IRCTC Shirdi Tour : ఈ నెలలో 'షిర్డీ' ట్రిప్ ప్లాన్ ఉందా...? బడ్జెట్ ధరలో 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇదే...!
17 July 2024, 17:47 IST
- IRCTC Hyderabad Shirdi Tour : షిర్డీకి ఐఆర్‌సీటీసీ టూరిజం ప్యాకేజీ వచ్చేసింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ప్రకటించింది. షెడ్యూల్ తో పాటు ధరల వివరాలను ఇక్కడ చూడండి…..
షిర్డీ టూర్ ప్యాకేజీ (photo source @tstdcofficial twitter)
షిర్డీ టూర్ ప్యాకేజీ
IRCTC Tourism Shirdi Tour Package: ఐఆర్‌సీటీసీ టూరిజం ప్యాకేజీలు అందుబాటు ధరలో ఉంటున్నాయి. పర్యాటక ప్రాంతాలతో పాటు అధ్యాత్మిక ప్రాంతాలను చూడొచ్చు.
తాజాగా హైదరాబాద్ నుంచి షిర్డీకి వెళ్లేందుకు ‘సాయి శివమ్’ పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. నాసిక్, షిర్డీ చూసి రావొచ్చు. హైదరాబాద్ నుంచి ప్రయణం మెుదలవుతుంది. నాలుగు రోజులతో ఈ ప్యాకేజీ ఉంటుంది. ప్రస్తుతం జులై 26వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.
హైదరాబాద్ - షిర్డీ టూర్ - షెడ్యూల్ ఇదే:
- డే 1 : ఈ ప్యాకేజీని బుకింగ్ చేసిన వాళ్లు హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి 06:40 గంటలకు ట్రైన్ స్టార్ట్ అవుతుంది. రైలు నెం. 17064, అజంతా ఎక్స్‌ప్రెస్ లో ఎక్కాలి. రాత్రి అంతా ప్రయాణం ఉంటుంది.
- డే 2 : రెండో రోజు ఉదయం 07:10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. పికప్ చేసుకుని షిర్డీకి తీసుకెళ్తారు. ఆ తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. అనంతరం షిర్డీ ఆలయం సందర్శన ఉంటుంది. రాత్రికి అక్కడే చేస్తారు.
- డే 3 : మూడో రోజు షిర్డీలోని హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. త్రయంబకేశ్వర్, పంచవతి దర్శనం ఉంటుంది. నాగర్‌సోల్ స్టేషన్‌లో రాత్రి 08:30 గంటలకు రైలు ఉంటుంది. 9:20 గంటలకు బయల్దేరుతుంది. రాత్రి అంతా జర్నీ ఉంటుంది.
- Day 4 : ఉదయం 9.45 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
- టికెట్ ధరలు : సింగిల్ షేరింగ్ కు రూ. 9,320గా ఉండగా… డబుల్ షేరింగ్ కు రూ. 7,960ధరగా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 7,940ఉంది. కంఫర్ట్ క్లాస్ లోఈ ధరలు అందుబాటులో ఉన్నాయి.
- స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే సింగిల్ షేరింగ్ కు రూ. 7,635గా ఉండగా… డబుల్ షేరింగ్ కు రూ. 6,270ధరగా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 6,250ఉంది.
- ఈ టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి కవర్ అవుతాయి. నిబంధనలు కూడా వర్తిస్తాయి.
- https://www.irctctourism.com/ క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.
- టూర్ ప్యాకేజీ డైరెక్ట్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR008
- ఈ ప్యాకేజీ విషయంలో సందేహాలు ఉంటే 9701360701 / 8287932229 / 9281495843 ఈ మొబైల్ నెంబర్లను కూడా సంప్రదించవచ్చు.