తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Begumpet Women: తుపాకీతో బెదిరించినా… దోపిడీ దొంగలకు ఎదురు తిరిగిన తల్లీ కూతుళ్లు.. బేగంపేటలో ఘటన

Begumpet Women: తుపాకీతో బెదిరించినా… దోపిడీ దొంగలకు ఎదురు తిరిగిన తల్లీ కూతుళ్లు.. బేగంపేటలో ఘటన

Sarath chandra.B HT Telugu

22 March 2024, 6:53 IST

google News
    • Begumpet Women: ఇంట్లో దోపిడీ కోసం వచ్చిన ఇద్దరు యువకుల్ని తల్లీ కూతుళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు. తుపాకీ చూపినా వెరువకుండా  వారిని తిప్పి కొట్టారు.   స్థానికులతో కలిసి వెంటాడి పట్టుకున్నారు. 
దోపిడీ కోసం వచ్చిన యువకుడితో ప్రతిఘటిస్తున్న తల్లీ కూతుళ్లు
దోపిడీ కోసం వచ్చిన యువకుడితో ప్రతిఘటిస్తున్న తల్లీ కూతుళ్లు

దోపిడీ కోసం వచ్చిన యువకుడితో ప్రతిఘటిస్తున్న తల్లీ కూతుళ్లు

Begumpet Women: కొరియర్‌ డెలివరీ బాయ్స్‌ Courier Delivery రూపంలో పట్టపగలు ఇంట్లోకి చొరబడి తుపాకీతో  దోపిడీ Robbery కోసం బెదిరించిన దుండగుల్ని ఓ మహిళ ధైర్యంగా ఎదిరించింది. నిందితుడితో కలబడింది. తీవ్రంగా పెనుగులాడి అతడిని తిప్పి కొట్టింది. తల్లిని కాపాడేందుకు 17ఏళ్ల కూతురు కూడా అండగా వచ్చింది. ఇద్దరు కలిసి హెల్మెట్ తొలగించి చితకబాదారు. నిందితుడ్ని గతంలో తమ ఇంట్లో పనిచేయడానికి వచ్చిన వ్యక్తిగా గుర్తించారు.

నాటు తుపాకీతో దోపిడీకి ప్రయత్నించి తల్లి కూతుళ్ల నుంచి ఎదురైన ప్రతిఘటనతో పిక్క బలం చూపించిన నిందితుల్ని స్థానికులు వెంటాడి పట్టుకున్నారు. దుండగుల్ని యూపీకి చెందిన వారిగా గుర్తించారు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

బేగంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రసూల్‌పుర జైన్‌ కాలనీ Jain Colonyలో నవరతన్‌ జైన్‌ కుటుంబం నివాసం ఉంటోంది. గురువారం మధ్యాహ్నం కాలనీలోని వారింటికి కొరియర్ డెలివరీ బాయ్స్ వచ్చారు. ఆ సమయంలో నవరతన్‌ జైన్‌ ఇంట్లో లేరు. ఆయన భార్య అమిత మేహోత్‌, కుమార్తె, పనిమనుషులు ఉన్నారు. మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో అమిత, ఆమె కుమార్తె, పనిమనిషి ఇంట్లో ఉన్న సమయంలో ఇద్దరు యువకులు నేరుగా కొరియర్ అంటూ ప్రధాన గేటు నుంచి లోపలకు వచ్చారు.

గుమ్మం బయటే ఉండాలని అమిత సూచిస్తుండగానే ఇద్దరిలో ఓ వ్యక్తి నేరుగా ఇంట్లోకి చొరబడ్డాడు. హెల్మెట్ ధరించి ఉన్న వ్యక్తి నాటు తుపాకీని ఆమెకు గురిపెట్టాడు. మరో యువకుడు వంట గదిలో ఉన్న పనిమనిషి మెడపై కత్తి పెట్టాడు. ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు ఇవ్వాలని బెదిరించారు.

హెల్మెట్ ధరించి తుపాకీ గురిపెట్టిన వ్యక్తిని కాలితో తన్నిన అమిత, అతనితో కలబడింది. తలుపు బయటకు నెట్టుకుంటూ వచ్చి, అతనితో కలబడింది. తల్లికి సాయంగా అమిత కుమార్తె కూడా నిందితుడితో పెనుగులాటకు దిగింది. ఈ క్రమంలో హెల్మెట్ ఊడిపోయింది. నిందితుడి చేతిలో ఉన్న తుపాకీని గుంజుకుంది.

పెనుగులాటలో నిందితుడు ధరించిన హెల్మెట్ పడిపోయింది. ఆ సమయంలో అతను గతంలో తమ ఇంట్లో పని చేసిన వ్యక్తిగా గుర్తించారు. ఏడాది క్రితం ఇంటిని శుభ్రం చేయడానికి వచ్చిన వారిలో ఒకరిగా అమిత గుర్తించారు. యూపీకి చెందిన సుశీల్‌కుమార్‌గా పేర్కొన్నారు.

అతనితో పాటు వచ్చిన మరో నిందితుడు ప్రేమ్ చంద్‌ వంట గదిలో ఉన్న పనిమనిషిని కత్తితో బెదిరించాడు. సుశీల్‌కుమార్‌తో పెనుగులాడుతున్న సమయంలో మరో మార్గంలో పారిపోయేందుకు ప్రయత్నించాడు. పనిమనిషిని ఇంటకి మరో మార్గం ఉందా అని అడిగినా లేదని చెప్పడంతో లోపలే ఉండిపోయాడు.

మొదటి నిందితుడు తప్పించుకుని పారిపోయిన తర్వాత బాధితులు వీధిలోకి వెళ్లి కేకలు వేశారు. ఇరుగు పొరుగు వారితో కలిసి లోపలకు వస్తున్న క్రమంలో వారిని నెట్టుకుంటూ బయటకు పారిపోయాడు. ప్రధాన ద్వారం నుంచి బయటకు పరుగులు తీస్తుండగా స్థానికులు పట్టుకున్నారు.

అంతకు ముందు తల్లీకూతుళ్ల దెబ్బకు బిత్తరపోయిన సుశీల్‌కుమార్‌ వీధిలోకి పరుగులు తీశాడు. నిందితుడితో కలబడుతున్న సమయంలో అమిత కుమార్తె గట్టిగా కేకలు వేయంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. దీంతో తుపాకీని వదిలేసి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలసులు ప్రేమ్‌చంద్‌ను అదుపులోకి తీసుకున్నారు.

తుపాకీతో బెదిరించి నిందితుడు ప్రేమ్‌చంద్‌ రైల్లో పారిపోతుండగా కాజీపేటలో జిఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు అమిత ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు.

గతంలో ఇంటిని శుభ్రం చేయడానికి వచ్చినపుడు వారింట్లో నగలు ఉంటాయని గుర్తించి పథకం ప్రకారమే ఈ దోపిడీకి యత్నించారు. ఇంట్లో పనిచేసిన సమయంలో పగలు తల్లీ కూతుళ్లు ఒంటరిగా ఉంటారని గుర్తించి దాడికి ప్రయత్నించారు. తల్లీ కూతుళ్ల సాహసం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తదుపరి వ్యాసం