తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagityala Crime: ప్రేమ వేధింపులకు మైనర్ బాలిక బలి... ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు... ఒకరి అరెస్ట్.

Jagityala Crime: ప్రేమ వేధింపులకు మైనర్ బాలిక బలి... ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు... ఒకరి అరెస్ట్.

HT Telugu Desk HT Telugu

Published Mar 21, 2025 06:15 AM IST

google News
    • Jagityala Crime: జగిత్యాలలో మైనర్‌ బాలికనుప్రేమ పేరుతో వేధించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ఒక యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
మైనర్‌ బాలికను వేధించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు

మైనర్‌ బాలికను వేధించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు

Jagityala Crime: ప్రేమ పేరుతో వెంటపడ్డారు. ప్రేమించకుంటే పరువు తీస్తామని బెదిరించారు. ఇద్దరు యువకుల వేదింపులు తాళలేక మైనర్ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఇద్దరిలో ఒకరిని అరెస్టు చేశారు. ఈ విషాదకర ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.


జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రాంభద్రునిపల్లిలో ఈ దారుణం జరిగింది. ప్రేమ పేరుతో మైనర్ బాలికను ఆదే గ్రామానికి చెందిన బాస రాము రంగదామునిపల్లెకు చెందిన ప్రణయ్ వెంటపడ్డారు. ప్రేమించకుంటే సోషల్ మీడియాలో పరువు తీస్తామని బెదిరించారు.

వారి వెధింపులు బెదిరింపులపై పేరెంట్స్ చెప్పకుండా భయాందోళనకు గురైన బాలిక ఈనెల 15న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. పేరెంట్స్ వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఏమైందని పేరెంట్స్ ఆరా తీస్తే ఇద్దరు ప్రేమ పేరుతో వేధిస్తూ బెదిరించారని తెలిపింది. చికిత్స పొందుతూ ఐదు రోజులకు ప్రాణాలు కోల్పోయింది.

పేరెంట్స్ పిర్యాదుతో ఇద్దరిపై కేసు..

మైనర్ బాలిక ఆత్మహత్యతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పెగడపల్లి పోలీసులు రాము, ప్రణయ్ పై బిఎన్ఎస్ ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. బాస రాము ను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. ప్రేమ పేరుతో వేధింపులే మైనర్ బాలిక ఆత్మహత్య కారణమని పెగడపల్లి ఎస్ఐ సిహెచ్ రవికిరణ్ తెలిపారు.

వరైనా అమ్మాయిలను వేధించిన బెదిరించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం ఇస్తే వేధించే వారిపై చట్ట కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

(రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)