తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Male Tv Anchor Kidnap : పెళ్లి కోసం యాంకర్ ను కిడ్నాప్ చేసిన మహిళ..! వెలుగులోకి షాకింగ్ నిజాలు

Male TV Anchor Kidnap : పెళ్లి కోసం యాంకర్ ను కిడ్నాప్ చేసిన మహిళ..! వెలుగులోకి షాకింగ్ నిజాలు

23 February 2024, 20:56 IST

google News
    • Male TV anchor Kidnapped in Hyderabad: ఓ టీవీ ఛానల్ యాంకర్‌ను మహిళ కిడ్నాప్ చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ పోలీసులు… సదరు మహిళను అరెస్టు చేశారు. 
అరెస్ట్ అయిన మహిళ
అరెస్ట్ అయిన మహిళ

అరెస్ట్ అయిన మహిళ

Male TV anchor Kidnapped in Hyderabad : పెళ్లి చేసుకోవాలన్న కోరికతో ఓ టీవీ యాంకర్ ను కిడ్నాప్ చేసింది మహిళ. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. ఇందుకు కారణమైన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఉప్పల్ పోలీసులు వెల్లడించారు.

“ఫిబ్రవరి 11వ తేదీన కిడ్నాప్ కేసుకు సంబంధించి ఫిర్యాదు అందింది. ప్రణవ్ అనే వ్యక్తి సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ జాబ్ తో పాటు యాంకరింగ్ జాబ్ చేస్తున్నాడు. అయితే ఫిబ్రవరి 11వ తేదీ ప్రణవ్‌ ను అర్ధరాత్రి కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. వారి నుంచి తెలివిగా తప్పించుకున్న ప్రణవ్… పోలీసులను ఆశ్రయించాడు. ఏం జరిగిందనే విషయాలను వివరించాడు. ప్రణవ్ చెప్పిన విషయాల ఆధారంగా విచారించి… సూత్రదారి అయిన త్రిష అనే మహిళను అరెస్ట్ చేశాం. మిగతా వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం” అని ఉప్పల్ పోలీసులు తెలిపారు.

ప్రణవ్ ను కిడ్నాప్ చేసి రూమ్ లో బంధించి పెళ్లి చేసుకోవాలని ఆ మహిళ బెదిరింపులకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. సదరు మహిళ డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తుందని వివరించారు. గతంలో ప్రణవ్ పేరుతో కేటుగాళ్లు కొందరు ఫేక్ ఐడీని క్రియేట్ చేశారని… ఈ విషయాన్ని త్రిష… ప్రణవ్ దృష్టికి తీసుకొచ్చిందని వెల్లడించారు. ఆ తర్వాత….. ప్రణవ్ వెంటపడటం మొదలుపెట్టిందని పేర్కొన్నారు. భారత్ మాట్రిమోన్లో ప్రణవ్ ఫోటోలు చూసి త్రిష ఇష్టపడిందని…. ప్రణవ్ పై ఇష్టంతో కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని త్రిష భావించిందని పోలీసులు వివరించారు.

ప్రణవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రిషను అరెస్ట్ చేసినట్లు ఉప్పల్ పోలీసులు తెలిపారు. మ్యాట్రిమొనీ సైట్‌లో ప్రణవ్‌ ఫొటోతో… చైతన్యరెడ్డి అనే యువకుడు త్రిషతో చాటింగ్‌ చేసినట్టు గుర్తించామని వెల్లడించారు. ఈ వ్యవహారంలో ప్రణవ్ తరపున నుంచి ఎలాంటి ప్రమేయం లేదని చెప్పారు.

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం!

హైదరాబాద్ లోని ఉప్పల్(Uppal Murder) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని కొందరు వ్యక్తులు కళ్లలో కారం చల్లి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. సికింద్రాబాద్(Secunderabad) ప్రాంతానికి చెందిన పుస్తకాల సాయికుమార్ (43) వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్ గా గత కొని రోజులుగా పనిచేస్తున్నాడు. గతంలో సాయి కుమార్ ఉప్పల్ ఆదర్శనగర్ లో నివాసం ఉండేవాడు. కాగా గురువారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని ఉప్పల్ జెన్ పాక్ట్ వద్దకు పిలిపించి తొలుత అతని కంట్లో కారం చల్లి కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు.. చికిత్స నిమిత్తం సాయి కుమార్ ను గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయి కుమార్ మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్య చేసిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. అయితే వివాహేతర సంబంధమే సాయి కుమార్ హత్యకు దారి తీసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. గతంలో ఆదర్శ్ నగర్ లో నివాసం ఉన్న ఎలక్ట్రీషియన్ సాయి కుమార్ స్థానికంగా ఒక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. అయితే గత కొంత కాలంగా సదరు మహిళ, సాయి కుమార్ మధ్య గొడవలు జరగడంతో... గత వారం రోజులుగా సాయి కుమార్ ఆ మహిళను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ప్లాన్ ప్రకారం ఆ మహిళ మాట్లాడుదాం అని సాయి కుమార్ ను ఉప్పల్ జెన్ పాక్ట్ వద్దకు పిలిపించి హత్య చేయించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తదుపరి వ్యాసం