తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Ag Bsc Self Finance: అగ్రికల్చర్ బిఎస్సీలో సెల్ఫ్ ఫైనాన్స్ కోటా భారీగా పెంపు, అందుబాటులోకి మరో 200సీట్లు

TG AG BSC Self Finance: అగ్రికల్చర్ బిఎస్సీలో సెల్ఫ్ ఫైనాన్స్ కోటా భారీగా పెంపు, అందుబాటులోకి మరో 200సీట్లు

22 October 2024, 9:38 IST

google News
    • TG AG BSC Self Finance: తెలంగాణలో మరో 200 అగ్రికల్చర్ బిఎస్సీ ఆనర్స్‌ సీట్లు విద్యార్థులకు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటాలో అందుబాటులోకి రానున్నాయి. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్ల ఫీజులు కూడా గణనీయంగా తగ్గించినట్టు ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రకటించారు. 
తెలంగాణ ఏజీ బిఎస్సీలో సెల్ఫ్‌ఫైనాన్స్‌లో మరో 200 సీట్లు
తెలంగాణ ఏజీ బిఎస్సీలో సెల్ఫ్‌ఫైనాన్స్‌లో మరో 200 సీట్లు

తెలంగాణ ఏజీ బిఎస్సీలో సెల్ఫ్‌ఫైనాన్స్‌లో మరో 200 సీట్లు

TG AG BSC Self Finance: తెలంగాణలో అగ్రికల్చర్ బిఎస్సీ ఆనర్స్‌ కోర్సులో అదనంగా మరో 200 సెల్ఫ్‌ఫైనాన్స్‌ సీట్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. తాజా నిర్ణయంతో అగ్రికల్చర్ కోర్సులో సెల్ఫ్ ఫైనాన్స్ కోటా సీట్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఈ కోటా కింద 227 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మరో 200 పెంచడంతో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటా సీట్లు 427కు చేరనున్నాయి.

తగ్గిన ఫీజులు…

సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటా సీట్లకు ప్రవేశ రుసుముతో పాటు వార్షిక ఫీజులు కూడా తగ్గించినట్లు అగ్రికల్చర్‌ యూనివర్శిటీ వీసీ జానయ్య పేర్కొన్నారు. ప్రస్తుతం సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటాలో ఏజీ బిఎస్సీ ఆనర్స్‌ ప్రవేశ రుసుము రూ.3 లక్షలు ఉంటే దానిని రూ.65 వేలకు, నాలుగేళ్లకు కలిసి మొత్తం ఫీజును రూ.10 లక్షల నుంచి రూ.5 లక్షలకు తగ్గించినట్లు వీసీ వివరిం చారు.

తెలంగాణలో ఏజీ బిఎస్సీ ఆనర్స్‌ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల భర్తీకి త్వరలోనే ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం తెలం గాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధిలోని ప్రభుత్వ వ్యవసాయ కళాశాలల్లో సీట్లకు డిమాండ్ భారీగా ఉంది. ఈ ఏడాది ఈ సీట్ల కోసం దాదాపు రెండు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.

ప్రస్తుతం కన్వీనర్ కోటాలో 615 సీట్లు ఉన్నాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో 227 సీట్లు ఉన్నాయి. తాజాగా అవి 427కు చేరాయి. మొదటి విడత కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటాలో 98శాతం సీట్లు భర్తీ అయ్యాయి. కోర్సుకు డిమాండ్ ఉండటంతో చాలామంది సెల్ఫ్ ఫైనాన్స్ కోటాకు పోటీ పడుతున్నారు. మరోవైపు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ఫీజులు అధికంగా ఉండటంతో పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులో లేదనే ఫిర్యాదులు, విమర్శలు రావడంతో సమస్యను పరిష్కరించేందుకు మరిన్ని సీట్లను సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటాను రెట్టింపు చేశారు. ప్రస్తుతం ఉన్న 221కి అదనంగా 200 కలిపడంతో సీట్ల సంఖ్య 427 కు చేరింది.

సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటాలో పెరగనున్న సీట్లను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కళాశాలల్లో సర్దుబాటు చేస్తారు. కన్వీనర్ కోటా సీట్ల భర్తీ పూర్తైన తర్వాత ఈ సీట్లను భర్తీ చేస్తారు. తగ్గించిన ఫీజులు ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తాయి. గతంలోనే సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద చేరిన విద్యార్థులు పాత రుసుములనే చెల్లించాల్సి ఉంటుందని వీసీ స్పష్టం చేశారు.

తెలంగాణలో వ్యవసాయ కోర్సులకు ఉన్న డిమాండ్‌ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతితో ని సెల్ఫ్ ఫైనాన్స్ కోటా సీట్లను పెంచారు. అగ్రికల్చర్ కోర్సులను ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్నా, వాటిలో కొన్నింటికి పూర్తిస్థాయి గుర్తింపు లేకపోవడం, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఫీజులు అధికంగా ఉండటం వంటి సమస్యలు ఉన్నాయి.

అగ్రికల్చర బిఎస్సీ డిగ్రీ కోర్సు నిర్వహణకు కావాల్సిన సదుపాయలు, అధ్యాపకులు, వనరులు లేకపోయినా కోర్సులను నిర్వహిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో నాణ్యతను పెంపొందించడంతో పాటు విద్యార్థుల్లో డిమాండ్ నేపథ్యంలో సీట్లను పెంచినట్టు వీసీ వివరించారు. కాలేజీల వారీగా అందుబాటులోకి రానున్న సీట్ల వివరాలను యూనివర్శిటీ వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నారు.

తదుపరి వ్యాసం