తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Koushik Reddy: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై మూడు కేసులు నమోదు.. అనుచిత ప్రవర్తనపై స్పీకర్‌కు సంజయ్ ఫిర్యాదు

BRS Koushik Reddy: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై మూడు కేసులు నమోదు.. అనుచిత ప్రవర్తనపై స్పీకర్‌కు సంజయ్ ఫిర్యాదు

13 January 2025, 14:03 IST

google News
    • BRS Koushik Reddy: జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేపై దౌర్జన్యం చేసిన వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది.  ఆదివారం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే సంజయ్‌పై కౌశిక్ రెడ్డి  దౌర్జన్యం చేయడంపై కేసు నమోదు చేశారు. 
కౌశిక్‌ రెడ్డిపై మూడు కేసులు నమోదు
కౌశిక్‌ రెడ్డిపై మూడు కేసులు నమోదు

కౌశిక్‌ రెడ్డిపై మూడు కేసులు నమోదు

BRS Koushik Reddy: కరీంనగర్‌ జిల్లా సమీక్షా సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కాశిక్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. కౌశిక్‌ రెడ్డిపై మూడు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ ఆర్డివో ఇచ్చిన ఫిర్యాదుతో పాటు, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏల ఫిర్యాదులతో మూడు వేర్వేరు కేసులను పోలీసులు నమోదు చేశారు.

బీఎన్ఎస్ యాక్టు 132, 115 (2), 352,292 కింద పాడి కౌశిక్‌ రెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి. మరో ఫిర్యాదుపై 126 (2),115(2) పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆదివారం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో సంజయ్ మాట్లాడుతుండగా కౌశిక్‌ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది.

జిల్లా సమీక్షా సమావేశంలో అందరి ముందే ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ ఒకరినొకరు నెట్టుకున్నారు. సంజయ్‌ మాట్లాడుతుండగా కౌశిక్‌ రెడ్డి అడ్డుకుని నువ్వే పార్టీ, నువ్వెందుకు మాట్లాడుతున్నావని గొడవ పెట్టుకున్నారు. ఆతర్వాత వేదిక పైనే ఒకరినొకరు నెట్టుకున్నారు. దీంతో పోలీసులు బలవంతంగా కౌశిక్‌ రెడ్డిని సమావేశం నుంచి బయటకు తీసుకువెళ్లారు.

ప్రభుత్వ పథకాలపై చర్చ జరుగుతుండగా తన నియోజక వర్గ సమస్యలపై సంజయ్ మాట్లాడటానికి ఉపక్రమిస్తుండగా కౌశిక్‌ రెడ్డి అడ్డు తగిలారు. తుండగా . ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సహా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మైక్ తీసుకుని మాట్లాడే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన కాశిక్ రెడ్డి నువ్వు ఏ పార్టీ అంటూ సంజయ్‌ను నిలదీశారు. దమ్ముంటే కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు.తాను కాంగ్రెస్‌ పార్టీ అని సంజయ్ బదులివ్వడంతో వివాదం పెరిగింది.

ఒకరినొకరు విమర్శించుకునే క్రమంలో సంజయ్‌ను కౌశిక్‌ రెడ్డి నెట్టివేయడంతో ఇద్దరి మధ్య ఘర్ష జరిగింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో మిగిలిన ఎమ్మెల్యేలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కౌశిక్ రెడ్డిని కలెక్టరేట్ నుంచి బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. బీఆర్ఎస్ తరపున గెలిచిన సంజయ్‌కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడడం ఏంటని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.

మరోవైపు మీటింగ్‌లో హైలెట్‌ కావడానికి కౌశిక్ రెడ్డి వివాదం సృష్టించారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. కౌశిక్‌ రెడ్డి తీరును మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొన్నం తప్పు పట్టారు. మరోవైపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అమ్ముడుపోయారని పాడి కొశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై కౌశిక్‌రెడ్డిపై మూడు కేసులు నమోదు చేశారు. పాడి కౌశిక్‌ రెడ్డి వ్యవహార శైలిపై ఎమ్మెల్యే సంజయ్‌ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. సభలో మాట్లాడుతుండగా అసభ్యంగా ప్రవర్తించి, దూషించారని, కౌశిక్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

తదుపరి వ్యాసం