Hyd To Uttarakhand IRCTC Tour: దేవ్ భూమి ఉత్తరాఖండ్ లో ప్రముఖ ప్రదేశాల సందర్శన, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ
06 October 2024, 13:39 IST
- Hyderabad To Uttarakhand IRCTC Tour : దేవ్ భూమి ఉత్తరాఖండ్ లో ప్రముఖ ప్రదేశాలు, ఆలయాల సందర్శనకు ఐఆర్సీటీసీ హైదరాబాద్ నుంచి 11 రోజులు టూర్ ప్యాకేజీ అందిస్తుంది. తదుపరి టూర్ నవంబర్ 3వ తేదీన ప్రారంభం అవుతుంది.
దేవ్ భూమి ఉత్తరాఖండ్ లో ప్రముఖ ప్రదేశాల సందర్శన, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ
దేవ్ భూమి ఉత్తరాఖండ్ లో ప్రముఖ ప్రదేశాల సందర్శన, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ
ఐఆర్సీటీసీ హైదరాబాద్ నుంచి దేవ్ భూమి ఉత్తరాఖండ్ కు ప్రత్యేక ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. ఐఆర్సీటీసీ, ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్‌మెంట్ బోర్డ్ సంయుక్తంగా దేశంలోని ప్రముఖ ప్రదేశాలు, ఆలయాలను కవర్ చేస్తూ “భారత్ గౌరవ్ మానస్‌ఖాండ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా దేవ్ భూమి ఉత్తరాఖండ్ యాత్ర” ప్రారంభించింది.
టూర్ ముఖ్యాంశాలు :
- టూర్ పేరు – భారత్ గౌరవ్ మానస్ ఖండ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా దేవ్ భూమి ఉత్తరాఖండ్ యాత్ర
- టూర్ వ్యవధి - 10 రాత్రులు/11 రోజులు
- ప్రారంభమయ్యే ప్రదేశం - హైదరాబాద్/సికింద్రాబాద్
- పర్యటన తేదీ – 03.11.2024
టూర్ ప్యాకేజీ ధర (ఒక్కో వ్యక్తికి)
క్లాస్ -పెద్దలు- పిల్లలు(5-11 సంవత్సరాలు)
- స్టాండర్ట్ -రూ.37,220-రూ.37,220
- డీలక్స్- రూ.46,945- రూ. 46,945
- టూర్ ప్రయాణం : కత్గోడం –భీమ్ తాల్(2 రాత్రులు) - నైనిటాల్ - అల్మోరా (2 రాత్రి) - కౌసని (2 రాత్రి) – రాణిఖేత్ - కత్గోడం
- రైలు ప్రయాణం - హైదరాబాద్ - కత్గోడం - హైదరాబాద్
- బోర్డింగ్/డీబోర్డింగ్ స్టేషన్‌లు - హైదరాబాద్, వరంగల్, బల్హర్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, ఆగ్రా
- సీట్ల సంఖ్య - 300 (థర్డ్ ఏసీ)
కవర్ చేసే ప్రదేశాలు -
- భీమ్ తాల్
- నైనిటాల్ - నైనా దేవి ఆలయం, నైని సరస్సు
- కైంచి యాత్ర - బాబా నీమ్ కరోలి ఆలయం
- కసర్ దేవి, కతర్మల్ సూర్య దేవాలయం
- జగేశ్వర్ యాత్ర
- గోలు దేవత - చితై
- అల్మోరా - నందా దేవి ఆలయం,
- బైజ్నాథ్
- బాగేశ్వర్
- కౌసని
- రాణిఖేత్
టూర్ ఇలా….
- 01వ రోజు (03.11.2024) - హైదరాబాద్ లో మధ్యాహ్నం 3.00 గంటలకు టూరిస్టులను రిసీవ్ చేసుకుని, 4.00 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రైలు బయలుదేరుతుంది.
- 02వ రోజు (04.11.2024) - జర్నీ
- 03వ రోజు(05.11.2024) - ఉదయం కత్గోడం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. రైలు దిగి భీమ్‌తాల్‌కు వెళ్తారు. భీమ్‌తాల్ హోటల్ లో చెక్ ఇన్ చేస్తారు. సాయంత్రం భీమ్‌తాల్ సరస్సును సందర్శిస్తారు. రాత్రికి భీమ్‌తాల్‌లో బస చేస్తారు.
- 04వ రోజు (06.11.2024) - ఉదయం హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ తర్వాత నైనిటాల్ సందర్శించడానికి వెళ్తారు. నైనిటాల్ లో నైనాదేవి ఆలయాన్ని దర్శించుకుంటారు. సొంత ఖర్చుతో బోటింగ్, షాపింగ్ చేసుకోవచ్చు. తిరిగి భీమ్‌తాల్‌కు తిరిగి వెళ్తారు. రాత్రికి భీమ్‌తాల్‌లో బస చేస్తారు.
- 05వ రోజు (07.11.2024) - అల్పాహారం తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ చేస్తారు. కైంచి ధామ్ - బాబా నీమ్ కరోలి ఆలయం మీదుగా అల్మోరాకు వెళ్తారు.
- అల్మోరా చేరుకుని హోటల్ లో దిగుతారు. కాసర్ దేవి ఆలయాన్ని దర్శించుకుంటారు. అల్మోరాలోనే రాత్రి బస చేస్తారు.
- 06వ రోజు (08.11.2024) - బ్రేక్ ఫాస్ట్ అనంతరం నందా దేవి ఆలయం, జాగేశ్వర్ ఆలయాన్ని దర్శించుకుంటారు. అల్మోరాకు తిరిగి వెళ్లేటప్పుడు గోలు చిటై ఆలయాన్ని సందర్శిస్తారు. అల్మోరాలో రాత్రి బస చేస్తారు.
- 07వ రోజు (09.11.2024) - కతర్మల్ సూర్య దేవాలయాన్ని సందర్శించుకుంటారు. కౌసనికి చేరుకుని హోటల్ లో చెక్-ఇన్ చేస్తారు.
- 08వ రోజు (10.11.2024) - బైజ్‌నాథ్‌కు వెళ్లి బైజ్‌నాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. బాగేశ్వర్ ఆలయాన్ని దర్శించుకుంటారు. కౌసనిలో రాత్రి బస చేస్తారు.
- 09వ రోజు (11.11.2024) - బ్రేక్ ఫాస్ట్ అనంతరం హోటల్ చెక్ అవుట్ చేసి రాణిఖేత్‌కి వెళ్తారు. తిరుగు ప్రయాణం కోసం కత్గోడం రైల్వే స్టేషన్‌కు వెళ్తారు.
- 10వ రోజు (12.11.2024) - రిటర్న్ జర్నీ
- 11వ రోజు (13.11.2024) - హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో పర్యటన ముగుస్తుంది.