తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  First Gold Atm In Hyderabad: గోల్డ్ Atm.. బంగారం ఎలా డ్రా చేయాలో తెలుసా..?

First Gold ATM in Hyderabad: గోల్డ్ ATM.. బంగారం ఎలా డ్రా చేయాలో తెలుసా..?

HT Telugu Desk HT Telugu

14 December 2022, 10:09 IST

google News
    • India's First Gold ATM: ఏటీఎం( automated teller machine)...అనగానే డబ్బు డ్రా చేయడం గుర్తుకువస్తుంది. కానీ ఇకపై గోల్డ్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఈ మధ్యనే హైదరాబాద్ నగరంలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదండోయ్ త్వరలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా ఏర్పాటు కానున్నాయి. అయితే ఇవి ఎలా పని చేస్తాయనేది చూడండి. 
హైదరాబాద్ లో గోల్డ్ ఏటీఏం
హైదరాబాద్ లో గోల్డ్ ఏటీఏం (ANI)

హైదరాబాద్ లో గోల్డ్ ఏటీఏం

India's First Gold ATM in Hyderabad: ఏటీఎమ్‌ వెళ్తున్నామంటే ఆర్థిక లావాదేవీల గురించే అని చెప్పొచ్చు..! ఇకపై అర్థం మారిపోయింది. గోల్డ్ కు సంబంధించి కూడా ATMలకు వెళ్లొచ్చు. డైరెక్ట్ గా వీటి ద్వారానే బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇలాంటి అద్భుతమైన సర్వీస్ కు వేదికైంది మన హైదరాబాద్ నగరం. దేశంలోనే తొలి గోల్డ్‌ ఏటీఎంను కొద్దిరోజుల కిందటే హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. గోల్డ్‌ సిక్కా ఆధ్వర్యంలో బేగంపేటలోని అశోకా రఘుపతి చాంబర్స్‌లో ఉన్న సంస్థ కార్యాలయంలో ఈ ఏటీఎంను ప్రారంభించారు. ఈ ఏటీఎంల ద్వారా డెబిట్, క్రెడిట్‌ కార్డు సహాయంతో బంగారం విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఇది ఎలా పని చేస్తుంది..? ఎంతవరకు బంగారం పొందవచ్చు..? అనేది చూస్తే.....

ఎలా డ్రా చేసుకోవాలంటే..?

ఈ గోల్డ్ ATM క్యాష్‌ ఏటీఎంల మాదిరిగానే పనిచేస్తుంది.

మొదటగా ఏటీఎంపై ‘క్లిక్‌ హియర్‌ టు బై గోల్డ్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. అక్కడ క్లిక్‌ చేయండి.

మీరు ఎంత బంగారాన్ని కొనుగోలు చేయాలో ఎంచుకోవాలి. అక్కడ 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాములు ఇలా వివిధ సంఖ్యలు అందుబాటులో ఉంటాయి. మీకు కావాల్సిన నెంబర్ ను క్లిక్ చేయాలి.

నెక్స్ట్ మీరు డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల్లో ఏ కార్డును ఉపయోగిస్తారో తెలపాలి.

తర్వాత కార్డు Insert చేసి మీ PIN ఎంటర్‌ చేయాలి.

లావాదేవీ విజయవంతమైన తర్వాత ఏటీఎం కింది భాగం నుంచి మీరు ఎంచుకున్న బరువుకు సంబంధించి గోల్డ్‌ కాయిన్‌ వస్తుంది.

మీ లావాదేవీకి సంబంధించి వివరాలు వస్తాయి. ఇందులో బంగారం నాణ్యత, బరువు వివరాలు ఉంటాయి.

ఇక ఈ గోల్డ్‌ ఏటీఎం 24 గంటలపాటు అందుబాటులో ఉంటుంది. బడ్జెట్‌ అనుసరించి బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. బంగారం ధరలు ఎప్పటికప్పుడు ఏటీఎం స్క్రీన్‌పై కనిపిస్తాయి. ట్యాక్స్‌లు కూడా కలిపే ఉంటాయి. ఇక లావాదేవీలు జరిగిన తర్వాత గోల్డ్ కాయిన్‌ రాకపోతే 24 గంటల్లో మీ డబ్బు రీఫండ్‌ చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని బేగంపేట లో ఏర్పాటు కాగా... త్వరలో నగరంలోని సికింద్రాబాద్‌, గుల్జార్‌హౌస్‌, అబిడ్స్‌లో ఏర్పాటు కానున్నాయి. అంతేకాదు త్వరలోనే పలు జిల్లా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేస్తామని గోల్డ్ సిక్కా సంస్థ అధికారులు ప్రకటించారు. ఇందులో పెద్దపల్లి, వరంగల్‌, కరీంనగర్‌ నగరాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం