తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgpsc Group 3 Exam : తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థులకు మరో అప్డేట్ - జిల్లాల వారీగా ప్రత్యేక నెంబర్లు..!

TGPSC Group 3 Exam : తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థులకు మరో అప్డేట్ - జిల్లాల వారీగా ప్రత్యేక నెంబర్లు..!

15 November 2024, 14:48 IST

google News
    • TGPSC Group 3 Exam Updates : గ్రూప్ 3 పరీక్షలకు టీజీపీఎస్సీ సర్వం సిద్ధం చేసింది. నవంబర్ 17, 18 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే  హాల్‌టికెట్ల జారీలో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం జిల్లాల వారీగా హెల్ప్‌ లైన్‌ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
తెలంగాణ గ్రూప్ 3 పరీక్షలు
తెలంగాణ గ్రూప్ 3 పరీక్షలు

తెలంగాణ గ్రూప్ 3 పరీక్షలు

గ్రూప్‌-3 పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు సిద్ధం చేసింది. నవంబర్‌ 17, 18 తేదీల్లో జరిగే ఈ పరీక్షల కోసం సెంటర్ల వద్ద పకడ్బందీ చర్యలను చేపట్టనుంది. మరోవైపు ఇప్పటికే హాల్ టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రక్రియలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు టీజీపీఎస్సీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

అభ్యర్థుల ఇబ్బందులను నివృత్తి చేసేందుకు జిల్లాల వారీగా హెల్ప్‌ లైన్‌ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఫోన్ నెంబర్లతో కూడిన జాబితాను వెబ్ సైట్ లో విడుదల చేసింది.

నవంబర్ 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్‌లో పేపర్ -1 ఎగ్జామ్ ఉంటుంది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి 05:30 వరకు సెకండ్ పేపర్ పరీక్ష జరుగుతుంది. ఇక నవంబర్ 18వ తేదీన పేపర్-3 ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతుంది. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని తెలిపింది.

గ్రూప్ 3 హాల్ టికెట్లను ఇలా డౌన్లోడ్ చేసుకోండి...

  1. గ్రూప్ 3 అభ్యర్థులు TGPSC వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ పై క్లిక్ చేయాలి.
  2. హోమ్ పేజీలో కనిపించే Download Hall Ticket For Group-III Services ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  3. ఆ తర్వాత ఓపెన్ అయ్యే విండోలో TGPSC ID , పుట్టిన తేదీ వివరాలు ఎంట్రీ చేయాలి.
  4. డౌన్లోడ్ పీడీఎఫ్ పై క్లిక్ చేస్తే హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.
  6. ఈ లింక్ పై క్లిక్ చేసి నేరుగా గ్రూప్ 3 హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు

తెలంగాణ గ్రూప్ 3 పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపరు రాసేందుకు రెండున్నర గంటల సమయం ఉంటుంది. ప్రతి పేపర్‌లోనూ 150 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేయనున్నారు. గ్రూప్ 3 పోస్టులకు ఎలాంటి ఇంటర్వూ ఉండదు.

ఈ గ్రూప్ 3 నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 1,388 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా సెంటర్లను ఖరారు చేశారు. ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

తదుపరి వ్యాసం