Gold Rate Today: తగ్గిన బంగారం, వెండి ధరలు - హైదరాబాద్ లో ఎంతంటే
01 September 2022, 9:20 IST
- Gold and Silver Price today 1st september 2022: కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. అయితే బుధవారం స్వల్పంగా పెరిగిన రేట్లు... ఇవాళ తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 51,270గా నమోదైంది. మరోవైపు ఇవాళ వెండి భారీగా తగ్గింది.
బంగారం వెండి ధరలు
Gold silver price today 1st september 2022: బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా.. ధరలు పైపైకి వెళ్లాయి. బుధవారం ధరలు స్వల్పంగా పెరగగా... ఇవాళ మళ్లీ దిగివచ్చాయి.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 270 తగ్గగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 దిగివచ్చింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 51,270గా నమోదైంది.
22 క్యారెట్ల బంగారం రేటు రూ. 47,000 వద్ద కొనసాగుతోంది. ఇక ఇవాళ వెండిపై రూ. 3200 తగ్గగా...హైదరాబాద్ మార్కెట్ కిలో వెండి ధర రూ.60,000గా ఉంది
Gold silver price: ఏపీలో ఇలా…
gold silver prices in ap: విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.47,000గా ఉంది. 24 క్యారెట్స్ బంగారం ధర 51,270గా నమోదైంది. ఇక్కడ వెండి ధర కిలో రూ. 60,000 వద్ద కొనసాగుతోంది. ఇక విశాఖపట్నం మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,270గా ఉంది.
Gold silver price: పలు నగరాల్లో ఇలా..
gold and silver rate in india: దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరల్లో వ్యత్యాసం ఉంది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,540గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,860గా ఉంది.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,270గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,150గా ఉంటే… 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,440 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,050గా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,320 వద్ద ఉంది. ఇక కోల్ కత్తాలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 51,270గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,000 వద్ద కొనసాగుతోంది.
Platinum Price today: ప్లాటినం ధరలు ఇలా..
ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 700 చొప్పున తగ్గింది. హైదరాబాద్లో ప్లాటినతం ధర 10 గ్రాములకు రూ. 21,410గా ఉంది. విజయవాడలో, విశాఖపట్నంలోనూ ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 21,410గా ఉంది.
ప్రపంచ మార్కెట్లో పసిడి ధరలు పెరగడానికి అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉన్నాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనే రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల వంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి.