HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Student Safe : యూఎస్ఏలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థిని కందుల నితీషా సురక్షితం, పోలీసులు ట్వీట్

Hyderabad Student Safe : యూఎస్ఏలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థిని కందుల నితీషా సురక్షితం, పోలీసులు ట్వీట్

05 June 2024, 17:33 IST

    •  Hyderabad Student Safe : గత వారం కాలిఫోర్నియాలో అదృశ్యమైన కందుల నితీషా సురక్షితంగా ఉన్నట్లు స్థానిక పోలీసులు ట్వీట్ చేశారు.
 లాస్ ఏంజిల్స్ లో అదృశ్యమైన భారతీయ విద్యార్థిని నితీషా కందుల
లాస్ ఏంజిల్స్ లో అదృశ్యమైన భారతీయ విద్యార్థిని నితీషా కందుల

లాస్ ఏంజిల్స్ లో అదృశ్యమైన భారతీయ విద్యార్థిని నితీషా కందుల

Hyderabad Student Safe : కాలిఫోర్నియాలో గత వారం కనిపించకుండా పోయిన 23 ఏళ్ల నితీషా కందుల సురక్షితంగా బయటపడినట్లు పోలీసులు మంగళవారం ధృవీకరించారు. హైదరాబాద్ కు చెందిన నితీషా కందుల కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ, శాన్ బెర్నార్డినో (సీఎస్యూఎస్బీ)లో చదువుతున్నారు. మే 28న ఆమె అదృశ్యం అయినట్లు వార్తలు వచ్చాయి. సీఎస్ యూఎస్ బీ చీఫ్ ఆఫ్ పోలీస్ జాన్ గుటిరెజ్ మంగళవారం సోషల్ మీడియాలో ఆమె అదృశ్యంపై అప్డేట్ ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

Medak Crime : మెదక్ జిల్లాలో విషాదం, సెల్ ఫోన్ కొనివ్వలేదని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

Warangal ATM Robbery : ఏటీఎమ్ సెంటర్లలో లవర్స్ చోరీలు-ప్లాస్టిక్ పట్టీలు,స్క్రూడ్రైవర్, ఫెవిక్విక్ తో కస్టమర్లకు బురిడీ

Smita Sabharwal : దివ్యాంగులపై స్మితా సబర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు- స్పందించిన మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క

Union Budget :కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి 'గుండు సున్నా', తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం-కేటీఆర్, హరీశ్ రావు

హైదరాబాద్ విద్యార్థిని సురక్షితం

"లాస్ ఏంజిల్స్ లో మే 28న తప్పిపోయినట్లు వార్తలు వచ్చిన విద్యార్థిని ఆచూకీ లభించింది. ఆమె సురక్షితంగా ఉంది" అని ఎక్స్ లో పోలీసు అధికారులు ట్వీట్ చేశారు. నితీషా కందుల మిస్సింగ్ పై మే 30న లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ సౌత్ వెస్ట్ డివిజన్ లో ఫిర్యాదు చేశారు. అదృశ్యానికి ముందు ఆమె చివరిసారిగా మే 28న కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో కనిపించారు. కాలిఫోర్నియా లైసెన్స్ పొందిన టయోటా కరోలా కారును కందుల నడుపుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు... ఆమె ఆచూకీపై ఏదైనా సమాచారం తెలిసిన వారు ముందుకు రావాలని ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. అనంతరం ఆమె సమాచారం దొరికినట్లు, సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు మరో ట్వీట్ చేశారు. అయితే ఆమె అదృశ్యానికి ఇంకా కారణాలు వెల్లడించలేదు.

పలు అదృశ్యాలు విషాదాంతం

ఏప్రిల్ లో హైదరాబాద్ కు చెందిన మరో భారతీయ విద్యార్థి మహ్మద్ అబ్దుల్ అర్ఫత్ (25) క్లీవ్ ల్యాండ్ లో శవమై కనిపించారు. క్లీవ్ ల్యాండ్ యూనివర్సిటీలో చేరిన ఆయన మార్చి నుంచి కనిపించకుండా పోయారు. 26 ఏళ్ల రూపేష్ చంద్ర చింతకిండి మే 2 నుంచి చికాగోలో కనిపించకుండా పోయాడు. నితీషా కందుల అదృష్టవశాత్తూ వారం రోజుల్లో దొరికిందని, అందరికీ ఇలా అదృష్టం కలిసిరాదని పోలీసులు తెలిపారు.

తదుపరి వ్యాసం