KCR To Assembly: ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో తొలిసారి అడుగిడిన కేసీఆర్, స్వాగతం పలికిన అసెంబ్లీ కార్యదర్శి
25 July 2024, 13:17 IST
- KCR To Assembly: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 2023 ఎన్నికల తర్వాత తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. విపక్ష నాయకుడిగా తొలిసారి తెలంగాణలో సభకు హాజరయ్యారు.
ప్రతిపక్ష నాయకుడిగా తొలిసారి తెలంగాణ అసెంబ్లీకి కేసీఆర్
KCR To Assembly: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అసెంబ్లీ కార్యదర్శి కేసీఆర్‌కుపుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. పదేళ్ల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాలేదు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో గురువారం తొలిసారి అసెంబ్లీకి వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉంటూ వచ్చారు. శాసనసభ్యుడిగా ప్రమాణాన్ని కూడా స్పీకర్ సమక్షంలోనే చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన రెండ్రోజులకే ఫాం హౌస్‌లో కేసీఆర్ గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులు విశ్రాంతికి పరిమితం అయ్యారు. గత ఫిబ్రవరిలో జరిగిన ఓటాన్ అకౌంట్ బడెట్ సమావేశాలకూ కూడా కేసీఆర్ హాజరు కాలేదు. శస్త్ర చికిత్స తర్వాత కోలుకున్నా ఎమ్మెల్యేగా ప్రమా ణం చేయడానికి మాత్రమే కేసీఆర్ అసెం బ్లీకి వచ్చారు.
2024-25 వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేసీఆర్ నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీకి బయల్దేరారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందకు తరలి వచ్చారు.
పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేసీఆర్ హాజరుపై కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావడంపై తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.
బుధవారం అసెం బ్లీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు రు మంత్రులు ప్రతిపక్షనేత ఎక్కడ దాక్కున్నారని సభలో ప్రశ్నించారు. అసెంబ్లీకి ఎందుకు రారని బీఆర్ఎస్ సభ్యులను ప్రశ్నిం చారు. దీంతో గురువారం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌కు కేటాయించిన చాంబర్లో ఎలాంటి మార్పులు ఉండవని అసెంబ్లీ వర్గాలు ప్రకటించాయి.
గతంలో బీఆర్‌ఎస్ శాసనసభ పక్ష నాయకుడికి కేటాయించిన చాంబర్‌ను వినియోగించాలని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీ గేట్ నంబర్ 2 నుంచి సభలోకి ప్రవేశించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ 9ఏళ్ల పాటు గేట్ నంబర్ 1 నుంచి మాత్రమే సభలోకి ప్రవేశించేవారు.
మరోవైపు కేసీఆర్‌కు కేటాయించిన ఛాంబర్‌పై బీఆర్‌ఎస్ నేతలు అభ్యంతరం చెబుతున్నారు. కేసీఆర్‌కు కేటాయించిన ఛాంబర్‌పై కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠగా మారింది. కేసీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్ తదితరులు ఉన్నారు.
ప్రాజెక్టుల సందర్శనకు ఎమ్మెల్యేలు…
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రాజెక్టుల సందర్శనకు బయల్దేరనున్నారు. అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల సందర్శనకు బయల్దేరనున్నారు.