తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Shirdi Tour Package : షిర్డీ, నాసిక్ ట్రిప్ - వీకెండ్ లో జర్నీ, హైదరాబాద్ నుంచి తాజా టూర్ ప్యాకేజీ వచ్చేసింది..!

IRCTC Shirdi Tour Package : షిర్డీ, నాసిక్ ట్రిప్ - వీకెండ్ లో జర్నీ, హైదరాబాద్ నుంచి తాజా టూర్ ప్యాకేజీ వచ్చేసింది..!

30 October 2024, 12:53 IST

google News
    • IRCTC Hyderabad Shirdi Tour : హైదరాబాద్ నుంచి షిర్డీకి కొత్త టూర్ ప్యాకేజీ వచ్చేసింది. 4 రోజుల పాటు ట్రిప్ ఉంటుంది. ట్రైన్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు. ఈ ప్యాకేజీ నవంబర్ 8, 2024వ తేదీన అందుబాటులో ఉంది. IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 
షిర్డీ సాయిబాబా
షిర్డీ సాయిబాబా (image source @SSSTShirdi X axxount)

షిర్డీ సాయిబాబా

తక్కువ ధరలోనే ఐఆర్‌సీటీసీ టూరిజం ప్యాకేజీలు అందుబాటులో ఉంటున్నాయి. టూరిస్టులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్యాకేజీలను ఆపరేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే అనేక ప్యాకేజీలు అందుబాటులోకి వచ్చాయి.

తాజాగా షిర్డీకి ‘సాయి శివమ్’ (SAI SHIVAM) పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో భాగంగా… నాసిక్ కూడా చూసి రావొచ్చు. హైదరాబాద్ నుంచి ట్రైన్ లో వెళ్లాల్సి ఉంటుంది. మూడు రాత్రులు, నాలుగు రోజులతో ఈ ప్యాకేజీ ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ నవంబర్ 8, 2024 తేదీన అందుబాటులో ఉంది. ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

హైదరాబాద్ - షిర్డీ టూర్ షెడ్యూల్ :

  • షిర్డీ , నాసిక్ చూసేందుకు IRCTC టూరిజం 'SAI SHIVAM'' పేరుతో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
  • ప్రస్తుతం నవంబర్ 8, 2024న ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో కూడా వెళ్లొచ్చు.
  • Day 01 - హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి 06:40 గంటలకు ట్రైన్(రైలు నెం. 17064 అజంతా ఎక్స్‌ప్రెస్) ఉంటుంది. రాత్రి అంతా ప్రయాణంలో ఉంటారు.
  • Day 02 : రెండో రోజు మార్నింగ్ 7:10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. పికప్ చేసుకుని షిర్డీకి తీసుకెళ్తారు. ఆ తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. అనంతరం షిర్డీ సాయిబాబా దర్శనం ఉంటుంది. సాయంత్రం షిరిడీలోని పలు ప్రాంతాలను చూడొచ్చు. రాత్రికి అక్కడే చేస్తారు.
  • Day 03 : షిర్డీలోని హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. త్రయంబకేశ్వర్, పంచవతి దర్శనం ఉంటుంది. నాగర్‌సోల్ స్టేషన్‌లో రాత్రి 08:30 గంటలకు రైలు ఉంటుంది. 09:20 గంటలకు బయల్దేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
  • Day 04 : ఉదయం 09.45 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

టికెట్ ధరల వివరాలు :

హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే షిర్డీ టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు చూస్తే…. సింగిల్ షేరింగ్ కు రూ. 9,840గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 7970,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 7780గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి.

స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే సింగిల్ షేరింగ్ కు రూ. 8170గా ఉండగా… డబుల్ షేరింగ్ కు రూ. 6290 ధరగా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 6110 ఉంది. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వురు ధరలు అందుబాటులో ఉన్నాయి. ఈ టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి కవర్ అవుతాయి. నిబంధనలు కూడా వర్తిస్తాయి. 9701360701 / 8287932229 / 9281495843 మొబైల్ నెంబర్లను కూడా సంప్రదించవచ్చు. పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

తదుపరి వ్యాసం