు ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి. వర్చువల్ క్యూ రిజిస్ట్రేషన్ కోసం ఫొటో, ఫోటో గుర్తింపు కార్డు సాఫ్ట్ కాపీలు అవసరం.
DAY-03 శబరిమల - చోటా నిక్కర్ - శబరిమల సన్నిదానం దర్శనం, అభిషేకం అనంతరం నీలక్కల్ చేరుకుంటారు. అక్కడి నుంచి చొట్టనిక్కర/ఎర్నాకులం వెళ్లి రాత్రి బస చేస్తారు.
DAY-04 : చోటా నిక్కర్ - ఉదయం 07:00 గంటలు చొట్టానిక్కర ఆలయాన్ని సందర్శిస్తారు. 08:00 గంటలకు ఎర్నాకులం టౌన్ రైల్వే స్టేషన్‌కి రోడ్డు మార్గంలో బయలుదేరతారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎర్నాకులం నుంచి సికింద్రాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు.
DAY-05 : ప్రయాణికుల డీబోర్డింగ్, సికింద్రాబాద్ కు రాత్రి 9.45 గంటలకు రైలు చేరుకుంటుంది. దీంతో పర్యటన ముగుస్తుంది.